రవితేజ మాట థ్రిల్లింగ్‌గా అనిపించింది: వంశీ కృష్ణ | Sakshi
Sakshi News home page

రవితేజ మాట థ్రిల్లింగ్‌గా అనిపించింది: వంశీ కృష్ణ

Published Wed, Oct 18 2023 7:03 AM

Director Vamsi Krishna Talk About Tiger Nageswara Rao Movie - Sakshi

‘టైగర్‌ నాగేశ్వరరావు’ కథని రవితేజగారు మొదట సగం విని, ‘షూటింగ్‌ ఉంది.. మిగతాది రేపు వింటాను’ అన్నారు. కథ ఆయనకు నచ్చలేదేమో? నాకు ఫోన్‌ రాదేమో? అనుకున్నాను. మరుసటి రోజు ఆయన ఫోన్‌ చేయడంతో వెళ్లి మిగిలిన సగం కథ చెప్పాను. క్లయిమాక్స్‌ చెబుతున్నప్పుడే... ‘జుట్టు పెద్దగా పెంచితే బాగుంటుందా? కళ్లకి లెన్స్‌పెట్టుకోనా?’ అని ఆయన అన్నారు. నాకు అదొక భావోద్వేగమైన సందర్భం’’ అన్నారు డైరెక్టర్‌ వంశీ కృష్ణ.

రవితేజ హీరోగా, తెరకెక్కిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ– ‘‘టైగర్‌ నాగేశ్వరరావు ఒక దొంగ అని అందరికీ తెలుసు. మరో కోణంలో మంచి మనసున్న మనిషి. ఈ రెండు కోణాలను సినిమాలో చూపించాను.

1980 నేపథ్యంలో నడిచే కథ ఇది. నా కెరీర్‌లో బడ్జెట్, స్టార్స్‌ పరంగా ఇది చాలా భారీ సినిమా. ఈ సినిమాలో గోదావరి బ్రిడ్జ్‌ని రీ క్రియేట్‌ చేసి, ట్రైన్‌ సీక్వెన్స్‌ చేయడం సవాల్‌గా అనిపించింది. ఇక షారుక్‌ ఖాన్‌’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement