టీమిండియా స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, లీగ్‌లు)లో 350 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత బౌలర్‌గా చాహల్ రికార్డులకెక్కాడు.
ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన చాహల్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. చాహల్ ఇప్పటివరకు 350 వికెట్లు పడగొట్టాడు. చాహల్ తర్వాత స్ధానంలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా 310 వికెట్లతో ఉన్నాడు.
ఇక ఐపీఎల్‌లో సైతం అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చాహల్(201) కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.
20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment