టీడీపీ నేత బండారుపై ఖుష్బూ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత బండారుపై ఖుష్బూ ఆగ్రహం

Published Fri, Oct 6 2023 11:30 AM

Khushbu Sundar Reacts On TDP Leader Bandaru - Sakshi

సాక్షి, చెన్నై:  టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సినీ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని మండిపడ్డారామె. 

రోజాపై బండారు వ్యాఖ్యలు దారుణం. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా?. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరు. బండారు ఒక సగటు మనిషిగా కూడా విఫలమయ్యారు అని అన్నారామె. 

ఈ విషయంలో మంత్రి రోజా నా మద్దతు ప్రకటిస్తున్నా. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని చెప్పారామె.  మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియం బిల్లు) ప్రధాని మోదీ తెచ్చారని, మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని కుష్బూ ఆవేదన ‍వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement