లోక్‌సభ ఎలక్షన్స్.. రతన్ టాటా సందేశం | Ratan Tata Message for Mumbaikars | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎలక్షన్స్.. రతన్ టాటా సందేశం

Published Sat, May 18 2024 7:38 PM | Last Updated on Sat, May 18 2024 7:48 PM

Ratan Tata Message for Mumbaikars

భారతదేశంలో ఇప్పటికే నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓటర్లను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.

మే 20న ముంబైలో (ఫేజ్ 5) ఓటింగ్ జరగనుంది. ముంబై వాసులందరూ బయటకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను.. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. తప్పకుండా ఓటు వేస్తామన్నట్లు చెబుతున్నారు.

ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ముంబై సిటీ, ముంబై సబర్బన్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement