ఇంజీనస్‌తో రెడ్డీస్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం | Dr Reddys Laboratories Ltd has signed a licensing agreement with US-based Ingenus Pharmaceuticals | Sakshi
Sakshi News home page

ఇంజీనస్‌తో రెడ్డీస్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం

Published Thu, Jun 13 2024 6:23 AM | Last Updated on Thu, Jun 13 2024 8:31 AM

Dr Reddys Laboratories Ltd has signed a licensing agreement with US-based Ingenus Pharmaceuticals

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యూఎస్‌ కంపెనీ ఇంజీనస్‌ ఫార్మాస్యూటికల్స్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందం చేసుకున్నట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ తెలిపింది. ఇందులో భాగంగా క్యాన్సర్‌ చికిత్సలో వాడే సైక్లోఫాస్ఫామైడ్‌ ఇంజెక్షన్‌ ను యూఎస్‌ మార్కెట్లో రెడ్డీస్‌ విక్రయించనుంది. 

అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో 50% ఇంజీనస్‌కు చెల్లిస్తుంది. ఇక్వియా గణాంకాల ప్రకారం 2024 మార్చితో ముగిసిన 12 నెలల్లో ఇంజీనస్‌ తయారీ సైక్లోఫాస్ఫామైడ్‌ ఇంజెక్షన్‌ అమ్మకాల విలువ యూఎస్‌లో 51.8 మిలియన్‌ డాలర్లు నమోదైంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement