TMC: నేతల్లో అంతరాలు లేవు.. మమతా నాయకత్వంలోనే.. | Sakshi
Sakshi News home page

TMC: నేతల్లో అంతరాలు లేవు.. మమతా నాయకత్వంలోనే..

Published Sun, Jan 7 2024 8:31 PM

Abhishek Banerjee Says No Difference Between Old Guard New Generation TMC - Sakshi

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(TMC) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో తమ పార్టీ నేతలందరూ ఐకమత్యంతో ఉన్నారని ఎంపీ అభిషేక్‌ బెనర్జీ తెలిపారు. ఇటీవల టీఎంసీలో సీనియర్‌ నాయకులు, జూనియర్‌ నాయకులు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అటువంటి అంతరాలు తమ పార్టీ నేతల్లో లేవని సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో తామంతా పనిచేస్తున్నామని అభిషేక్‌ స్పష్టం చేశారు.

ఆయన 24 పరగణాల నియోజవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను పార్టీలో క్రియాశీలకంగా ఉండటం లేదని వస్తున్న వార్తలు కూడా అసత్యమని, పూర్తిగా ఆధారాలు లేనివని అన్నారు. తమ పార్టీలో సీనియర్‌, జూనియర్‌ నాయకులు అనే అంతరాలు ఎక్కడా లేవని తెలిపారు. తాము అంతా కలిసికట్టుగా సీఎం మమతా నాయకత్వంలోనే పని చేస్తున్నామని అభిషేక్‌ పేర్కొన్నాము.

ఇక.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికలు వస్తున్న సమయంలో తన నియోజకవర్గంలో ప్రచారంపై దృష్టి పెట్టానని తెలిపారు. అంతే కానీ, తాను పార్టీ కార్యకలాపాలకు ఎప్పుడూ దూరంగా లేనని వెల్లడించారు. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. తనకు అప్పగించే ఏ బాధత్యనైనా పార్టీ కోసం తప్పకుండా పాటిస్తానని అన్నారు. 

చదవండి: దుండగుల కాల్పుల్లో టీఎంసీ నేత దారుణ హత్య

Advertisement
 
Advertisement
 
Advertisement