కాంగ్రెస్ మేనిఫెస్టోపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ మేనిఫెస్టోపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Published Fri, Apr 26 2024 4:00 PM

Amit shah Says About Congress Manifesto

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో.. బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ మేనిఫెస్టో మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ మీద ప్రజల్లో మరింత మొగ్గు పెరిగిందని అన్నారు.

గతంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బుజ్జగించే పాత అలవాటును పునరావృతం చేసిందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో వ్యక్తిగత చట్టాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ఇది దేశాన్ని విభజించేలా ఉందని షా పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం, ఇచ్చిన మాటపైన నిలబడే పార్టీని ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

భారతదేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ షరియా చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లు అమిత్ షా అన్నారు. మన రాజ్యాంగం లౌకికమైనది, దేశంలోని చట్టాలు మతం ఆధారంగా రూపొందించబడలేదు. కాబట్టి అవన్నీ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడతాయని అమిత్ షా ఉద్ఘాటించారు.

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) తీసుకువస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో స్పష్టంగా చెప్పిందని హోంమంత్రి చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి యూసీసీని ప్రారంభించాం, దీనిని ముందుకు తీసుకెళ్తాం. వ్యక్తిగత చట్టాలను ఈ దేశంలో అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement