క్లాసికల్‌ డ్యాన్స్‌‌తో అదరగొట్టిన సాయేషా | Sakshi
Sakshi News home page

క్లాసికల్‌ డ్యాన్స్‌‌తో అదరగొట్టిన సాయేషా

Published Fri, May 15 2020 7:15 PM

Sayyeshaa Saigal Shares Classical Dance Video - Sakshi

కరోనా లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖుల్లో చాలా మంది సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రముఖ తమిళ హీరో ఆర్య సతీమణి, హీరోయిన్‌ సాయేషా సైగల్ కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఓ సాంగ్‌కు క్లాసికల్‌ డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు సాయేషా డ్యాన్స్‌ అద్భుతంగా ఉందంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయేషా గతంలో కూడా తన డ్యాన్స్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్‌)

కాగా, బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ మనవరాలైన సాయేషా.. తెలుగు చిత్రం అఖిల్‌తో వెండితెరకు పరిచమయ్యారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో.. తెలుగులో ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. అఖిల్‌ అనంతరం బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌.. శివాయ్‌ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆమె తమిళంలో పలు చిత్రాల్లో నటించారు. గతేడాది హీరో ఆర్యను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి తమిళ చిత్రం కాగా, మరోకటి కన్నడ చిత్రం. 

Advertisement
Advertisement