ప్రొఫెసర్‌ రవీందర్‌రెడ్డికి అమెరికా ఆహ్వానం | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ రవీందర్‌రెడ్డికి అమెరికా ఆహ్వానం

Published Sat, Apr 20 2024 1:55 AM

- - Sakshi

లింగాలఘణపురం: మండల కేంద్రానికి చెందిన ఉస్మానియా యూనివర్సి టీ భౌతిక శాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌బుట్రెడ్డి రవీందర్‌రెడ్డికి అమెరికాలో ఈసీఎస్‌(ఎలక్ట్రో కెమికల్‌ సొసైటీ) నిర్వహించే 245వ సమావేశానికి ఆహ్వానం అందింది. మే 26 నుంచి శాన్‌ప్రాన్సిస్‌కో నగరంలో జరిగే ఈసీఎస్‌ సమావేశంలో ‘సూపర్‌ కెపాసిటర్స్‌’ అనే అంశంపై తాను చేసిన పరిశోధనపై ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనను ‘సాక్షి’ పలకరించగా.. ఎలక్ట్రికల్‌ వాహనాల్లో వినియోగించే బ్యాటరీ, సూపర్‌ కెపాసిటర్స్‌ శక్తిని మరింత పెంచేందుకు తాను చేస్తున్న పరిశోధన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తనను ఎంపిక చేసి ఆహ్వానం పంపించినట్లు చెప్పారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం

రవీందర్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, జనగామ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, హైదరాబాద్‌ సిటీ కాలేజీలో డిగ్రీ చదివారు. ఓయూలో పీజీ చేసి 2015లో భౌతికశాస్త్ర విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేరి విధులు నిర్వహిస్తున్నారు.

పాలిసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఈనెల 22వ తేదీ వరకు గడువు

స్టేషన్‌ఘన్‌పూర్‌: సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 22 చివరి తేదీ.. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని ఘన్‌పూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పోచయ్య తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఇతర కేటగిరీల వారు రూ.500 ఫీజు చెల్లించాలన్నారు. గడువు దాటి న తర్వాత 24వ తేదీ వరకు రూ.100 అపరాధ రుసుముతో.. 26వ తేదీ వరకు రూ.300 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నా రు. ప్రవేశ పరీక్ష మే 24న ఉంటుందని చెప్పా రు. స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌తో పాటు సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు, ప్రతి కోర్సులో 60 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కళాశాలకు గత ఏడాది ఎన్‌బీఏ(నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌) గుర్తింపు లభించిందని తెలిపారు. పాలిసెట్‌ కోసం ఉచిత కోచింగ్‌ ఇస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 90102 22168 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

నగదు స్వాధీనం

తరిగొప్పుల: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా.. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. మండల కేంద్రం శివారు ఎన్యానాయక్‌తండా క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం సీఐ సాయిరమణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలకు చెందిన కోళ్ల రాజు తన మహేంద్ర జీటో వాహనంలో వస్తుండగా తనిఖీ చేశారు. అందులో ఏ ఆధారం లేకుండా రూ.85 వేల నగదు లభించగా స్వాధీనం చేసుకుని ఎలక్షన్‌ గ్రీవెన్స్‌ కమిటీకి పంపించనట్లు ఎస్సై తెలిపారు.

ఎన్నికల నిబంధనలు

ఉల్లంఘిస్తే చర్యలు

కొడకండ్ల : పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి.. ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య అన్నారు. శుక్రవారం గిర్నితండా చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలు, వాహనాల తనిఖీపై సిబ్బందికి ఏసీపీ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై బండి శ్రావణ్‌కుమార్‌, సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

1/2

ప్రొఫెసర్‌ రవీందర్‌రెడ్డి
2/2

ప్రొఫెసర్‌ రవీందర్‌రెడ్డి

Advertisement
Advertisement