ఆర్టీసీ బస్సు ఢీకొని లారీ డ్రైవర్‌ దుర్మరణం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని లారీ డ్రైవర్‌ దుర్మరణం

Published Wed, May 15 2024 5:40 AM

ఆర్టీసీ బస్సు ఢీకొని లారీ డ్రైవర్‌ దుర్మరణం

మాడుగులపల్లి : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కుక్కడం గ్రామశివారులో అద్దంకి– నార్కట్‌పల్లి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన లారీడ్రైవర్‌ గంధం ప్రసన్నతేజ చైన్నె నుంచి మెంతుల లోడు లారీతో మహారాష్ట్రకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుక్కడం శివారుకు రాగానే లారీని రోడ్డు పక్కకు నిలుపుతుండగా పక్క నుంచి వేగంగా వచ్చిన ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 

దీంతో తీవ్రంగా గాయపడిన ప్రసన్నతేజ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు చిలకలూరిపేట ఆర్టీసీ డిపోకు చెందినదిగా తెలిసింది. అతివేగం, నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement