కేజ్రీవాల్‌ భార్యకు కోపం వచ్చింది | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ భార్యకు కోపం వచ్చింది

Published Mon, May 15 2017 11:20 AM

కేజ్రీవాల్‌ భార్యకు కోపం వచ్చింది

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసి ఈడ్చుకెళ్లి తీహార్‌ జైలులో పడేస్తానంటూ వ్యాఖ్యానించిన ఆప్‌ బహిష్కృత నేత కపిల్‌ మిశ్రాపై కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధపు ఆరోపనణ చేసిన మిశ్రా భవిష్యత్‌ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘ ప్రకృతి ధర్మం ఎప్పుడూ తప్పుకాదు. అవన్నీ నమ్మకద్రోహంలో నుంచి పుట్టినవి, తప్పుడు ఆరోపణలు చేశారు.

జరగబోయే పరిణామాలన్నింటికి అతడు (కపిల్‌ మిశ్రా) బాధ్యత వహిస్తాడా? ఆహ్వానిస్తాడా’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి తన నల్లధనాన్ని తెల్లధనంగా కేజ్రీవాల్‌ మార్చుకున్నారని, ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించారని కపిల్‌ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ చేసిన తప్పులకు ఆయన కాలర్‌ పట్టుకొని తీసుకెళ్లి తీహార్‌ జైలులో పడేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ భార్య స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement