నా భార్యకు ఏమైనా జరిగితే వదలిపెట్టను: ఇమ్రాన్‌ ఖాన్‌ వార్నింగ్‌ | Sakshi
Sakshi News home page

నా భార్యకు ఏమైనా జరిగితే వదలిపెట్టను: ఇమ్రాన్‌ ఖాన్‌ వార్నింగ్‌

Published Thu, Apr 18 2024 2:09 PM

Imran Khan accuses Pak Army chief involvement over wifes detention - Sakshi

ఇస్లామాబాద్‌: తన భార్య జైలుపాలు కావడానికి ఆర్మీ చీఫ్‌ జనరల్‌  ఆసీమ్‌ మునీర్‌ కారమంటూ మాజీ ప్రధాని, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌( పీటీఐ)  చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్ ఆరోపించారు. తన భార్య బుష్రా బీబీ జైలు శిక్ష పడినందుకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ బాధ్యత వహించాలన్నారు.

అవినీతి కేసుకు సంబంధించి బీబీ బుష్రా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. అడియాలా జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌‌ మీడియాతో మాట్లాడిన వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

‘నా భార్య బుష్రాకు జైలు శిక్ష పడటంలో  ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ స్వయంగా జోక్యం చేసుకున్నారు. కోర్టులో న్యాయమూర్తిపై అసిమ్‌ మునీర్ ఒత్తిడి తెచ్చారు. నా భార్యకు ఏదైనా జరిగితే.. అసిమ్‌ను వదిలిపెట్టను. నేను బతికి ఉన్నంతవరకు అసిమ్‌ను అస్సలు వదిలేయను. అసిమ్‌ చేసిన చట్టవ్యతిరేక చర్యలన్నీ బయటపెడతాను.

..పాకిస్తాన్‌లో ఆటవిక రాజ్యంలో కొనసాగుతోంది. అడవి(పాకిస్తాన్‌) రాజు(నవాజ్‌  షరీఫ్‌) తల్చుకుంటే అన్ని కేసులు మాఫీ చేయబడుతాయి. లేదంటే ఐదు రోజుల్లో  మూడు కేసులు బనాయిస్తారు. శిక్ష కూడా పడుతుంది.  ఆటవిక రాజ్యంలో పెట్టుబడలు రావు. పెట్టుబడుల పెట్టడానికి సౌదీ  అరేబియా ముందురావటం మంచిదే. కానీ, చట్టబద్ద కల్పించరు’ అని ఇమ్రాన్‌  మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement