Rashi Phalalu: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి రావాల్సిన సొమ్ము అందుతుంది | Sakshi
Sakshi News home page

Rashi Phalalu: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి రావాల్సిన సొమ్ము అందుతుంది

Published Fri, Mar 22 2024 6:48 AM

Today Astrology Rashi Phalalu March 22 2024 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
తిథి: శు.త్రయోదశి పూర్తి (24 గంటలు),
నక్షత్రం: మఖ తె.4.46 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి పుబ్బ,

సూర్యోదయం: 6.07, సూర్యాస్తమయం: 6.07. 

వర్జ్యం: ప.3.35 నుండి 5.19 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.29 నుండి 9.17 వరకు, తదుపరి ప.12.32 నుండి 1.20 వరకు,
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు,

అమృతఘడియలు: రా.2.10 నుండి 3.56 వరకు;

గ్రహఫలం....శుక్రవారం, 22.03.24

మేషం:
వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

వృషభం: అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. కొన్ని పనులలో ఆటంకాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

సింహం: సోదరుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తులు సమకూరతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.

కన్య: శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

తుల: శుభవర్తమానాలు. రావలసిన సొమ్ము అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు చేస్తారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలు రద్దు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

మీనం: నూతన పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు సంతృప్తినిస్తాయి.

Advertisement
Advertisement