వర్ష బీభత్సం..! | Sakshi
Sakshi News home page

వర్ష బీభత్సం..!

Published Tue, Apr 23 2024 8:40 AM

భైంసా మున్సిపల్‌ కార్యాలయం వద్ద విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది - Sakshi

లేచిపడిన రేకులు, విరిగిపడిన చెట్ల కొమ్మలు

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

భైంసాటౌన్‌/లోకేశ్వరం/కడెం/ముధోల్‌/ఇంద్రవెల్లి: నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో సోమవారం సాయంత్రం భారీ గాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు రోడ్లపై విరిగిపడగా, దుకాణాల బోర్డులు, రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. లోకేశ్వరం, ఇంద్రవెల్లి మండలాల్లో వరి, మొక్కజొన్న, నువ్వుపంటలు నేలకొరిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. కడెం మండలంలోని ఉడుంపూర్‌లో మూడు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ముధోల్‌లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కూలిపోయింది. ముధోల్‌ మండల కేంద్రం వద్ద బాసర వైపు నుంచి వస్తున్న వ్యాను, ముధోల్‌ నుంచి వెళ్తున్న కారు ఢీకొని రోడ్డు కిందకి దిగిపోయాయి. వ్యాన్‌ డ్రైవర్‌కు స్వల్పగాయాలైనట్లు ఎస్సై సాయికిరణ్‌ తెలిపారు.

రోడ్డుపై పడిన కమాన్‌ను తొలగిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది
1/4

రోడ్డుపై పడిన కమాన్‌ను తొలగిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

తెగిపడిన విద్యుత్‌ తీగలు
2/4

తెగిపడిన విద్యుత్‌ తీగలు

వివేకానంద చౌక్‌లో కొట్టుకు పోయిన రేకులు
3/4

వివేకానంద చౌక్‌లో కొట్టుకు పోయిన రేకులు

లోకేశ్వరం:పంచగుడిలో వరి ధాన్యం 
కల్లంలో చేరిన వర్షపు నీరు
4/4

లోకేశ్వరం:పంచగుడిలో వరి ధాన్యం కల్లంలో చేరిన వర్షపు నీరు

Advertisement
Advertisement