బిగ్‌ న్యూస్‌.. ఊహించినదాని కంటే ఎక్కువగా పీఎఫ్‌ వడ్డీ రేటు | Sakshi
Sakshi News home page

Interest rate of PF: ఊహించినదాని కంటే ఎక్కువగా పీఎఫ్‌ వడ్డీ రేటు

Published Sat, Feb 10 2024 12:34 PM

EPFO fixes 8 25 pc interest rate on employees provident fund for 2023 24 - Sakshi

వేతన జీవులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) బిగ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎఫ్‌ నిధులపై వడ్డీ రేటును ఊహించిదానికి మించి పెంచింది. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 2023-24లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలకు 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించినట్లు వార్తా సంస్థ పీటీఐ తాజాగా నివేదించింది. 

గత సంవత్సరం మార్చి 28న ఈపీఎఫ్‌వో ​​2022-23 కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలకు 8.15 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. అంతకుముందు 2022 ఆర్థిక సంవత్సరంలో ​​8.10 శాతం వడ్డీ జమ చేసింది. 

"ఈరోజు జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 235వ సమావేశం 2023-24లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. దేశ శ్రామిక శక్తికి సామాజిక భద్రతను పటిష్టం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీని నెరవేర్చడానికి ఈ చర్య ఒక మందడుగు” అని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో వెల్లడించారు.

ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తర్వాత ప్రతి సంవత్సరం ఈపీఎఫ్‌ వడ్డీ రేటును సమీక్షిస్తారు. సీబీటీ సిఫార్సు చేసిన రేటును పరిగణనలోకి తీసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది వడ్డీ రేటును తెలియజేస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement