ఫ్రాన్సు ప్రధానిగా గాబ్రియెల్‌ అట్టల్‌  | Sakshi
Sakshi News home page

ఫ్రాన్సు ప్రధానిగా గాబ్రియెల్‌ అట్టల్‌ 

Published Wed, Jan 10 2024 2:46 AM

Gabriel Attal becomes France youngest ever prime minister - Sakshi

పారిస్‌: ఫ్రాన్స్‌ ప్రధానమంత్రిగా అత్యంత పిన్న వయస్క్ డైన 34 ఏళ్ల గాబ్రియెల్‌ అట్టల్‌ నియమితులయ్యారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర రాజకీ య ఒతిళ్లు ఎదురవుతు న్న నేపథ్యంలో అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మా క్రాన్‌ మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రధాని ఎలిజబెత్‌ బోర్న్‌ సోమ వారం రాజీనామా చేశారు. ఆమె స్థానంలో అట్టల్‌ను నియమిస్తున్నట్లు మంగళవారం మాక్రాన్‌ ప్రకటించారు.

మంత్రి వర్గంలో కొందరు కీలక మంత్రులు మాత్రం యథాతథంగా కొనసాగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వ ం ప్రతినిధిగా, విద్యాశాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ గాబ్రియెల్‌ అట్టల్‌ ప్రధాని పదవి చేపట్టడం ఆసక్తికరంగా మారింది. గే అని ప్రకటించుకున్న ఫ్రాన్స్‌ మొట్టమొదటి ప్రధాని అట్టల్‌ కావడం గమనార్హం. బోర్న్‌ మంత్రి వర్గంలో అట్టల్‌ అత్యధిక ప్రజాదరణ కలిగిన మంత్రిగా ఓపీనియన్‌ పోల్స్‌లో వెల్లడైంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement