వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం | Sakshi
Sakshi News home page

వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

Published Mon, Apr 8 2024 1:15 AM

గుర్ల: బెల్లపు ఊటలను ధ్వంసం చేస్తున్న ఎస్సై భాస్కరరావు, సిబ్బంది - Sakshi

కొత్తవలస: మండలంలోని దేవాడ గ్రామం శివారులో గల మామిడి తోటల్లో రహస్యంగా నిర్వహిస్తున్న సారా తయారీ శిబిరాలపై ఎస్సై సుదర్శన్‌ తన సిబ్బందితో కలిసి ఆదివారం దాడి చేశారు. సారా తయారీకి పులియబెట్టిన బెల్లం ఊటను భూమిలో గొయ్యి తీసి తయారీదారులు రహస్యంగా పాతిపెట్టిన సమాచారం తెలుసుకున్న ఎస్సై సుదర్శన్‌ తన సిబ్బందితో మామిడి తోటల్లో తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్లాస్టిక్‌ డ్రమ్ములతో ఉంచిన వెయ్యి లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుదర్శన్‌ తెలిపారు.

మరో 3వేల లీటర్లు..

గుర్ల: మండలంలోని దేవునికణపాక శివారు ప్రాంతంలో మూడు చోట్ల సారా తయారీ ప్రాంతాలను ఎస్సై భాస్కరరావు ఆదివారం గుర్తించారు. ఈ సందర్భంగా సారా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 3వేల లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. దీంతో పాటు 25 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు ఎస్సై భాస్కరరావు తెలిపారు. సారా తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్లపు ఊటలను ధ్వంసం చేసిన వారిలో గుర్ల పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఉన్నారు.

మామిడితోటల్లో గుర్తించిన  బెల్లం ఊట డ్రమ్ములు
1/1

మామిడితోటల్లో గుర్తించిన బెల్లం ఊట డ్రమ్ములు

Advertisement
Advertisement