WC 2023: ఒకేరోజు కోహ్లి- రోహిత్‌ సరికొత్త చరిత్ర.. లారా, ఏబీడీ రికార్డులు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

Virat-Rohit: వరల్డ్‌కప్‌లో ఒకేరోజు కోహ్లి- రోహిత్‌ సరికొత్త చరిత్ర.. లారా, ఏబీడీ రికార్డులు బ్రేక్‌..

Published Fri, Oct 20 2023 12:59 PM

Ind vs Ban: Most Runs in ODI World Cups Both Rohit Kohli Went Past Lara De Villiers - Sakshi

ICC ODI WC 2023- Virat Kohli- Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగ్లా విధించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గెలుపునకు పునాది వేస్తే.. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అర్ధ శతకం(53)తో దానిని మరింత బలపరిచాడు.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్‌ కోహ్లి.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌(34- నాటౌట్‌)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

రోహిత్‌ దూకుడు.. కోహ్లి క్లాస్‌ ఇన్నింగ్స్‌
ఇలా పుణెలో బంగ్లాతో మ్యాచ్‌లో ఓపెనింగ్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో దూకుడుగా ఆడుతూ బంగ్లా బౌలర్లను ఒత్తిడిలోకి నెడితే.. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని కోహ్లి విజయంగా మలిచి మరోసారి ఛేజింగ్‌ కింగ్‌ అనిపించుకున్నాడు. 

ఈ క్రమంలో.. రన్‌మెషీన్‌ కోహ్లి పలు అరుదైన రికార్డులు సాధించగా.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సైతం కోహ్లితో కలిసి ఎలైట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల లిస్టులో ‘విరాహిట్‌’ ద్వయం ఒకేరోజు(అక్టోబరు 19) టాప్‌-5లోకి చేరుకోవడం విశేషం.

లారా, ఏబీడీ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి, రోహిత్‌
ఈ క్రమంలో కోహ్లి, రోహిత్‌.. వరుసగా వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా, సౌతాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ను అధిగమించారు. ఈ జాబితాలో ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి.. భారత బ్యాటర్లలో సచిన్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేసి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు
►సచిన్‌ టెండుల్కర్‌(ఇండియా)- 2278 రన్స్‌- 44 ఇన్నింగ్స్‌లో
►రిక్కీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా)- 1743 రన్స్‌- 42 ఇన్నింగ్స్‌లో
►కుమార్‌ సంగక్కర- 1532 రన్స్‌- 35 ఇన్నింగ్స్‌లో
►విరాట్‌ కోహ్లి- 1286 రన్స్‌- 30 ఇన్నింగ్స్‌లో
►రోహిత్‌ శర్మ- 1243 రన్స్‌- 21 ఇన్నింగ్స్‌లో
►బ్రియన్‌ లారా- 1225 రన్స్‌- 33 ఇన్నింగ్స్‌లో
►ఏబీ డివిలియర్స్‌- 1207 రన్స్‌- 22 ఇన్నింగ్స్‌లో.

చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి

Advertisement
Advertisement