టెక్ దిగ్గజాల్లో అలజడి.. నాలుగు కంపెనీలలో 50000 మంది | Sakshi
Sakshi News home page

టెక్ దిగ్గజాల్లో అలజడి.. నాలుగు కంపెనీలలో 50000 మంది

Published Mon, Jan 15 2024 2:37 PM

More Than 50000 Layoffs In IT Companies in Last Year - Sakshi

కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి కూడా ఐటీ కంపెనీలు ప్రతి కూల పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే 2023లో వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2024లో కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వెల్లడైన టెక్ కంపెనీల ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.. ఉద్యోగుల సంఖ్య కూడా మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇటీవల వెల్లడైన 2023-24 మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలలో టీసీఎస్, హెచ్‌సీఎల్‌ సంస్థలు స్వల్ప లాభాలను పొందగా.. విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మాత్రం నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉద్యోగుల మీద కూడా పడే అవకాశం ఉంది.

ఈ ఏడాది ప్రారంభంలోనే గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం మొదలెట్టేశాయి. 2023-24 మూడవ త్రైమాసికం నాటికి భారతదేశంలోని టాప్ 4 కంపెనీలలో ఉద్యోగుల సంఖ్య 50,875 తగ్గినట్లు సమాచారం. ఇందులో 10,669 మంది టీసీఎస్, 24182 మంది ఇన్ఫోసిస్, 18510 మంది విప్రో, 2486 మంది హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులు ఉన్నారు.

ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన ఒక్క ఆలోచన - ఎవరీ నీరజ్ కక్కర్!

ఇప్పటి వరకు చాలా ఐటీ కంపెనీలు కొత్త నియామకాలను చేపట్టలేదు. రాబోయే రోజుల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను ప్రారంభించే దిశగా టీసీఎస్ యోచిస్తోంది. ఇన్ఫోసిస్ మాత్రం ఇప్పట్లో ఇంటర్వ్యూలు నిర్వహించే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. హెచ్‌సీఎల్ కంపెనీ మాత్రం ఫ్రెషర్లను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement