కార్మికవర్గం ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలి | Sakshi
Sakshi News home page

కార్మికవర్గం ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలి

Published Wed, May 8 2024 7:50 AM

కార్మికవర్గం ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలి

తుంగతుర్తి : దేశంలో మత ప్రాతిపదికన పాలన సాగించాలని చూస్తున్న బీజేపీకి కార్మిక వర్గం గట్టి బుద్ధిచెప్పాలని, కార్మిక హక్కులకు అండగా నిలిచిన ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో శ్రీపార్లమెంట్‌ ఎన్నికలు– కార్మికుల కర్తవ్యంశ్రీఅనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో కోట్లాదిమంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని, వారికి కనీస వేతనాలు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పోరాడి సాధించిన 44కార్మిక చట్టాలలో 29చట్టాలను కుదించి నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చి కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేసే విధానాలను అమలు చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే కుట్ర ఇప్పటి నుంచే చేస్తుందన్నారు. సదస్సులో యల్క సోమన్న, చెరుకు యాకసోమన్న, యాక లక్ష్మి, అనంతరం మల్లయ్య, రాధాకృష్ణ, శ్రీనివాస్‌, వచ్చే సైదులు, శేఖర్‌, మన్సూర్‌, వెంకన్న, సతీష్‌, పరశురాం, శ్రీను, విజయ్‌, యాదగిరి, చంద్రకళ, శోభ, ఉమ, అనిత పాల్గొన్నారు.

ఫ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు

Advertisement

తప్పక చదవండి

Advertisement