సాక్షి, న్యూఢిల్లీ: నిషేధిత చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ (ఎస్‌ఎంఇ) తో కొత్త లైసెన్సింగ్ ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ కొత్త డీల్ ప్రకారం యాప్ లో సోనీ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్స్ ని క్రియేటర్స్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఒప్పందం విలువ వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. అయితే టిక్‌టాక్ యూజర్లు సోనీ మ్యూజిక్ కళాకారుల కంటెంట్ వాడుకోవచ్చని టిక్‌టాక్ ఒక ప్రకటనలో తెలిపింది
తాజా ఒప్పందంతో సోనీ మ్యూజిక్ ప్రస్తుత హిట్స్, కొత్త రిలీజ్ లు, ఐకానిక్ క్లాసిక్స్ లాంటివి టిక్‌టాక్ క్రియేటర్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సోనీ మ్యూజిక్ క్లిప్‌లను ప్రదర్శించడాని కంటే మించి వాటిని ప్రమోట్ చేసే ప్రయత్నాలతోపాటు, యూజర్లకు మంచి మ్యూజిక్ అందుబాటులోకి వస్తుందని సోనీ మ్యూజిక్ ప్రతినిధి డెన్నిస్ కూకర్ తెలిపారు. సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం చాలా ఆనందంగా ఉందనీ, తద్వారా అమెరికా సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోనీ కళాకారుల అద్భుతమైన కంటెంట్‌ను కొత్త ప్రేక్షకులతో అనుసంధానించడానికి, టిక్‌టాక్ శక్తిని ఉపయోగించుకోవాడినికి వీలవుతుందని టిక్‌టాక్ గ్లోబల్ హెడ్ ఆఫ్ మ్యూజిక్ ఓలే ఒబెర్మాన్ పేర్కొన్నారు. టిక్‌టాక్ ఇప్పటికే యూనివర్సల్, సోనీ వార్నర్‌లతో స్వల్పకాలిక లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment