రన్నరప్‌గా నిలిచిన అనిరుధ్‌-విజయ్‌ సుందర్‌ జోడీ  | Sakshi
Sakshi News home page

రన్నరప్‌గా నిలిచిన అనిరుధ్‌-విజయ్‌ సుందర్‌ జోడీ 

Published Tue, Jan 30 2024 8:00 AM

Challenger Tennis Tournament In Quimper: Anirudh Chandrasekar and Vijay Sundar Prashanth Stands Runner Up - Sakshi

ఫ్రాన్స్‌లో జరిగిన క్వింపెర్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్‌ చంద్రశేఖర్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో అనిరుద్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) జోడీ 6–7 (4/7), 3–6తో గినార్డ్‌–రిండెర్‌నెచ్‌ (ఫ్రాన్స్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది.

గతవారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అనిరుద్‌–విజయ్‌ జంట ‘వైల్డ్‌ కార్డు’తో మెయిన్‌ ‘డ్రా’లో పోటీపడి తొలి రౌండ్‌లో నిష్క్రమించింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement