హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్.. అమెరికా తదితర మార్కెట్లలో దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికల్లో భాగంగా బయోసిమిలర్స్, డిజిటల్ సొల్యూషన్స్ మొదలైనవాటిపై మరింతగా దృష్టి పెట్టనుంది. మధ్యకాలికంగా ఇంజెక్టబుల్స్, సంక్లిష్టమైన ఓరల్ డోసేజీలు, ఓటీసీ బ్రాండ్లపైనా ఫోకస్ చేయనుంది. 2023–24 వార్షిక నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. రాబోయే రోజుల్లో టాప్ 10 సంపన్న మార్కెట్లలో పలు బ్రాండ్లు ఎక్స్‌క్లూజివిటీని కోల్పోవడం వల్ల జనరిక్స్, బయోసిమిలర్ల వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉండగలవని తెలిపింది.
నివేదిక ప్రకారం 2023 క్యాలండర్ సంవత్సరంలో 1.6 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఫార్మా మార్కెట్ 2028నాటికి 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరగలదనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు, చికిత్సా ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా 2027 నుంచి ఏటా 3 వినూత్న సొల్యూషన్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. అప్పటికి 25 శాతం ఉత్పత్తులు మార్కెట్లో తొలిసారిగా ప్రవేశపెట్టేవే ఉంటాయని పేర్కొంది. 2030 నాటికి 150 కోట్ల మంది పేషంట్లకు చేరు వ కావాలని నిర్దేశించుకున్నట్లు ప్రస్తుతం ఈ సంఖ్య సుమారు 70.4 కోట్లుగా ఉందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment