Yadlapati Raghuntha Babu
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాథబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భూ రికార్డుల డిజిటలైజేషన్‌తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారన్నారు.‘‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లం. ఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుంది. ఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదు’’ అని యడ్లపాటి హితవు పలికారు.‘‘ఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసింది. జనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదు. చంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలి. చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుంది. అందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు’’ అని యడ్లపాటి రఘునాథబాబు స్పష్టం చేశారు. -
టొబాకో బోర్డు ఛైర్మన్‌గా రఘునాథబాబు బాధ్యతలు
సాక్షి, గుంటూరు: బీజేపీ సీనియర్ నాయకుడు టొబాకో బోర్డు చైర్మన్‌గా యడ్లపాటి రఘునాథబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రఘునాథ్ బాబుకు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ముస్తఫా, బీజేపీ నాయకులు కంభంపాటి హరిబాబు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ఐటీసీ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. టొబాకో బోర్డు చైర్మన్ పదవిలో రఘునాథబాబు మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. -
మా సమస్యలు పరిష్కరిస్తేనే ఓటేయండి!
* బీజేపీ జాతీయ నాయకత్వంపై సీమాంధ్ర నేతల ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర సమస్యలు పరిష్కరించే వరకు విభజన బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇవ్వొద్దని బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ పార్టీ జాతీయ నాయకత్వాన్ని డిమాండ్ చేసింది. ఉద్యమ కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, తదితరులు బుధవారం పార్టీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్‌ను కలసి బిల్లుకు పది సవరణలను సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సజావుగా సాగాలంటే ముంపునకు గురయ్యే భద్రాచలం ప్రాంతాన్ని సీమాంధ్రలోనే కలపాలని కోరారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరోపక్క పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు హరిబాబు నాయకత్వంలో మరికొంతమంది గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్‌లతో వీరు భేటీ కానున్నారు. సీమాంధ్ర నేతలకు పోటీగా తెలంగాణ బీజేపీ నేతలూ శుక్రవారం ఢిల్లీకి వెళుతున్నారు.