ఇలాంటి అద్భుతాలు నీవు మాత్రమే చేయగలవు మాక్సీ: కోహ్లి | Glenn Maxwell earns praise from Virat Kohli after double hundred vs Afghanistan - Sakshi
Sakshi News home page

ఇలాంటి అద్భుతాలు నీవు మాత్రమే చేయగలవు మాక్సీ: కోహ్లి

Published Wed, Nov 8 2023 3:48 PM

Glenn Maxwell earns praise from Virat Kohli after double hundred vs Afghanistan - Sakshi

గ్లెన్ మాక్స్‌వెల్.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మారుమ్రోగిపోతుంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో అఫ్గానిస్తాన్‌పై విరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన మాక్స్‌వెల్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఒక వైపు గాయంతో బాధపడుతూనే అద్భుతమైన డబుల్‌ సెంచరీతో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 292 పరుగుల లక్ష్య చేధనలో 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుకు చేరిన ఆసీస్‌ను.. మ్యాక్సీ తన అద్బుత ఇన్నింగ్స్‌తో సెమీస్‌కు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా  128 బంతులు ఎదుర్కొన్న మాక్స్‌వెల్ 21 ఫోర్లు, 10 సిక్సులతో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక మ్యాక్సీ ఇన్నింగ్స్‌కు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పిధా అయిపోయాడు. సోషల్‌ మీడియా వేదికగా మాక్సీను కింగ్‌ కోహ్లి ప్రశించాడు..

"ఇటువంటి అద్భుతాలు నీవు మాత్రమే చేయగలవు మాక్సీ" అంటూ విరాట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా వీరిద్దరూ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.


చదవండిబాబర్‌ ఆజమ్‌ శకం ముగిసింది.. నయా నంబర్‌ వన్‌ శుభ్‌మన్‌ గిల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement