కాంగ్రెస్‌కు ప్రజా సంక్షేమం పట్టలేదు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ప్రజా సంక్షేమం పట్టలేదు

Published Sat, Apr 20 2024 1:40 AM

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మోహనకృష్ణ   - Sakshi

కేజీఎఫ్‌: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రజా సంక్షేమం పట్టలేదని, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పదవులు కాపాడుకోడానికే ప్రయత్నిస్తున్నారని బీజేపీ స్వాభిమాన వర్గం నాయకుడు మోహనకృష్ణ తెలిపారు. శుక్రవారం ఎన్‌డీఎ అభ్యర్థి తరపున నగరంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రైతులపై కాంగ్రెస్‌కు శ్రద్ధ ఉంటే ఇప్పటికే కరువు పరిహారం అందించేవారన్నారు. అనవసరంగా కేంద్రంపై వేలెత్తి చూపుతూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలకు ప్రజలు లొంగవద్దని, అశాశ్వత పథకాలను విశ్వసించవద్దన్నారు. సమాజంలో శాశ్వత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తేవడం కేవలం బీజేపీ వల్లే సాధ్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో నగరసభ మాజీ అధ్యక్షుడు దయానంద్‌, సురేష్‌, జీపీకే శ్రీనివాస్‌, మహేష్‌గౌడ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement