-
RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ పోటీపడి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కల్పిత కథతో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' 2022 మార్చి 25న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా తారక్ నటించి మెప్పించారు. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రూ. 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.తెలుగు, హిందీలో రీ-రిలీజ్ తారక్- చరణ్ ఫ్యాన్స్‌కు పండుగలాంటి సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా విడుదల సమయంలో థియేటర్లు అన్నీ నిండిపోయాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయినా కూడా ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. మే 10న మరోసారి ఆర్ఆర్ఆర్ విడుదల కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే, 2డీ, 3డీ ఫార్మాట్లతో పాటు 4K వర్షన్‌తో స్పెషల్‌గా వస్తుండటంతో అభిమానులు కాస్త ఆసక్తిగా ఉన్నారు. దీంతో ప్రేక్షకులు మరోసారి థియేటర్‌కు వచ్చి ఆ అనుభవాన్ని పంచుకోనున్నారు.ఆర్ఆర్ఆర్ ఖాతాలో లెక్కలేనన్ని ఆవార్డులు వచ్చి చేరాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. ఇందులోని 'నాటునాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కింది. ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ ఫీచర్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. RRR RE RELEASE on 10th May 🔥💥 @AlwaysRamCharan #RRRMoviepic.twitter.com/8eaIfLjw14— Navya (@HoneYNavya_) May 6, 2024 -
మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది: రాజమౌళి
దర్శకధీరుడు ప్రస్తుతం జపాన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్‌లోనూ రిలీజ్ చేశారు. గతేడాది ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రాన్ని జపాన్‌లో 100 ఏళ్లనాటి పురాతన మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమాను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రంలాగే ఈ మ్యూజికల్ షోపై కూడా ప్రేమ చూపిన జపనీస్ ఆడియన్స్‌కు ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చూస్తే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ ఈవెంట్లో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా' అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ దర్శకధీరుడి అభినందిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్‌బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను అందించారు. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ పెట్టాలనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా.. హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కీలకపాత్ర పోషించనున్నారని కూడా టాక్ నడుస్తోంది. Its an honour that our RRR has been adapted as a musical by the 110 year old Takarazuka company. Thank you Japanese audience for embracing the Broadway play of RRR just like the film itself. Overwhelmed by your response... Can't appreciate all the girls enough for your energy,… pic.twitter.com/QbfLPmsJxC — rajamouli ss (@ssrajamouli) March 22, 2024 -
'రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ఆమె చనిపోవాల్సింది.. కానీ'!
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన పీరియాడిక్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. తాజాగా జపాన్‌లో ఈ మూవీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటిష్ యువతి జెన్నీ పాత్రలో ఓలివియా మోరిస్ నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో మరిన్నీ సీన్స్ ఉన్నాయని రాజమౌళి తెలిపారు. కానీ సినిమా నిడివి పెరగడంతో ఎడిటింగ్‌లో తీసేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ..'ఎన్టీఆర్(భీమ్)ను జైలులో పెట్టిన తర్వాత జెన్నీ (ఓలివియా మోరిస్) అతడిని కలుస్తుంది. జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కు సాయం చేయాలనుకుంటుంది. ఆమె అంకుల్ గవర్నర్ స్కాట్ గదిలోకి రహస్యంగా వెళ్లి.. అక్కడ ఉన్న ప్లాన్స్‌ను దొంగిలించి భీమ్‌కు అందజేస్తుంది. అక్కడి నుంచి వస్తుండగానే.. స్కాట్ భార్య ఆమెను చూస్తుంది. జెన్నీ బూట్లకు మట్టి ఉండటంతో అనుమానం వచ్చి.. విషయాన్ని స్కాట్‌కు చెబుతుంది. ఆ తర్వాత భీమ్ తప్పించుకుంటాడు.' అని తెలిపారు. ఆ తర్వాత రామ్‌ను జైల్లో పెడతాడు స్కాట్. ఈ విషయం తెలుసుకున్న భీమ్ తిరిగి వచ్చి రామ్‌ను కాపాడి జైలు నుంచి బయటకు తెస్తాడు. వాళ్లిద్దరూ బ్రిటిష్ సైన్యాన్ని చంపుకుంటూ పోయే క్రమంలో జెన్నీని పావుగా వాడుకుని వాళ్లను పట్టుకోవాలని స్కాట్ ప్లాన్. లొంగిపోకపోతే.. జెన్నీని చంపేస్తానని వాళ్లను స్కాట్ బెదిరిస్తాడు. దీంతో వారు లొంగిపోయే క్రమంలోనే జెన్నీ మోసం చేసిందన్న కోపంతో ఆమెను స్కాట్ చంపేస్తాడు. ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వర్షన్లో జెన్నీ చనిపోతుంది. కానీ ఈ విషాదంతో కూడిన కథను తీయాలని నాకు అనిపించలేదు. దీంతో మొత్తం మార్చేశాం. జెన్నీ బతికిపోయింది. మీరు హ్యాపీగా సినిమా చూశారంటూ' పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం భీమ్, జెన్నీలకు అదనంగా ట్రాక్స్ రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా నిడివి మూడు గంటలు దాటిపోవడంతో ఆ సీన్స్ తొలగించారు. కాగా. రాజమౌళి తన నెక్ట్స్ మూవీ ప్రిన్స్ మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నారు. -
మహేశ్ బాబును ఇక్కడికి తీసుకొస్తాను: రాజమౌళి
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. తాజాగా ఇదే విషయాన్ని జక్కన్న తెలిపారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న రాజమౌళి SSMB29 సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డుతో RRR గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారికి ఎంతో గర్వకారణంగా ఈ చిత్రం నిలిచింది. తాజాగా జపాన్‌లో ఈ మూవీ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ మన జక్కన్న క్రేజ్ మామూలగా లేదు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని అక్కడి ప్రజలు చూపించారు. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు. 'మహేశ్ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుషా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను.' అని జపాన్‌లో జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఆయన మాటలను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు. SSR about #SSMB29 We've finished writing and are now in pre-production. Only the, protagonist SuperStar @urstrulyMahesh , is confirmed and he's incredibly handsome. Hoping to expedite the filming process and have him join us for promotion during the release #MBSSR pic.twitter.com/JZAx3oP6cu — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
ఆ దేశంలో రాజమౌళి క్రేజే వేరు.. ఏకంగా 83 ఏళ్ల వృద్ధురాలు!
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. నాటునాటు అనే సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ఈ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాలకు ఆదరణ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్ అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాను ఏకంగా జపనీస్లోనూ రిలీజ్ చేశారు. అక్కడ రాజమౌళి సినిమాకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల జపాన్ వెళ్లిన రాజమౌళికి ఓ మహిళ అభిమాని అరుదైన కానుక అందజేశారు. దాదాపు 83 ఏళ్ల వద్ధురాలు దర్శకధీరుడు రాజమౌళికి బహుమతులను అందజేసింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ..'జపాన్‌లో ఓరిగామి క్రేన్లను తయారు చేస్తారు. వారికిష్టమైన వారి ఆరోగ్యం కోసం బహుమతిగా ఇస్తారు. ఈ 83 ఏళ్ల వృద్ధురాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి అలాంటివీ 1000 తయారు చేసింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆమెను సంతోషపెట్టింది. ఆమె ఇప్పుడే బహుమతి పంపింది. చలిలో బయట వేచి ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. అది గ్రేట్ అంతే.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేయనున్నారు. In Japan, they make origami cranes &gift them to their loved ones for good luck& health. This 83yr old woman made 1000 of them to bless us because RRR made her happy. She just sent the gift and was waiting outside in the cold.🥹 Some gestures can never be repaid. Just grateful🙏🏽 pic.twitter.com/UTGks2djDw — rajamouli ss (@ssrajamouli) March 18, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్‌తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్‌పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement