Sakshi News home page

Trolls On Apple iPhone 15:యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్‌ 

Published Wed, Sep 13 2023 4:48 PM

Samsung and OnePlus troll Apple after iPhone 15 USB C announcement - Sakshi

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌, అమెరికా టెక్‌దిగ్గజం యాపిల్‌పై మరోసారి ట్రోలింగ్‌కు దిగింది.  అమెరికాలోని యాపిల్‌ ప్రధాన  కార్యాలయంలో జరిగిన ఈవెంట్‌లో ఐఫోన్‌ 15 సిరీస్‌ను తాజాగా లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే యూఎస్‌బీ-సీ పోర్ట్‌తో లాంచ్‌ తాజా ఐఫోన్లను ఎద్దేవా చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది శాంసంగ్‌. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో యుఎస్‌బి-సి పోర్ట్‌లపై దారుణంగా ట్రోల్‌ చేస్తోంది శాంసంగ్‌. దీనికి మరో స్మార్ట్‌ఫోన్‌దిగ్గజం వన్‌ప్లస్‌ కూడా తోడైంది.  

అలాగే మరికొన్ని డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు  కూడా యాపిల్‌పై విమర్శలకు దిగాయి.  ఎట్టకేలకు మనం ఒక మాజికల్‌ చేంజ్‌ను (సీ) చూస్తున్నా అంటూ  పోరక్షంగా ట్వీట్‌ చేసింది. అయితే ఇక్కడ కొంతమంది యూజర్లు యాపిల్‌కు మద్దతుగా నిలవడం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్‌లు చాలా కాలంగా USB-Cని ఉపయోగి స్తున్నాయి. నిజానికి, యాపిల్‌ఇపుడు యూఎస్‌బీ-సీ స్విచ్ చేయడానికి ఏకైక కారణం, 2024 నుంచి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అన్ని స్మార్ట్‌ఫోన్‌లు USB-C ని మాండేటరీ చేసింది.

కాగా USB-Cతో  Apple Watch Series 9, Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ  స్టోరేజ్‌ ధర  రూ. 79,900 నుండి ప్రారంభం. అలాగే ఐఫోన్ 15 ప్లస్  ప్రారంభ ధర రూ. 89,900, iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 1,34,900 గాను నిర్ణయించింది. ఇక  iPhone 15 Pro Max 256 జీబీ  స్టోరేజ్‌ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభం.స్మార్ట్‌ఫోన్ సెక్టార్‌లో  శాంసంగ్‌, యాపిల్‌ మధ్య పోటీ గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  ఫోల్డబుల్ ఫోన్ లేదంటూ గత  ఏడాది కూడా  శాంసంగ్‌ యాపిల్‌పై విమర్శలు గుప్పించింది.

Advertisement

What’s your opinion

Advertisement