Bigg Boss OTT Telugu: BB Non Stop Shooting Begins Today, Contestants List Is Here - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: మరికాసేపట్లో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌.. వీళ్లే కంటెస్టెంట్లు

Published Sat, Feb 26 2022 11:01 AM

Bigg Boss Non Stop Shooting Begins,Contestants List Is Here - Sakshi

Bigg Boss Non Stop Contestants List: బిగ్‌బాస్‌ ఓటీటీ తెలుగు మరికాసేపట్లో గ్రాండ్‌గా లాంచ్‌ కానుంది.‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’పేరుతో 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో ప్రసారం కానున్న ఈ షోకు సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈరోజు (ఫిబ్రవరి26)నుంచి సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏమాత్రం తగ్గకుండా మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

17మంది కంటెస్టెంట్లతో 24గంటల పాటు నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు షో రెడీ అయ్యింది. ఇప్పటికే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్లు మరికాసేపట్లో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ కానున్నారు. ఇక  బిగ్ బాస్ OTTలో పాల్గొనే ఫైనల్‌ కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి వాళ్లు ఎవరో చూసేయండి..

1. అరియానా
2. యాంకర్‌ శివ
3. అఖిల్‌ సార్థక్‌
4. సరయు
5. తేజస్వి మదివాడ
6. మహేష్‌ విట్టా
7. అషు రెడ్డి ఫస్ట్‌ ఎంట్రీ
8. హమీదా
9. నటరాజ్‌ మాస్టర్‌
10. నిఖిల్‌
11. మిత్రా శర్మ
12. ముమైత్‌ ఖాన్‌
13. ఆర్జే చైతు
14. శ్రీ రాపాక
15. అనిల్‌ రాథోడ్‌
16. అజయ్‌ కతుర్వార్‌
17. బిందు మాదవి

అయితే ఈ సీజన్‌లో ఆదర్శ్‌, తనీష్‌లు ఉంటారని జోరుగా ప్రచారం జరిగినా చివరి నిమిషంలో వాళ్లు లేరని తెలుస్తుంది. అంతేకాకుండా ఈసారి సీక్రెట్‌ రూం కాకుండా కంటెస్టెంట్లు అందరినీ ఒకేసారి హౌస్‌లోకి పంపిచనున్నారట. అంతేకాకుండా ఈవారం లేదా రెండో వారంలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండనుందని తెలుస్తుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement