గౌతమ్‌ అదానీకి షాక్‌.. అంతకంతకూ పెరుగుతున్న ముఖేష్‌ అంబానీ సంపద! | Sakshi
Sakshi News home page

గౌతమ్‌ అదానీకి షాక్‌.. అంతకంతకూ పెరుగుతున్న ముఖేష్‌ అంబానీ సంపద!

Published Sun, Dec 31 2023 8:38 AM

Mukesh Ambani Adds 10 Billion To His Net Worth - Sakshi

2023 వ్యాపార వేత్తలకు కలిసి వచ్చిందా? లేదంటే నష్టాల్ని మూటగట్టుకున్నారా? హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌తో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ఎంత సంపదను కోల్పోయారు?ఆర్‌ఐఎల్‌ నుంచి జియో ఫైనాన్షియల్‌ సర్వీస్‌ డీమెర్జర్‌ కావడం రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి ఎంతమేరకు కలిసి వచ్చింది. వీళ్లిద్దరితో పాటు మిగిలిన వ్యాపార వేత్తలకు ఈ ఏడాది ఎలాంటి ఫలితాల్ని ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

 ప్రముఖ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తన సంపదను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు.బ్లూంబర్గ్‌ నివేదిక ప్రకారం.. ముఖేష్‌ అంబానీ ఈ ఏడాది అత్యధికంగా 9.98 బిలియన్‌ డాలర్ల సంపదను సమకూర్చుకున్నారు. దీంతో ఆయన మొత్తం ఆస్తి విలువ 97.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక ప్రపచం వ్యాప్తంగా సంపన్నుల జాబితాలో ముఖేష్‌ అంబానీ 13వ స్థానంలో కొనసాగుతున్నారు. అంబానీ సంపాదన పెరిగేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జియో ఫైనాన్షియల్‌ సర్వీస్‌ షేర్లు రాణించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్‌ పేర్కొంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)లో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఓ భాగం. అయితే జులై 20, 2023న ఆర్‌ఐఎల్‌ నుంచి జియో ఫైనాన్షియల్‌ సర్వీస్‌ డీమెర్జర్‌ అయ్యింది. అనంతరం స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. స్టాక్‌ మార్కెట్‌లోని లిస్టింగ్‌కు ఊహించని స్పందన రావడంతో పాటు రిలయన్స్‌ షేర్లు సైతం 9 శాతం వృద్దిని నమోదు చేశాయి. ఫలితంగా ముఖేష్‌ అంబానీ ఈ అరుదైన ఘనతను సాధించారు.   

అదానీకి అంతగా కలిసిరాలేదు
మరో అపరకుబేరుడు అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీకి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా హిండెన్‌బర్గ్‌ వంటి నిరాధారమైన నివేదికలతో అదానీ షేర్లు కుప్పకూలాయి. దీంతో 2023లో ఆయన 37.3 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ 83.2 బిలియన్‌ డాలర్లతో దేశీయ రెండో సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో అత‍్యధికంగా 21 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారని నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.  

సంక్షోభంలోనూ అవకాశాల్ని వెతుకున్న హెచ్‌సీఎల్‌
2023లో ఐటీ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ ఫౌండర్‌ శివ్‌ నాడార్‌ సంపద 9.47 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఆయన మొత్తం సంపద 34 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. హెచ్‌సీఎల్‌ షేరు ధర 41 శాతం పెరిగింది.  

సాహో సావిత్రి జిందాల్‌
జిందాల్‌ గ్రూపు చైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ సంపద కూడా 8.93 బిలియన్‌ డాలర్లు అందుకొని 24.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అంతేకాదు జిందాల్‌ స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, జిందాల్‌ ఎనర్జీ షేర్లు రాణించడంతో  మహిళా సంపన్నుల జాబితాలో సావిత్రి జిందాల్‌ 24.7 బిలియన్‌ డాలర్లతో కొనసాగుతున్నారు. 

పరుగులు తీసిన డీఎల్‌ఎఫ్‌ షేర్లు
రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో పరుగులు తీశాయి. ప్రీసేల్స్‌తో పాటు కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు లాంచ్‌ చేయడం డీఎల్‌ఎఫ్‌కు కలిసొచ్చింది. ఆ సంస్థ షేర్లు 91 శాతం వృద్దిని నమోదు చేశాయి. దీంతో ఆ కంపెనీ అధినేత కుషాల్‌ పాల్‌ సింగ్‌ సంపద 7.83 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఆయన మొత్తం సంపద విలువ 16.1 బిలియన‍్లకు చేరుకుంది. 

అదే దారిలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ సైతం
ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో 158 ఏళ్లుగా సేవలందిస్తున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ను నియంత్రిస్తున్న షాపూర్ మిస్త్రీ ఈ ఏడాది తన సంపదకు 7.41 బిలియన్ డాలర్లు జోడించారు. ఆయన నికర విలువ ఇప్పుడు 35.2 బిలియన్ డాలర్లు.



కుమార్‌ మంగళం బిర్లాతో పాటు మరింత మంది
2023లో తమ నికర విలువను బాగా పెంచుకున్న ఇతర బిలియనీర్లలో ఆదిత్య బిర్లా గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన కుమార్ మంగళం బిర్లా (7.09 బిలియన్ డాలర్లు), రవి జైపురియా (5.91 బిలియన్ డాలర్లు), సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి (5.26 బిలియన్ డాలర్లు), లోధా గ్రూప్ మంగళ్ ప్రభాత్ లోధా  (3.91 బిలియన్ డాలర్లు),  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ నుంచి సునీల్ మిట్టల్ (3.62 బిలియన్) ఉన్నారు. 

 

మరోవైపు ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార మంగళం బిర్లా సంపద 7.09 బిలియన్‌ డాలర్లు అధికం కాగా, సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ 5.26 బిలియన్‌ డాలర్లు, ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ 3.62 బిలియన్‌ డాలర్లు పెరిగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement