-
Ram Gopal Varma: అర్థం కానీ డిక్షనరీ.. తెలివైన స్వేచ్ఛా జీవి
అతనో అర్థం కానీ డిక్షనరీ. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నచ్చని పని చెయడు. నచ్చిన పని ఎవరు వద్దన్నా ఆపడు. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తాడు. వోడ్కా తాగుతూ సరదాగా ట్వీట్ చేసి..సంచలనంగా క్రియేట్ చేస్తాడు. కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తోనే సినిమా తీసి.. ‘నచ్చితే చూడండి లేకపోతే లేదు’అంటూ కుండ బద్దలు కొట్టేసినట్లు చెప్పేస్తాడు. ఆయనను తిట్టేవాళ్లు ఉన్నారు.. పొగిడేవాళ్లు ఉన్నారు. ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా స్వాతంత్య్రాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనే రామ్‌గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. నేడు(ఏప్రిల్ 7) అతితెలివైన ఈ ఇన్నోసెంట్ ఫెల్లో బర్త్‌డే. ఈ సందర్భంగా ఆర్జీవీ గురించి ఆసక్తికరమైన విషయాలు.. ► వర్మ స్వస్థలం విజయవాడ. 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో జన్మించాడు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడనగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. ► చదువు కంటే ఎక్కువగా సినిమాలపైనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ చదివే సమయంలో తరచూ సినిమాలకు వెళ్లేవాడట. ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారు. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఎప్పటికైన తన పేరు కూడా అలానే తెరపై పడాలని నిర్ణయించుకున్నాడట. ► ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బతుకుదెరువు కోసం డీవీడీలు, వీసీఆర్‌లు రెంట్‌కి ఇచ్చే దుకాణం పెట్టుకొని.. సినిమా చాన్స్‌ల కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘రావుగారిల్లు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత నాగార్జున తో పరిచయం అతని జీవితాన్ని మార్చివేసింది. ► శివతో సంచలనం: ఆర్జీవీ చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగార్జున. 1989 అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. నాగార్జునతో సైకిల్ చైన్ లాంగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ కుర్రాళ్లను తెగ కన్ఫూజ్ చేశాడు.సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు.ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే..అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ► ఆ తర్వాత వెంకటేశ్, శ్రీదేవి జంటగా తీసిన క్షణక్షణం మూవీ ఆద్యంతం కొత్త స్ర్కీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశాడు. బ్యాంక్ దొంగతనం నేపథ్యంతో తీసిన ఈ చిత్రం సైతం సూపర్ హిట్ గా నిలిచింది. ► 1993లో రాము, మణిరత్నం తో కలిసి తీసిన ‘గాయం’ జగపతిబాబు కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్ లో తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి జగపతి బాబు ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు అందుకున్నాడు. ► నాగార్జున, శ్రీదేవి జంటగా తీసిన గోవిందా…గోవిందా మూవీ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విలన్లు వేంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే సీన్ పెను దుమారమే రేపింది. సెన్సార్ కత్తెర పడటంతో వర్మ టాలీవుడ్ పై అలిగాడు. ఆ తర్వాత తెలుగు సినిమాలు తీయనని ఒట్టేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. ► బాలీవుడ్‌పై దండయాత్ర: రంగీలా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆర్జీవీ. అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిలా హీరో హీరోయన్లుగా వర్మ తీసిన ఈ చిత్రం 1994లో రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ చిత్రంతోనే ఎ.ఆర్.రెహమాన్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ► ఆర్జీవీ దర్శకత్వం వహించిన సూపర్ చిత్రాల్లో సత్య ఒకటి. తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ మూవీ ఎంతో మంది నటులకు, సాంకేతికి నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే మనోజ్ బాజ్ పాయి, చక్రవర్తి వంటి నటులు వెండితెరకు పరిచయం అయ్యారు. ► ఆ తర్వాత వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ► అమితాబ్ తో తీసిన ‘సర్కార్’ చిత్రం రాము తీసిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అమితాబ్, అభిషేక్ లు తెరపై కూడా తండ్రీ కొడుకులుగా నటించిన ఈ మూవీ తరువాత బాలీవుడ్ ను వర్మవుడ్ గా మార్చాడనే కాంప్లిమెంట్ అందుకున్నాడు. ఈ సినిమా థీం పాయింట్ లో వర్మ చెప్పిన గెలుపోటముల సూత్రం అద్భుతం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్కార్ రాజ్’ కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ ‘సర్కార్ 3’ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ► ‘రక్త చరిత్ర’ తర్వాత ఆర్జీవీ తెలుగులో వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా కాంట్రవర్సీ స్టోరీలతోనే సినిమాలను తెరెక్కిస్తున్నాడు. అయితే వాటిల్లో ఏవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. కానీ వెండితెరపై ఏదైన కొత్త ప్రయోగం చేయాలంటే ఇప్పటికీ ఎవరైనా ఆర్జీవీ తర్వాతనే. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళితో పాటు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. -
Happy Birthday Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ బర్త్ డే స్పెషల్ ఫొటోలు చూశారా?
-
హీరో, హీరోయిన్, డైరెక్టర్.. మీరు సెలక్ట్చేసినవారితో సినిమా!
రామ్‌గోపాల్ వర్మ ఐడియాలే వేరు! సినిమా కథను ఆన్లైన్లో పెట్టి.. అందులో ఎవరు నటిస్తే బాగుంటుందనేది ప్రేక్షకులు నిర్ణయిస్తే ఎలా ఉంటుంది? మెజారిటీ ఓటింగ్‌ను ప్రాతిపదికలోకి తీసుకుని అదే తారాగణంతో సినిమా వస్తే.. ఐడియా అదుర్స్ కదూ! దీన్ని రియాలిటీలో చేసి చూపిస్తానంటున్నారు వర్మ. ఆర్జీవీ డెన్ వేదికగా శనివారం నాడు ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్‌ను ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. ప్రేక్షకులే సినిమా హిట్ ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి, ఆ ప్రేక్షకులే సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అందరు టెక్నీషియన్స్ ను RGV వెబ్సైట్ ద్వారా ఓటింగ్ పద్దతిలో ప్రజలే ఎన్నుకుని, అందులో ముందంజలో ఉన్న వారితో సినిమా తీస్తారు. ఆర్జీవీ నిర్మాతగా దాన్ని ఆరు నెలల్లో తీసి రిలీజ్ చేస్తారు. సినిమా కథనీ RGV వెబ్సైట్లో (rgvden.com) ఒక రెండు లైన్లలో పెట్టి, ఆ కథ లైను నచ్చిన యాక్టర్స్, డైరెక్టర్స్, డిఓపి, మూజిక్ డైరక్టర్ ఇలా అందరూ అప్లై చేసుకోవచ్చు, ప్రేక్షకులు ఇంటరెస్ట్ ఉండి అప్లై చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ వారిని.. ఎవరి వర్క్ నచ్చిందో వారిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఉదాహరణకి హీరో కొసం ఒక 1000 మంది అప్లై చేస్తే అందులో నుంచి 50 మందిని RGV డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ చేసి వెబ్సైట్లో పెడతారు, ఆ తరవాత RGV పెట్టే టాస్కులను బట్టి వారు ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఆడిషన్స్ లో ప్రేక్షకులకు ఎక్కువ ఎవరు నచ్చితే అతను హీరోగా సినిమా తీస్తారు. ఇదే తరహాలో హీరోయిన్, డైరెక్టర్స్, డిఓపి ఇలా అందరినీ ప్రేక్షకులే ఎన్నుకుంటారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం.. అలానే ప్రెక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ యువర్ ఫిల్మ్ ఐడియా. To know how to involve the audience in the making of a film , Click https://t.co/4u0rJD7Jn3 YOUR FILM concept #RgvYourFilm pic.twitter.com/MVSoiUFtXU — Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2024 -
'నా పెళ్లాం దెయ్యం'.. ఆర్జీవీ టైటిల్ అదరహో!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇటీవలే వ్యూహం, శపథం లాంటి సినిమాలతో సినీ ప్రియులను అలరించారు. తాజాగా మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శారీ మూవీని తెరకెక్కిస్తోన్న ఆర్జీవీ.. మరో ఆసక్తికర సినిమాను ప్రకటించారు. 'నా పెళ్లాం దెయ్యం' పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ పోస్టర్‌ను ఏలాంటి క్యాప్షన్ లేకుండా రిలీజ్ చేశారు. అందులో నా పెళ్లాం దెయ్యం అనే టైటిల్ తోపాటు.. తాళి తీసి పడేసినట్లుగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో కిచెన్‌లో పని చేసుకుంటూ కనిపించే ఓ మహిళను చూపించారు. కాగా.. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ వెల్లడించారు. నా పెళ్లాం దెయ్యం పేరుతో మూవీని తీయబోతున్నట్లు తెలిపారు. నిజానికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పెళ్లాం దెయ్యమనే అంటారని.. నాకు కూడా నిజ జీవితంలో అలాగే అనిపించిందని అప్పట్లోనే ఆర్జీవీ అన్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్నీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/61WPNVbJ5R — Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2024 -
సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న వర్మ హీరోయిన్
సంచలన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా సరే అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది.వర్మ ట్వీట్ చేసినా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సరే కచ్చితంగా సెన్షెషనల్ అవ్వాల్సిందే. అలా కొద్ది రోజుల క్రితం చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరా? నెటిజన్స్ తెగ వెతకడం ప్రారంభించారు. ఫైనల్‌గా ఆ అమ్మాయిది కేరళ అని ఆ యువతి పేరు శ్రీలక్ష్మి సతీశ్ అని వర్మ తెలిపారు. ఆమెతో 'శారీ' అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. సినిమా కోసం ఆమె పేరును ఆరాధ్య దేవిగా మార్చడం జరిగింది. ఎవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయే రామ్‌గోపాల్ వర్మ టాలెంట్‌ని వెతికి పట్టుకోవటంలో దిట్ట అనే సంగతి అందరికి తెలిసిందే. అందుకు ఉదాహరణ ఆయన ఎంతోమంది టాలెంట్ ఉన్న నటీనటులను ఇండస్ట్రీకి అందించారు. ప్రస్తుతం ఆరాధ్య దేవితో తీస్తున్న ‘శారీ’ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొన్నటి దాకా చీరలో పద్దతిగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు తన గ్లామర్‌తో కేకపుట్టించింది. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు చీరలో యూత్‌ను మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు తన గ్లామర్‌తో అదిరిపోయే ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలను వర్మ కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.ఆరాధ్య ఫోటోలు చూసిన వారందరూ కూడా నోరెళ్లబెడుతున్నారు. అంతలా అవి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వర్త్ వర్మ.. వర్త్ అంటూ షాక్ అవుతున్నారు. పద్ధతిగా చీరకట్టులో ఉన్న అమ్మాయిని ఎలా మార్చేశావ్ వర్మ అంటూ సరదాగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) Hey @yeshclicks I am shocked with the transformation u made of the SAAREE girl Aaradhya Devi through ur photography .. See the pics of https://t.co/tANxbmOjAD to believe in this link https://t.co/qILXQadtVW pic.twitter.com/fuXBE5U7lA — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement