Kanimozhi Karunanidhi: రాజకీయ కవయిత్రి | Lok Sabha Elections 2024: Kanimozhi Karunanidhi Is A Journalist Turned Political Leader From Tamil Nadu - Sakshi
Sakshi News home page

Kanimozhi Karunanidhi: రాజకీయ కవయిత్రి

Published Sat, Apr 13 2024 6:29 AM

Lok sabha elections 2024: Kanimozhi Karunanidhi is a journalist turned political leader from Tamil Nadu - Sakshi

కనిమొళి బహుముఖ ప్రజ్ఞాశాలి

కనిమొళి కరుణానిధి.. బహుముఖ ప్రతిభావంతురాలైన రాజకీయవేత్త, కవి, పాత్రికేయురా లు, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యురాలు. తూత్తుక్కుడి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

చురుకైన విద్యార్థి...  
కనిమొళి చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. బాల్యంలో తండ్రితో పెద్దగా గడపలేకపోయినా.. ఆయనకు మాత్రం ప్రియమైన కూతురే. కనిమొళి పుట్టిన తరువాతే ముఖ్యమంత్రి పదవి దక్కడంతో అది ఆమె తెచి్చన అదృష్టమేనని కరుణానిధి భావించేవారు. తండ్రి తన దగ్గరలేని బాధను కనిమొళి కవిత్వంగా మలిచారు. అది చదివి ఆయన కదిలిపోయారు. అలా తండ్రీకూతుళ్లను సాహిత్యం మరింత దగ్గర చేసింది.

కనిమొళి క్రియాశీల రాజకీయాలకు దూరంగా పెరిగారు. 2001లో జయలలిత హయాంలో కరుణానిధిని అరెస్టు చేసినప్పుడు తండ్రి పక్కన నిలబడి తొలిసారి ప్రముఖంగా బయటకు కనిపించారు. నాటినుంచీ ఆయన గళంగా మారిపోయారు. తండ్రి బహుముఖ ప్రజ్ఞకు కనిమొళి అప్రకటిత వారసురాలు. దానికి తోడు ఇంగ్లిష్‌ బాగా మాట్లాడతారు. దాంతో కరుణానిధి ఢిల్లీలో పెద్దలెవరినీ కలిసినా వెంట కనిమొళి ఉండేవారు.

కనిమొళి ఢిల్లీ రాజకీయాల్లో, స్టాలిన్‌ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండేలా కరుణానిధి ముందుచూపుతో వ్యవహరించారు. 1982లో జయలలిత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన వేదికపైనే 2008 జూన్‌లో కనిమొళితో డీఎంకే తొలి మహిళా సమ్మేళనం నిర్వహించారు. అలా ఆమెను అగ్రనాయకురాలిగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. కనిమొళిని జయలలితకు కౌంటర్‌గా కరుణానిధి చూశారు. వారిద్దరికీ సారూప్యమూ ఉంది. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జర్నలిస్టులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగానే రాజకీయ జీవితం ప్రారంభించారు.

రాజకీయాల్లో...  
కనిమొళి 2007లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. çఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి కమిటీ, హోమ్‌ వ్యవహారాల వంటి పలు కమిటీల్లో చురుగ్గా పనిచేసి ఆకట్టుకున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ సభ్యురాలిగా చేశారు. 2013లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్నారు. 2019లో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. తూత్తుక్కుడి నుంచి బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌పై ఏకంగా 3,47,209 ఓట్ల మెజారిటీతో గెలిచారు.                          

సక్సెస్‌ఫుల్‌ జర్నలిస్టు..  
కనిమొళి సక్సెస్‌ఫుల్‌ జర్నలిస్టు కూడా. ప్ర ముఖ ఆంగ్ల దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా చేశా రు. తమిళ వారపత్రిక ‘కుంగుమం’ సంపాదకురాలిగా వ్యవహరించారు. సింగపూర్‌కు చెందిన ‘తమిళ మురసు’ వార్తాపత్రికకూ ఫీచర్స్‌ ఎడిటర్‌గా సేవలందించారు. తమిళంలో కవిత్వం రాశారు. తమిళ కవిత్వాన్ని ఇంగ్లి‹Ùలోకి అనువదించారు. ఆమె రచనలు ఇంగ్లి‹Ù, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోకి అనువాదమయ్యాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement