ఎట్టకేలకు నూతన బార్ పాలసీ ఖరారైంది. 2017–18 సంవత్సరానికి గాను బార్ పాలసీలో ఐదు రకాల లైసెన్సులు జారీ చేయనున్నారు. పట్టణ ప్రాంతాలకు ఫాం–2బీ, కార్పొరేషన్లలో స్టార్ హోటళ్లు, టూరిజం ప్రదేశాలు, పార్లర్లు, పదిలక్షలకు పైగా జనాభా ఉన్న విజయవాడ, విశాఖపట్టణాల్లో కొత్తగా ’క్రౌన్’ లైసెన్సులుగా విభజించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ’ఎలైట్’ అనే లైసెన్సు జారీ చేయగా, ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖలలో ’క్రౌన్’ అనే లైసెన్సు జారీ చేయనుంది. క్రౌన్ లైసెన్సు అంటే కేఫ్‌లు/విశాలమైన హాల్స్, రూఫ్ గార్డెన్లు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్న రెస్టారెంట్‌లకు జారీ చేస్తారు.