వాతావరణం | Sakshi
Sakshi News home page

వాతావరణం

Published Fri, Apr 19 2024 1:45 AM

-

జిల్లాలో ఉదయం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండతో పాటు వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.

ఆరోగ్యంపై అవగాహన

కల్పించడం కోసమే..

కాంగ్రెస్‌ నాయకుడు గుడాల శ్రీనివాస్‌

కాటారం (మహదేవపూర్‌): ప్రతీ ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశ్యంతో కొంత కాలంగా వ్యాయామం, యోగాపై తన వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నానని.. అందులో భాగంగానే పోలీసులకు సైతం అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్లు మహదేవపూర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, జెడ్పీటీసీ గుడాల అరుణ భర్త గుడాల శ్రీనివాస్‌ తెలిపారు. ఈ నెల 15న మహదేవపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్‌ నృత్యం చేసిన ఘటన వైరల్‌ కాగా అదేరోజు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్‌రెడ్డి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. దీనిపై గురువారం గుడాల శ్రీనివాస్‌ సోషల్‌ మీడియా వేదికగా సంజాయిషీ ఇచ్చారు. 30 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ మంచి విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నానన్నారు. కరోనా బాధితులు గుండుపోటుతో మృతిచెందడం తనను బాధించిందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులను అడిగి పలు సలహాలు తీసుకున్నానని చెప్పారు. ఆ విషయాలను నలుగురికి చెపుతూ వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 15న ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తూ ఇంటి సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులు పని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేసినట్లు వివరించారు. గిట్టని వారు కొందరు దురుద్దేశంతో అబద్దపు మాటలు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్‌ ఆరో పించారు. తన సంజాయిషీతో సంతృప్తి చెందకపోతే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా బాధ్యులు తీసుకోబోయే చర్యలను గౌరవిస్తానని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

సీతారామచంద్రస్వామి

ఆలయంలో హోమం

ఏటూరునాగారం: మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ఉదయం నిత్యారాధన, హోమం, బలిహరణ కార్యక్రమాన్ని వేదపండితులు ముక్కాముల వెంకటనారాయణశర్మ, యల్లాప్రగడ మణికంటిశర్మ, నాగేశ్వర్‌రావుశర్మ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సదస్యము, ఆరగింపు, పల్లకిసేవ కార్యక్రమాలు జరిపించారు. ఐదు రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా పుష్పయాగం(నాగబెల్లి) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అర్చకులు నాగేశ్వర్‌రావుశర్మ తెలిపారు.

Advertisement
Advertisement