‘అమేథీ’లోనూ రాహుల్‌ పోటీ..! | Sakshi
Sakshi News home page

అమేథీ నుంచి కూడా రాహుల్‌ గాంధీ పోటీ..!

Published Mon, Apr 8 2024 9:59 PM

Rahul Gandhi Might Contest From Amethi Also - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన నామినేషన్‌ కూడా వేశారు. అయితే ఆయన  ఉత్తరప్రదేశ్‌లోని తన పాత నియోజకవర్గం అమేథీ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వయనాడ్‌లో పోలింగ్‌ ముగిశాక అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనే దానిపై రాహుల్‌ నిర్ణయించుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు అమేథీ నుంచి కూడా రాహుల్‌ పోటీ చేశారు. అయితే వయనాడ్‌లో విజయం సాధించిన రాహుల్‌ గాంధీ అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఓడిపోయారు. ఈసారి రాహుల్‌ అమేథీ నుంచి పోటీ చేస్తారా అనే విషయంలో పార్టీ క్యాడర్‌తో పాటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర భారత దేశంలోనూ పార్టీకి ఊపు తీసుకురావాలంటే రాహుల్‌ అమేథీ నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి.. అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం.. రాహుల్‌ గాంధీ 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement