licensing
-
టెలికం సర్వీస్ లైసెన్సింగ్‌లో సమూల మార్పులు
న్యూఢిల్లీ: ప్రస్తుత టెలికం సర్వీస్ లైసెన్సింగ్ విధానంలో సమూలంగా మార్పులు తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రదానంగా మూడు రకాల అనుమతులను సిఫార్సు చేసింది. మెయిన్ సర్వీస్ ఆథరైజేషన్, అనుబంధ సర్వీసుల ఆథరైజేషన్, క్యాప్టివ్ సర్వీస్ ఆథరైజేషన్ వీటిలో ఉన్నాయి.వివిధ సేవలు, సర్వీస్ ఏరియాలవ్యాప్తంగా ’వన్ నేషన్ – వన్ ఆథరైజేషన్’ లక్ష్యాన్ని సాధించే దిశగా ’ఏకీకృత సర్వీస్ ఆథరైజేషన్’ కింద ట్రాయ్ ఈ సిఫార్సులు చేసింది. వీటి ప్రకారం మెయిన్ సర్వీస్ ఆథరైజేషన్లను నెట్వర్క్ సర్వీస్ ఆపరేటర్ (ఎన్ఎస్వో), వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ (వీఎన్‌వో)గా రెండు విభాగాల కింద ఇస్తారు.అనుబంధ సర్వీస్ ఆథరైజేషన్లను సాధారణంగా పెద్దగా పర్యవేక్షణ అవసరం ఉండని ఎంటర్ప్రైజ్ యూజర్లకు ఇస్తారు. సొంత అవసరాల కోసం నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం తీసుకున్న సంస్థలకు క్యాప్టివ్ సర్వీస్ ఆథరైజేషన్ ఇస్తారు. -
ఇంజీనస్తో రెడ్డీస్ లైసెన్సింగ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్ కంపెనీ ఇంజీనస్ ఫార్మాస్యూటికల్స్‌తో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్సలో వాడే సైక్లోఫాస్ఫామైడ్ ఇంజెక్షన్ ను యూఎస్ మార్కెట్లో రెడ్డీస్ విక్రయించనుంది. అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో 50% ఇంజీనస్కు చెల్లిస్తుంది. ఇక్వియా గణాంకాల ప్రకారం 2024 మార్చితో ముగిసిన 12 నెలల్లో ఇంజీనస్ తయారీ సైక్లోఫాస్ఫామైడ్ ఇంజెక్షన్ అమ్మకాల విలువ యూఎస్‌లో 51.8 మిలియన్ డాలర్లు నమోదైంది. -
ల్యాప్‌టాప్‌ల దిగుమతికి లైసెన్స్ అవసరం లేదు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ల్యాప్టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్య లు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దిగుమతిదారులను నిశితంగా గమనిస్తామని, తద్వారా దిగుమతులను పర్యవేక్షించవచ్చన్నారు. -
ముందస్తుగా ‘మద్యం లాటరీలు’?
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో నవంబర్‌లో జరగాల్సిన వైన్‌షాపుల లాటరీ ప్రక్రియ వచ్చే నెలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అక్టోబర్‌లోనే వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. 2021–23 సంవత్సరాల ఏ4 (వైన్స్) షాపుల లైసెన్సు కాలం ముగియక ముందే 2023–25 సంవత్సరాలకు లైసెన్సులిచ్చే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముమ్మరంగా ముందుకెళ్తోంది. వచ్చే నెలలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ ప్రారంభం కల్లా ప్రక్రియను పూర్తి చేసేలా కొత్త పాలసీ రూపకల్పనలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ముందుగానే ఎందుకు?: వాస్తవానికి, 2021–23 (రెండేళ్ల పాలసీ) సంవత్సరాలకుగాను ఏ4 లైసెన్సుల గడువు వచ్చే నవంబర్ 30తో ముగియనుంది. అంటే డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్‌దారులు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరపాల్సి ఉంటుంది. అలా జరగాలంటే అక్టోబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రానున్న రెండేళ్లకు (2023–25) లైసెన్సులను లాటరీ పద్ధతిలో జారీ చేసేందుకు కొత్త పాలసీ రూపొందించాల్సి ఉంటుంది. అయితే, వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముంది. దీంతో ఎన్నికల నియమావళి వచ్చేలోపే నోటిఫికేషన్ ఇచ్చి లాటరీలు ముగించి కొత్త లైసెన్స్‌దారులకు షాపులు కేటాయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 1 నుంచి మాత్రమే వారికి షాపులు అప్పగించాలని, ఈలోగా పాత లైసెన్స్‌ల ద్వారా మద్యం విక్రయాలు జరపవచ్చని అంటు న్నారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన మద్యం టెండర్లకు ముహూర్తం ఖరారు చేసే పనిలో పడ్డారు. అడిగితే ఇవ్వరా?: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ముందస్తు ఎక్సైజ్ టెండర్లకు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. గతంలో జూలై 1 నాటికి లైసెన్సులు ముగిసేవి. కానీ, 2014లో మూడుసార్లు గడువు పెంచడంతో ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఈసారి గడువు పెంచకుండా ముందస్తుగా లాటరీల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కోడ్ అడ్డంకి అయితే, ఆ సమయంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని ప్రక్రియ ప్రారంభించి లైసెన్స్‌లను ఖరారు చేసి పెట్టుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోడ్ అయ్యాక కొత్త లైసెన్స్‌దారులకు షాపులు అప్పగించవచ్చనే వాదనా ఉంది. అయితే, అప్పటివరకు ఎంతకాలం అవసరమైతే అంతకాలం పాటు గడువు పొడిగించి పాత లైసెన్స్‌దారుల దగ్గరే ఫీజు వసూలు చేసి విక్రయాలు జరపవచ్చనే అభిప్రాయమూ ఉంది. మరోవైపు, వైన్‌షాపుల్లో కొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. మళ్లీ ఇప్పుడు ముందస్తు ప్రక్రియపై ఎవరైనా కోర్టుకు వెళితే అసలుకే ఎసరు వస్తుందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లోనే జరుగుతుండటం గమనార్హం. ఆదాయం కోసమేనా?: మందుషాపులకు ముందస్తు లాటరీలు ఆదాయం కోసమేనా అనే చర్చ జరుగుతోంది. రెండేళ్లకు లైసెన్సు ఫీజు జారీ చేసేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల అమ్మకాల మీదనే ప్రభుత్వానికి రూ. 1,400 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ పాలసీ నిబంధనల ప్రకారం లాటరీ ప్రక్రియ పూర్తయి షాపు కేటాయించాలంటే మొదటి విడత లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ ఫీజు కింద మరో రూ.500– 600 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఎన్నికలకు ముందు ఈ రూ.2 వేల కోట్ల కోసమే ఎక్సైజ్ శాఖ హడావుడి చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. -
పరిశీలనలో మరో 20 బీమా కంపెనీల దరఖాస్తులు
ముంబై: ఇటీవలే కొన్ని బీమా సంస్థలకు లైసెన్సులు ఇచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ మరో 20 దరఖాస్తులను పరిశీలిస్తోంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశీష్ పాండా ఈ విషయాలు చెప్పారు. కొన్నాళ్ల క్రితం జీవిత బీమా విభాగంలో క్రెడిట్ యాక్సెస్ లైఫ్, ఎకో లైఫ్‌కు లైసెన్సులు ఇవ్వగా కొత్తగా సాధారణ బీమాలో క్షేమా జనరల్ ఇన్సూరెన్స్‌కు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. 2017 తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఒక సంస్థకు అనుమతులు ఇవ్వడం ఇదే ప్రథమం. 2047 నాటికి అందరికీ బీమా కల్పించాలన్న లక్ష్యాన్ని కేవలం నినాదంగా చూడొద్దని, దాన్ని సాకారం చేసే దిశగా తగు చర్యలు తీసుకుంటే డెడ్‌లైన్ కన్నా ముందే సాధించగలమని పాండా తెలిపారు. ఇందుకోసం పరిశ్రమ టెక్నాలజీని మరింతగా అందిపుచ్చుకోవాలని, వినూత్నంగా ఆలోచించాలని ఆయన చెప్పారు. టెక్నాలజీ ఆధారిత నవకల్పనలతో ఉత్పత్తుల వ్యయాలు తగ్గుతాయని పాండా తెలిపారు. ఈ విషయంలో అందరికీ ఆర్థిక సేవలను అందించే దిశగా బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించవచ్చని సూచించారు. ఆఖరు వ్యక్తి వరకూ చేరేందుకు ఆశా, అంగన్వాడీ వర్కర్లు, స్వయం సహాయక బృందాల తోడ్పాటు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 23 జీవిత బీమా సంస్థలు, 33 సాధారణ బీమా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి నాటికి వాటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 59 లక్షల కోట్లుగా నమోదైంది. -
కంటి వ్యాధులకు జన్యు చికిత్స
న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్‌కు లైసెన్స్ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్ లైఫ్ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది. జన్యు చికిత్సకు (జీన్ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్‌లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన బయాలాజికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభా గానికి చెందిన జయంధరణ్ గిరిధర రావు, శుభమ్ మౌర్య ఈ పేటెంటెడ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. -
ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్స్ సేవలు అందించే సంస్థలకు కూడా లైసెన్సింగ్ విధానం, తేలికపాటి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. టెల్కోల నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని ఈ సేవలు అందిస్తున్నందున అవి నేరుగా తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. టెలికం బిల్లు ముసాయిదాలో ఓటీటీ కమ్యూనికేషన్స్ సేవలకు సంబంధించిన నిర్వచనం విషయంలో తాము ఈ మేరకు సిఫార్సులు చేసినట్లు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. టెల్కోలకు ఓటీటీ సంస్థలు పరిహారం చెల్లించే అంశానికి సంబంధించి.. ఆదాయంలో వాటాల విధానాన్ని పరిశీలించవచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్‌లో ఇతర ఓటీటీలకు (అన్ని కేటగిరీలు) కూడా డేటా వినియోగం ఆధారిత ఆదాయ పంపకం సూత్రాన్ని వర్తింప చేయవచ్చని కొచర్ చెప్పారు. -
ఫైనాన్స్ వ్యాపారంలోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
ముంబై: సజ్జన్ జిందాల్ సారథ్యంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా రుణాల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఈ–కామర్స్ విభాగమైన జేఎస్‌డబ్ల్యూ వన్ ప్లాట్‌ఫామ్స్ (జేఎస్‌డబ్ల్యూవోపీ) కింద గ్రూప్‌లోని సంస్థల అవసరాల కోసం జేఎస్‌డబ్ల్యూ వన్ ఫైనాన్స్ పేరిట నాన్–బ్యాంక్ ఫైనాన్స్ సంస్థ (ఎన్బీఎఫ్సీ)ని ఏర్పాటు చేస్తోంది. అందులో రెండేళ్ల వ్యవధిలో రూ. 350– రూ. 400 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో లైసెన్సు కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోనున్నట్లు, ఆ తర్వా 7–9 నెలల్లో నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు జేఎస్‌డబ్ల్యూవోపీ సీఈవో గౌరవ్ సచ్‌దేవా చెప్పారు. ఇందులో దాదాపు 200 మంది వరకూ సిబ్బంది ఉంటారు. ఆ తర్వాత క్రమంగా గ్రూప్‌లోని సిమెంటు, స్టీల్, పెయింట్స్ తదితర ఇతర కంపెనీలకు ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందిస్తుంది. తమ క్లయింట్లుగా ఉన్న లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు బ్యాంకింగ్ రంగం నుంచి తోడ్పాటు ఎక్కువగా లభించదని, ఈ నేపథ్యంలోనే వాటి అవసరాలను తీర్చేందుకు ఎన్బీఎఫ్సీని ఏర్పాటు చేస్తున్నట్లు సచ్‌దేవా చెప్పారు. -
సోనీమ్యూజిక్తో టిక్‌టాక్ ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: నిషేధిత చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ (ఎస్ఎంఇ) తో కొత్త లైసెన్సింగ్ ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ కొత్త డీల్ ప్రకారం యాప్ లో సోనీ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్స్ ని క్రియేటర్స్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఒప్పందం విలువ వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. అయితే టిక్‌టాక్ యూజర్లు సోనీ మ్యూజిక్ కళాకారుల కంటెంట్ వాడుకోవచ్చని టిక్‌టాక్ ఒక ప్రకటనలో తెలిపింది తాజా ఒప్పందంతో సోనీ మ్యూజిక్ ప్రస్తుత హిట్స్, కొత్త రిలీజ్ లు, ఐకానిక్ క్లాసిక్స్ లాంటివి టిక్‌టాక్ క్రియేటర్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సోనీ మ్యూజిక్ క్లిప్‌లను ప్రదర్శించడాని కంటే మించి వాటిని ప్రమోట్ చేసే ప్రయత్నాలతోపాటు, యూజర్లకు మంచి మ్యూజిక్ అందుబాటులోకి వస్తుందని సోనీ మ్యూజిక్ ప్రతినిధి డెన్నిస్ కూకర్ తెలిపారు. సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం చాలా ఆనందంగా ఉందనీ, తద్వారా అమెరికా సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోనీ కళాకారుల అద్భుతమైన కంటెంట్‌ను కొత్త ప్రేక్షకులతో అనుసంధానించడానికి, టిక్‌టాక్ శక్తిని ఉపయోగించుకోవాడినికి వీలవుతుందని టిక్‌టాక్ గ్లోబల్ హెడ్ ఆఫ్ మ్యూజిక్ ఓలే ఒబెర్మాన్ పేర్కొన్నారు. టిక్‌టాక్ ఇప్పటికే యూనివర్సల్, సోనీ వార్నర్‌లతో స్వల్పకాలిక లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. -
ఇక మరిన్ని కంపెనీల పెట్రోల్ బంక్‌లు!
న్యూఢిల్లీ: ఇంధనాల రిటైలింగ్ వ్యాపారంలో పోటీని ప్రోత్సహించటంపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికోసం లైసెన్సింగ్ నిబంధనలను సరళీకరించాలనే ఉద్దేశంతో... నిపుణుల కమిటీని నియమించింది. మరిన్ని ప్రైవేట్ సంస్థలు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు తోడ్పడే అంశాలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ప్రస్తుతం దేశీయంగా ఇంధన రిటైలింగ్ లైసెన్స్ పొందాలంటే.. హైడ్రోకార్బన్స్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్లైన్ల లేదా ద్రవీకృత సహజ వాయువు టర్మినల్స్ ఏర్పాటు మొదలైన వాటిపై రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రిటైలింగ్ లైసెన్స్ నిబంధనలను సడలించడానికి తగ్గ చర్యలను ఈ నిపుణుల కమిటీ సిఫారసు చేస్తుందని కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. మరిన్ని సంస్థలు, పంప్‌ల రాకతో ధరలపరంగా, సర్వీసులపరంగా రిటైల్ కంపెనీల మధ్య పోటీ పెరిగి వినియోగదారులకు ప్రయోజనం చేకూరగలదని చమురు శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు .. రిటైల్ రేటును నిర్ణయించేందుకు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో రేట్లలో పెద్దగా తేడా ఉండటం లేదు. కిరీట్ పారిఖ్ సారథ్యంలో.. ప్రముఖ ఆర్థిక వేత్త కిరీట్ పారిఖ్, చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఐఓసీ మాజీ చీఫ్ ఎంఏ పఠాన్ ఈ కమిటీలో ఉంటారు. సంబంధిత వర్గాలతో చర్చించి కమిటీ 60 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుంది. ప్రస్తుత పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి ఇంధనాల మార్కెటింగ్‌కి సంబంధించి లైసెన్సింగ్ విధానం, ప్రైవేట్ సంస్థల వాటా తదితర అంశాలను కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలు మరిన్ని రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేసేందుకు అడ్డంకిగా ఉన్న అంశాలను గుర్తించి తగు సిఫార్సులు చేస్తుంది. సింహభాగం పీఎస్యూలదే .. ప్రస్తుతం దేశీయంగా 63,498 పెట్రోల్ పంప్‌లు ఉన్నాయి. వీటిలో సింహభాగం ప్రభుత్వ రంగ సంస్థలవే (పీఎస్‌యూ) ఉన్నాయి. ఐవోసీ అత్యధికంగా 27,325, భారత్ పెట్రోలియంకి 15,255, హెచ్‌పీసీఎల్‌కి 14,565 పంప్‌లున్నాయి. మరోవైపు, ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్‌కి 1,400, నయారా ఎనర్జీకి (గతంలో ఎస్సార్ ఆయిల్) 4,833, రాయల్ డచ్ షెల్కి 114 పంప్‌లున్నాయి. బ్రిటన్‌కి చెందిన బీపీ భారత్‌లో 3,500 పంప్‌లు ఏర్పాటుకు లైసెన్సులు పొందినప్పటికీ ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదు. అటు ఫ్రెంచ్‌కి చెందిన టోటల్ సంస్థ అదానీ గ్రూప్‌తో కలిసి 10 ఏళ్లలో 1,500 పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యం లో లైసెన్సింగ్ నిబంధనల సడలింపునకు కమిటీని ఏర్పాటు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
39 మంది ఎస్ఐల బదిలీ
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో దీర్ఘకాలికంగా వీఆర్‌లో ఉంటూ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారందరికీ అటాచ్‌మెంట్‌పై పోస్టింగ్ కల్పించారు. అలాగే పరిపాలన పరంగా కొందరి ఎస్ఐలకు స్థాన చలనం కల్పించారు. పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం శ్రీనివాస్ వీఆర్ యల్లనూరు హరినాథ్‌రెడ్డి యల్లనూరు గాండ్లపెంట రాజశేఖర్ గాండ్లపెంట వీఆర్ జనార్దన్ వీఆర్ పెనుకొండ లింగన్న పెనుకొండ మడకశిర మక్బూల్‌బాషా మడకశిర ముదిగుబ్బ జయనాయక్ ముదిగుబ్బ ధర్మవరం అర్బన్ ప్రదీప్‌కుమార్ తాడిపత్రి అర్బన్ గార్లదిన్నె శ్రీనివాసులు గార్లదిన్నె అనంతపురం వన్‌టౌన్ గంగాధర్ గుంతకల్లు వీఆర్ బాబాజాన్ వీఆర్ గుంతకల్లు రూరల్ క్రాంతికుమార్ వీఆర్ అనంతపురం త్రీటౌన్ శ్రీనివాసులు వీఆర్ డీసీఆర్బి సుబ్రమణ్యం డీసీఆర్బీ అనంతపురం ట్రాఫిక్ ఆయూబ్‌ఖాన్ వీఆర్ డీసీఆర్బీ రఫి వీఆర్ అనంతపురం నాల్గో పట్టణం వేణుగోపాల్ వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ గణేష్ వీఆర్ అనంతపురం ట్రాఫిక్ నారాయణరెడ్డి వీఆర్ హిందూపురం వన్‌టౌన్ కొండయ్య వీఆర్ అనంతపురం ట్రాఫిక్ సత్యనారాయణ వీఆర్ అనంతపురం నాల్గో పట్టణం ప్రసాద్ వీఆర్ డీసీఆర్బీ కొల్లప్ప వీఆర్ పీసీఆర్ మున్వర్ సుల్తానా వీఆర్ పీసీఆర్ కళావతి వీఆర్ హిందూపురం టూటౌన్ జయపాల్‌రెడ్డి కదిరి అనంతపురం త్రీటౌన్ హేమంత్‌కుమార్ వీఆర్ కదిరి అర్బన్ వేణుగోపాల్రావ్ వీఆర్ స్పెషల్ బ్రాంచ్ దస్తగిరి వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ వంశీకృష్ణ వీఆర్ డీటీసీ ఇస్మాయిల్ వీఆర్ డీటీసీ కమలాకర్‌నాయుడు వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ నజీరుద్దీన్ వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ నరేంద్రభూపతి వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ జాకీర్ హుస్సేన్‌ఖాన్ వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ రాజారెడ్డి వీఆర్ స్పెషల్ బ్రాంచ్ కేవీ లక్ష్మి తాడిపత్రి అర్బన్ వీఆర్ నాగేంద్ర వీఆర్ అనంతపురం ట్రాఫిక్ సుధాకర్ వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ -
బార్ పాలసీలో ఐదు రకాల లైసెన్సులు!
-
బార్ పాలసీలో ఐదు రకాల లైసెన్సులు!
- దరఖాస్తు రుసుం రూ. లక్షకు తగ్గింపు..లైసెన్సుకు రూ. 4 లక్షలు - రెన్యువల్‌కు దరఖాస్తు ఫీజు లేదు.. - హైవేకు 100 మీటర్ల దూరం నిబంధనపై మెలిక - ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం? సాక్షి, అమరావతి: ఎట్టకేలకు నూతన బార్ పాలసీ ఖరారైంది. 2017–18 సంవత్సరానికి గాను బార్ పాలసీలో ఐదు రకాల లైసెన్సులు జారీ చేయనున్నారు. పట్టణ ప్రాంతాలకు ఫాం–2బీ, కార్పొరేషన్లలో స్టార్ హోటళ్లు, టూరిజం ప్రదేశాలు, పార్లర్లు, పదిలక్షలకు పైగా జనాభా ఉన్న విజయవాడ, విశాఖపట్టణాల్లో కొత్తగా ’క్రౌన్’ లైసెన్సులుగా విభజించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ’ఎలైట్’ అనే లైసెన్సు జారీ చేయగా, ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖలలో ’క్రౌన్’ అనే లైసెన్సు జారీ చేయనుంది. క్రౌన్ లైసెన్సు అంటే కేఫ్‌లు/విశాలమైన హాల్స్, రూఫ్ గార్డెన్లు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్న రెస్టారెంట్లకు జారీ చేస్తారు. ఐదు రకాల లైసెన్సులకు రెస్టారెంట్లు తప్పనిసరి చేశారు. ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. బార్ పాలసీని 2005లో రూపొందించారు. అప్పటి నుంచి రెన్యువల్తోనే నెట్టుకొస్తున్నారు. 2016–17 సంవత్సరానికి బార్ పాలసీ రూపొందించారు. అయితే ఈ పాలసీలో ఫస్ట్ కమ్ ఫస్ట్ అనే నిబంధన ఉంచడంతో మద్యం వ్యాపారులు కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ విధానాన్ని హైకోర్టు తప్పు పట్టింది. దీంతో 2017 సంవత్సరానికి కొత్త పాలసీ రూపొందించారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులొస్తే లాటరీ.. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 765 బార్లు ఉండాలి. ప్రస్తుతం 708 మాత్రమే ఉన్నాయి. ఈ బార్లకు లైసెన్సును పునరుద్ధరించి మిగిలిన 57 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. దరఖాస్తు రుసుం రూ. 2 లక్షల నుంచి రూ. లక్షకు తగ్గించారు. రెన్యువల్ చేసుకునే వారు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. లైసెన్సు ఫీజు రూ.4 లక్షలు చెల్లించాలి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కొత్త బార్లకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో అప్పగిస్తారు. ఫాం–2 బీ లైసెన్సుకు 200 చదరపు మీటర్లలో బార్ ఏర్పాటు చేయాలి. బీర్, వైన్ పార్లర్లకు 150 చదరపు మీటర్లు.. కార్పొరేషన్, పదిలక్షలు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో 500 చదరపు మీటర్లు ఉండాలి. ఇందుకు అదనంగా లైసెన్సు రుసుం వసూలు చేస్తారు. హైవేలకు వంద మీటర్ల నిబంధనపై మెలిక హైవేలకు వంద మీటర్ల లోపు మద్యం దుకాణాలు, బార్ల విషయంలో సీరియస్‌గా ఉన్న సుప్రీంకోర్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కొత్త బార్ పాలసీలో వంద మీటర్ల నిబంధనపై ఆబ్కారీ శాఖ మెలిక పెట్టినట్లు సమాచారం. హైవే పక్కన వంద మీటర్ల దూరాన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్ వాణిజ్య సముదాయంగా గుర్తిస్తే బార్ ఏర్పాటు చేయవచ్చనే నిబంధన చేర్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. -
పరిహారానికి కొత్త నిబంధనలు
కొత్తచట్టం ప్రకారం నిర్వాసితులకు చెల్లింపులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో నీటిపారుదల, రోడ్లు-భవనాల శాఖలు విడివిడిగా నిబంధనలను అమలు చేస్తూ వచ్చా యి. అయితే కేంద్రం తీసుకువచ్చిన ‘భూసేకరణ, సహాయ పునరావాస చట్టం-2013’ నేపథ్యంలో కొత్త నిబంధనావళి రూపకల్పన అనివార్యమైంది. ఈ మేరకు అన్ని విభాగాలకు ఏకరూపకత కల్పిస్తూ రోడ్లు, భవనాలశాఖ కొత్త నిబంధనలను రూపొం దించింది. వాటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ అమల్లోకి తెస్తూ.. బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనలివీ.. కోల్పోతున్న నిర్మాణం ప్రాథమిక అంచనా మొత్తం రూ. 4 లక్షలు, అంతకంటే తక్కువగా ఉంటే నిర్మాణ వైశాల్యం (ప్లింత్ ఏరియా) రేట్ల ఆధారంగా లెక్కిస్తారు. రూ. 4లక్షల కంటే ఎక్కువగా ఉంటే నిర్మాణం పూర్తి కొలతలు స్వీకరించి, ఇంజనీరింగ్ అధికారులు రూపొందించే ఎస్ఎస్ఆర్ ప్రకారం లెక్కిస్తారు. ఇంటి నిర్మాణం ఎప్పుడు జరిగిందో గుర్తించి.. దాని తరుగుదల లెక్కించేందుకు ప్రత్యేకంగా సంవత్సరాల వారీగా శాతాన్ని నిర్ధారించారు. గుడిసెలకు తరుగుదల వర్తించదు. ఏదైనా ఇంటి నిర్మాణం జరిగిన సంవత్సరం వివరాలు అందుబాటు లేక, దాని జీవితకాలం విషయంలో స్పష్టత లేనప్పుడు రిజిస్ట్రేషన్ రికార్డులు, పంచాయతీ రికార్డుల ఆధారంగా అంచనా వేస్తారు. అందులోనూ వివరాలు లభించకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేదా పైర్యాంకు అధికారి స్థానికంగా విచారణ జరిపి అంచనా కడతారు. ప్రైవేటు నిర్మాణాలు రోడ్లు, భవనాల శాఖ ప్రమాణాలను అనుసరించే పరిస్థితి ఉండనందున దాని నిర్ధారిత విలువలో 10 శాతం మొత్తాన్ని తగ్గిస్తారు. నిర్మాణాలు అంతస్తుల వారీగా ఉండి, దిగువ అంతస్తు ప్లింత్ ఏరియాతో సమంగా పైఅంతస్థులు ఉన్నప్పటికీ దిగువ అంతస్తు నిర్మాణ అంచనా కంటే పైఅంతస్తు నిర్మాణాల విలువను 25 శాతం మేర తగ్గిస్తారు. ప్రధాన నిర్మాణానికి, ప్రహరీ గోడకు విడివిడిగా విలువ లెక్కగడతారు. కట్టడం విలువలో అందులోని కలప విలువ 25 శాతానికి మించితే.. ఆ కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 100 శాతం విలువను చెల్లిస్తుంది. ఒకవేళ యజమానే ఆ కలపను తీసుకుంటే దాని విలువలో 40 శాతం మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ కలపను మరోప్రాంతానికి తరలించాలంటే అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. -
‘ఉపాధి’ పీవోలుగా ఎంపీడీవోలు
18 నెలల తరువాత మళ్లీ అధికారం ఒకటి నుంచి పర్యవేక్షణ బాధ్యత యలమంచిలి : ఉపాధిహామీ పథకం బాధ్యతలను ప్రభుత్వం 18 నెలల తర్వాత మళ్లీ ఎంపీడీవోలకు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 2007 జూన్ 19న ఎంపీడీవోలను ఉపాధి హామీ పథకం అధికారి (పీవో)లుగా నియమిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీవో 276 జారీ అయింది. క్షేత్రస్థాయి పనుల్లో రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయంటూ సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి. ఇందులో పీవోల హోదాలో ఎంపీడీవో పాత్ర కూడా కీలకమేనన్న ఆరోపణలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. వారిని బాధ్యులను చేస్తూ రికవరీ పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీవోలు ఆందోళన చేపట్టారు. ఉపాధి పీవోలుగా తాము పనిచేయలేమంటూ తెగేసి చెప్పారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ సిగ్నేచర్ కీ (డీఎస్కే) వెనక్కి ఇచ్చారు. దీంతో అదనపు పీవోలకు ఇన్చార్జ్ పీవోలుగా ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగిస్తూ 2013 మార్చి ఒకటిన గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ (సీఆర్డీ) ఉత్తర్వు 472ను జారీ చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఏపీవోలే పీవోల బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నారు. తాజాగా మళ్లీ ఎంపీడీవోలకే పీవోల బాధ్యతలనిస్తూ జీవో 139 జారీ అయింది. అక్టోబర్ ఒకటి నుంచి ఎంపీడీవోలు ఈ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకానికి అదే పథకంలో పనిచేసే ఏపీవోలే అన్నీ తామై పనిచేశారు. కొత్తప్రభుత్వం ఉపాధి పనుల మరింత వేగవంతానికి ఎంపీడీవోలనే పీవోలుగా ఉంచాలని భావించింది. నెల రోజుల క్రితం యలమంచిలి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు సైతం ఎంపీడీవోలకు ఉపాధి పనుల బాధ్యత అప్పగించనున్నట్టు వెల్లడించారు. పనులు వేగవంతం... : ఉపాధి పనుల వేగవంతానికి ఎక్కడెక్కడ ఏఏ పనులు చేపట్టాలి, చేపట్టేవి ఉపయోగకరమైనవా, కాదా, జాబ్‌కార్డుల నమోదు, గ్రామ పంచాయతీ పరిధిలో చేసిన పనులకు బిల్లులు ఆలస్యం కాకుండా చూడటం, దరఖాస్తుదారులందరికీ పనులు కల్పించడంతో పాటు డిజిటల్ కీతో కూడిన సాఫ్ట్‌వేర్‌లో వివరాలన్నింటిని నమోదు చేయాల్సి ఉంటుంది. చేసిన పనులకు, తీసిన కొలతలకు సరిపడా తయారు చేసిన ఎంబుక్‌లో సంతకాలు చేస్తేనే ఇక నుంచి కూలీలకు చెల్లింపులు జరుగుతాయి. తాజా ఉత్తర్వు ప్రకారం ఉపాధి హామీ పథకంలో ఎంపీడీవోతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ విస్తరణాధికారి (ఈవోపీఆర్డీ), ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను కూడా భాగస్వాములు కానున్నారు. -
డ్వాక్రాలకు బాబు టోకరా
కానరాని రుణమాఫీ రూ.లక్ష సంఘనిధి పేరిట తాజా ఉత్తర్వులు కొత్త అప్పులివ్వడానికి బ్యాంకులు వెనుకంజ ఆందోళనలో మహిళలు పాడేరు : ఎన్నడూ లేని విధంగా డ్వాక్రా సంఘాలు టీడీపీ పాలనలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక్కొక్క సంఘానికి రూ.లక్ష రుణమాఫీ లేదని, 2013-14 సంవత్సరానికి రుణాలు పొందిన సంఘాలకు మాత్రం రూ.లక్ష చొప్పున సంఘ నిధి పేరిట జమ చేస్తామని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో డ్వాక్రా మహిళల్లో మరింత ఆందోళన ఏర్పడుతోంది. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని వెంటనే కొత్తరుణాలు కూడా పంపిణీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నేతలంతా విస్తృత ప్రచారం చేశారు. కానీ అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు డ్వాక్రా రుణాల రద్దుపై తాత్సారం చేస్తుండడంతో ఏజెన్సీ డ్వాక్రా మహిళల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికలకు ముందే రుణమాఫీ ప్రచారం జరగడంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను గత ఏడాది డిసెంబరు నుంచి చెల్లించలేదు. దీంతో వడ్డీలు పెరిగిపోయాయి. తాత్సారంతో గందరగోళం ఏజెన్సీలోని11 మండలాల పరిధిలో 9,900 డ్వాక్రా సంఘాలు ఉండగా 5,200 సంఘాలకు చెందిన మహిళలు రుణబాధితుల్లో ఉన్నారు. నాలుగేళ్ల నుంచి మొండి బకాయిలు రూ. 28 కోట్లు ఉండగా 2013-14 సంవత్సరానికి రూ.19 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం రూ.47 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. కానీ మొండి బకాయిలు రూ.28 కోట్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం గత ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాల రుణాలు పొందిన రూ.19 కోట్లకు సంబంధించి రుణమాఫీ చేయకపోగా సంఘ నిధి పేరిట వారి సంఘాలలో రూ. లక్ష జమ చేసేందుకు నిర్ణయించింది. ఈ నిబంధనలతో రుణమాఫీకి ఆటంకం ఏర్పడింది. అయితే ఐకేపీ అధికారులు సెర్ప్ సంస్థకు ఇటీవల ఒక నివేదికను సమర్పించారు. సంఘ నిధి పేరిట జమ చేసే రూ.లక్షను నాలుగేళ్ల నుంచి రుణాలు పొందిన మొత్తం 5,200 సంఘాలకు అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని, ఈ నగదును రుణ బకాయిలకు జమ చేయవచ్చని ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో డ్వాక్రా సంఘాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం అధికారులను కూడా గందరగోళంలోకి నెట్టేసింది. కొత్త రుణాలకు బ్యాంకులు వెనుకంజ పాడేరు డివిజన్లో 800 కొత్త సంఘాలకు రూ.12 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేసేందుకు ఐకేపీ ఏర్పాట్లు చేసినా అన్ని బ్యాంకుల అధికారులు ముందుకు రాకపోవడంతో మహిళలు రుణాల కోసం ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీపై ప్రభుత్వ తాత్సారం చేయడంతో ఈ కొత్త సంఘాల మహిళలు బ్యాంకుల చుట్టు తిరుగుతున్నా అధికారులు వెనుకంజ వేస్తున్నారు.