Raveena Tandon Recalls Traumatic an Experience With Fans - Sakshi
Sakshi News home page

Raveena Tandon: భయపడి పోలీసులను ఆశ్రయించాం.. రవీనా టాండన్‌కు చేదు అనుభవం

Published Sun, Nov 6 2022 8:11 PM

Raveena Tandon Recalls Traumatic an Experience With Fans - Sakshi

కేజీఎఫ్‌ మూవీలో నటించిన బాలీవుడ్‌ సీనియర్‌ నటి రవీనా టాండన్‌. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర ‍‍స్థానం సంపాదించకుంది భామ. అయితే ఆమెకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవలే బయట పెట్టారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు ఎదురైన భయానక పరిస్థితిని గుర్తు చేసుకున్నారు.

ఓ అభిమాని రవీనాకు రక్తంతో రాసిన లేఖలు, బ్లడ్ వయల్స్, అశ్లీల చిత్రాలు కొరియర్ ద్వారా పంపేవాడని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.  తన భర్త అనిల్ తడానీ, పిల్లలతో కలిసి వెళ్తుండగా అభిమాని కారుపై పెద్ద రాయి విసిరిన సంఘటనను గుర్తు చేసుకుంది. ఆ ఘటనతో భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశామని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది.

ఇంటి వద్ద రెక్కీ: అంతే కాకుండా రవీనాపై ప్రేమను నిరూపించుకోవడానికి ఒక అభిమాని ఏకంగా ఒకసారి ఆమె నివాసం గేటు బయట కూడా క్యాంప్ నిర్వహించాడని భయానకమైన పరిస్థితిని నటి వివరించింది. కేజీఎఫ్‌లో నటించిన రవీనా.. ప్రస్తుతం అర్బాజ్ ఖాన్ నిర్మాతగా వస్తున్న చిత్రం 'పట్నా శుక్లా'లో కనిపించనుంది. ఈ సినిమాలో సతీష్ కౌశిక్, మానవ్ విజ్, చందన్ రాయ్ సన్యాల్, జతిన్ గోస్వామి, అనుష్క కౌశిక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఫోటోగ్రఫీపై మక్కువ : మక్కువతో ఫొటోగ్రఫీని తన ప్రవృత్తిగా ఎంచుకుంది బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌. అయితే తాను తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాతో పాటు ఎగ్జిబిషన్లు, ఆర్ట్‌ గ్యాలరీల్లోనూ ప్రదర్శితం కావడం విశేషం. వన్యప్రాణుల్ని, అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్‌ చేయడానికి ఎక్కువ ఇష్టమని వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని బంధావ్‌ఘర్‌ నేషనల్‌ పార్క్‌లో తన భర్త, కూతురితో కలిసి పర్యటించిన రవీనా.. అక్కడి వన్యప్రాణుల్ని తన కెమెరాలో బంధించి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆమె తీసిన కొన్ని ఫొటోలు ముంబయిలోని ‘జహంగీర్‌ ఆర్ట్‌ గ్యాలరీ’లోనూ ప్రదర్శించారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement