Sakshi News home page

అసెంబ్లీలో పాసైనా.. గవర్నర్‌ తిరస్కరించారు!

Published Mon, Oct 9 2023 9:48 AM

California Governor vetoes cast ban bill - Sakshi

గత నెలలో కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించబడ్డ కులవివక్ష వ్యతిరేక బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్‌ గెవిన్‌ న్యూసమ్‌ తిరస్కరించారు. ఇప్పటికే రాష్ట్రంలో కుల వివక్షను నిషేధిస్తూ  చట్టాలున్నాయని ఇటువంటి సమయంలో మళ్లీ కులవివక్ష బిల్లు అవసరం లేదన్నారు. ఆ కారణంతోనే అసెంబ్లీలో ఆమోదించబడ్డ కులవివక్ష వ్యతిరేక బిల్లును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

పౌరులు ఎవరు? ఎక్కడ నివసిస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే అంశాన్ని పక్కనపెట్టి కాలిఫోర్నియాలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించేందుకు అర్హులని విశ్వసిస్తామని అని గెవిన్‌  పేర్కొన్నారు. ‘లింగం, జాతి, రంగు, మతం, జాతీయత పలు ఇతర అంశాల ఆధారంగా ఉండే అన్ని రకాల వివక్షను కాలిపోర్నియా ఇప్పటికే నిషేధించింది. కుల ఆధారిత వివక్షపై కూడా ఈ క్యాటగిరీల కింద నిషేధం ఉన్నది. కాబట్టి ఈ బిల్లు అవసరం లేదు’ అని అందులో స్పష్టం చేశారు. బిల్లును తిరస్కరిస్తూ గవర్నర్‌ న్యూసమ్‌ తీసుకొన్న నిర్ణయాన్ని ఇండియన్‌-అమెరికన్‌ కమ్యూనిటీ స్వాగతించింది.

గత నెలలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కాలిఫోర్నియాలోని అట్టడుగు వర్గాల ప్రజల్ని వివక్షతు నుంచే కాపాడేందుకు వీలుగా ఈ బిల్లును తీసుకొచ్చింది.  ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ 50-3 మెజార్టీతో ఆమోద ముద్ర పడింది. కాగా, గవర్నర్‌  న్యూసమ్‌ ఈ బిల్లును తిరస్కరించడంతో వీగిపోయింది.

Advertisement

What’s your opinion

Advertisement