సాక్షి, గుంటూరు: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాథబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భూ రికార్డుల డిజిటలైజేషన్‌తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారన్నారు.
‘‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లం. ఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుంది. ఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదు’’ అని యడ్లపాటి హితవు పలికారు.
‘‘ఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసింది. జనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదు. చంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలి. చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుంది. అందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు’’ అని యడ్లపాటి రఘునాథబాబు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment