నాణ్యమైన సేవలు అందించాలి | Sakshi
Sakshi News home page

నాణ్యమైన సేవలు అందించాలి

Published Fri, Apr 19 2024 1:25 AM

మాట్లాడుతున్న సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి  - Sakshi

వర్ధన్నపేట : విద్యుత్‌ వినియోగదారులకు నాణ్య మైన సేవలందించాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. వర్ధన్నపేటలోని పుస్కోస్‌ పాఠశాలలో సిబ్బందికి రెండురోజుల శిక్షణను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం 33 కేవీ, 11 కేవీ, ఎల్‌టీ లైన్లను నిరంతరం పెట్రోలింగ్‌ చేయాలన్నారు. పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్‌ చేయాలని సూచించారు. ప్రతినెల 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. కొత్తగా చేరిన జేఎల్‌ఎంలకు ప్రత్యేకంగా నాలుగు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు టి.మధుసూదన్‌, ఎ.ఆనందం, బి.భిక్షపతి, సంజీవరావు, కె.రాజు, తరుణ్‌, నిఖిల్‌, 50 మంది ఫీల్డ్‌సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement