Sakshi News home page

Thalapathy Vijay: దళపతి విజయ్ పార్టీ పేరులో మార్పు.. కారణం అదే?

Published Sun, Feb 18 2024 10:17 AM

Small Change In Vijay Party Name Tamilaga Vetri Kazhagam - Sakshi

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కి తెలుగులోనూ బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది 'వారసుడు', 'లియో' సినిమాలతో అలరించిన విజయ్.. ప్రస్తుతం 'ద గోట్' అనే మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే కొన్ని రోజుల ముందు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2026లోని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష‍్యంగా పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు పార్టీ పేరులో స్వల్ప మార్పు చేశారు.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్)

దళపతి విజయ్‌ పెట్టిన రాజకీయ పార్టీ పేరు 'తమిళగ వెట్రి కళగం'. ఇందులోనే తప్పు దొర్లినట్లు తమిళ మేధావుల సూచించారు. ఈ మేరకు స్వల్ప మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తమిళంలో అదనంగా 'క్‌' అనే అక్షరాన్ని జోడించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎన్నికల కమిషన్‌లో ఇదే పేరుతో రిజిస్టర్‌ చేశారు. కానీ తమిళగ వెట్రి కళగంని ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. దీనిపై పలు పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. 

తమిళగ వాల్వురిమై కట్చి తదితర కొన్ని చిన్న పార్టీల పేర్లు కూడా ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. ఇదే టైంలో విజయ్‌ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండటం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మేధావుల నిర్ణయం  మేరకు.. తమిళగ వెట్రి కళగం పేరులో 'క్‌' అనే అక్షరాన్ని జోడించారు. దీంతో ఇకపై 'తమిళగ వెట్రిక్‌ కళగం' అని పిలవాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Advertisement

What’s your opinion

Advertisement