-
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
-
పేర్ని కిట్టు నామినేషన్ కార్యకర్తగా మారిన పేర్ని నాని
-
నేను లేనుగా.. ఎవరితో చేస్తారో చేసుకోండి: నాని
ప్రస్తుతం అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 'పుష్ప 2', 'సలార్ 2'.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని మూవీస్ లైన్లో ఉన్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలే కాదు మ్యాడ్ 2, ప్రేమలు 2 లాంటివి కూడా సెట్స్‌పైకి వెళ్లాయి. దీంతో ఆటోమేటిక్‌గా హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి రిక్వెస్ట్ హీరో నానికి ఎదురైంది. దీనికి అతడు ఇచ్చిన సమాధానం కూడా అంతే ఆసక్తికరంగా అనిపించింది. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) నేచురల్ స్టార్ నాని కెరీర్లో బెస్ట్ మూవీ అంటే 'జెర్సీ' అని చెప్పొచ్చు. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ చిత్రం ఎలాంటి కమర్షియల్ అంశాలు లేనప్పటికీ అద్భుతమైన హిట్‌గా నిలిచింది. ప్రేక్షకుల ముందుకొచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని రీసెంట్గా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో రీ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే 'జెర్సీ' మూవీకి సీక్వెల్ కావాలని నానికి అభిమానుల నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తాజాగా 'ఆ ఒక్కటి అడక్కు' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న నానికి ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో.. 'నేను లేనుగా, ఎవరితో చేస్తారో చేసుకోండి' అని నాని సమాధానమిచ్చాడు. నాని చెప్పిన దానిబట్టి చూస్తే 'జెర్సీ' సీక్వెల్ కష్టమే. ఎందుకంటే సినిమాలో నాని పాత్ర చనిపోతుంది. ఒకవేళ సీక్వెల్ తీయాలన్నా ఈ పాత్ర లేకుండా సాధ్యం అవుతుందా లేదా దర్శకుడికే తెలియాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్) -
వేడుకలో...
నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ కథానాయిక. సాయికుమార్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నాని, సాయికుమార్ ఉన్న కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. సూర్యగా నాని, శంకరంగా సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమాలో ఏదైనా వేడుకకు సంబంధించిన ఫొటో అన్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ‘‘హై బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 29న రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
హాయ్ నాన్నకు అవార్డుల పంట.. ఏకంగా 11 విభాగాల్లో!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. గతేడాది రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్‌తో శౌర్యవ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. న్యూయార్క్‌లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఒనిరోస్ ఫిల్మ్ ప్రకటించిన విభాగాల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్ ట్రాక్, ఉత్తమ ఎడిటింగ్‌ల్లో 11 అవార్డులు గెలుచుకుంది. కాగా.. ఈ చిత్రాన్ని హాయ్ డాడీ పేరుతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు అవార్డ్స్ దక్కడం పట్ల డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement