Samsung Introduces SeeColors Mode on 2023 TV and Monitor Lineup - Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ టీవీల్లో కొత్త మోడ్‌.. ఆ రంగులు చూడలేని వారి కోసం.. 

Published Wed, Jun 28 2023 8:37 AM

Samsung Introduces SeeColors Mode on 2023 TV and Monitor Lineup - Sakshi

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ దిగ్గజం శాంసంగ్‌ (Samsung).. తన 2023 టీవీ, మానిటర్ లైనప్‌లో సీ కలర్స్‌ (SeeColors) అనే కొత్త మోడ్‌ను జోడించినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్‌ వర్ణ అంధత్వం ఉన్నవారికి వివిధ సెట్టింగుల ద్వారా మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

సీ కలర్స్‌ మోడ్ తొమ్మిది పిక్చర్ ప్రీసెట్‌లను అందిస్తుంది. వీటిలో వినియోగదారులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. వీక్షకులు తమ వర్ణ దృష్టి లోపానికి అనుగుణంగా స్క్రీన్‌పై అన్ని రంగులను సులభంగా గుర్తించగలిగేలా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల స్థాయిలను ఈ ఫీచర్‌ సర్దుబాటు చేస్తుంది.

అందుబాటులో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
వాస్తవానికి 2017లోనే ఈ ఫీచర్‌ ఒక అప్లికేషన్‌గా విడుదలైంది. సీ కలర్స్ మోడ్‌ వర్ణాంధత్వ బాధితులు తాము చూడలేని రంగులను సైతం స్క్రీన్‌పై ఆ‍స్వాదించేలా దీన్ని రూపొందించారు. రానున్న టీవీ, మానిటర్ యాక్సెసిబిలిటీ మెనూలలో ఈ మోడ్‌ను ఏకీకృతం చేస్తోంది శాంసంగ్‌ కంపెనీ.

ఇప్పటికే 2023 మోడల్‌ శాంసంగ్‌ టీవీలు, మానిటర్లు కొనుగోలు చేసిన వారు తమ ఉత్పత్తుల యాక్సెసిబిలిటీ మెనూకి సీ కలర్స్‌ ఫీచర్‌ను జోడించడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. సీ కలర్స్‌  మోడ్‌కు సంబంధించి 'కలర్ విజన్ యాక్సెసిబిలిటీ' సర్టిఫికేషన్‌ను కూడా శాంసంగ్‌ పొందింది.

ఇదీ చదవండి: Smallest Smartphone: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్..  ఫీచర్లు మాత్రం అదుర్స్‌!

Advertisement

తప్పక చదవండి

Advertisement