Bollywood Actress Urvashi Rautela Team Gives Clarity Over Trolls On Her Crocodile Necklace - Sakshi
Sakshi News home page

Urvashi Rautela: ఊర్వశి నెక్లెస్ రూ.276 కోట్లా?.. ఏంటీ జోక్ చేయట్లేదుగా!

Published Tue, May 23 2023 4:29 PM

Bollywood Actress Urvashi Rautela team Clarity On Crocodile Necklace - Sakshi

ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్‌తో పాటు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. అయితే ఈ వేడుకల్లో ఆమె ధరించిన క్రోకోడైల్ నెక్లెస్‌పైనే అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆమె వేసుకున్న నెక్లెస్‌ ధర ఎంతై ఉంటుందని నెటిజన్స్‌లో తెగ చర్చిస్తున్నారు. దీంతో తాజాగా ఆమె టీమ్‌ నెక్లెస్‌ ధరను వెల్లడించింది. 

(ఇది చదవండి: 'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు')

కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కొత్త డ్రెస్సులు, తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.అయితే ఆమె ధరించిన మొసలి నెక్లెస్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేశారు. పింక్ కలర్  గౌనులో మెరిసిన ఊర్వశి రౌతేలా.. ఫేక్ నెక్లెస్ పెట్టుకుని వెళ్లిందని ట్రోల్స్ కూడా చేశారు. 

(ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్‌ టాప్‌ హీరో.. ఎవరై ఉంటారబ్బా?)

అయితే ఈ ట్రోల్స్‌పై నటి బృందం క్లారిటీ ఇచ్చింది. నెక్లెస్ ధర తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. 'ఊర్వశి ధరించిన నెక్లెస్‌ ఫేక్‌ కాదు. దాని ధర రూ.276 కోట్ల వరకు ఉంటుంది. అది ఆమె ఫ్యాషన్‌ నిదర్శనం.' అని పేర్కొంది. ప్రస్తుతం దీని ధర చూసి అందరూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నెక్లెస్‌ అంత ధర ఉంటుందా? జోక్‌ బాగుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఆడిపాడిన ఊర్వశి.. ఇటీవల అఖిల్ ఏజెంట్‌లోనూ కనిపించింది. 


 

Advertisement
 
Advertisement
 
Advertisement