Ind vs Eng: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే ఆధిపత్యం | Sakshi
Sakshi News home page

IND vs ENG 5th Test : ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే ఆధిపత్యం

Published Thu, Mar 7 2024 8:57 AM

India vs England 5th Test Day 1 Live Updates And Highlights - Sakshi

India vs England 5th Test Day 1 updates: టీమిండియాతో ధర్మశాల వేదికగా గురువారం మొదలైన టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. భారత స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 30 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసింది.

టీమిండియా కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అర్ధ శతకం(52)తో ఆకట్టుకుని.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌(26)తో కలిసి క్రీజులో ఉన్నాడు. ఇక మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 57 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా ఐదో టెస్టులో టీమిండియా తొలిరోజు 10 వికెట్లు తీయడంతో పాటు.. 135 పరుగులు చేసి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. 

  24.2: రోహిత్‌ శర్మ అర్ధ శతకం
బషీర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్‌

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
యశస్వి జైస్వాల్‌(57) రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. శుబ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చాడు. భారత్‌ స్కోరు:  104-1(21)

1000 పరుగుల వీరుడు
14.3: టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి జైస్వాల్‌. 16 ఇన్నింగ్స్‌లోనే అరుదైన మైలురాయిని చేరుకుని.. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు.

13 ఓవర్ల ముగిసే సరికి భారత్‌ స్కోరు: 57/0
రోహిత్‌ 30, జైస్వాల్‌ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.
11.4: హాఫ్‌ సెంచరీ కొట్టిన టీమిండియా

10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 47/0
జైస్వాల్‌ 25, రోహిత్‌ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.

5 ఓవర్లలో టీమిండియా స్కోరు: 18-0
ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ 4, రోహిత్‌ శర్మ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

218 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌
ఐదో టెస్ట్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51), జడేజా (1/17) ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (79) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు.

అశ్విన్‌ ఖాతాలో మూడో వికెట్‌
218 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో బెన్‌ ఫోక్స్‌ (24) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

ఎనిమిదో వికెట్‌ డౌన్‌
49.4: అశ్విన్‌ బౌలింగ్లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి మార్క్‌ వుడ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. షోయబ్‌ బషీర్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు:  183-8(50)

ఏడో వికెట్‌ డౌన్‌
49.2: వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఇంగ్లండ్‌ టెయిలెండర్‌ టామ్‌ హార్లే రూపంలో ధర్మశాల మ్యాచ్‌లో తొలి వికెట్‌ దక్కింది. మార్క్‌ వుడ్‌ క్రీజులోకి వచ్చాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
కుల్దీప్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ ఎల్బీడబ్ల్యూ.  స్టోక్స్‌ రూపంలో ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోగా.. కుల్దీప్‌ యాదవ్‌కు ఐదో వికెట్‌ దక్కింది. టామ్‌హర్లే క్రీజులోకి వచ్చాడు.

►ఇంగ్లండ్‌ జో రూట్‌ రూపంలో ఐదో వికెట్‌ కోల్పోయింది. 26 పరుగులు చేసిన రూట్‌.. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

నాలుగో వికెట్‌ డౌన్‌..
175 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జానీ బెయిర్‌ స్టో.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వచ్చాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
37.2: టీమిండియా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మరోసారి తన మాయాజాలం ప్రదర్శించాడు. హాఫ్‌ సెంచరీతో అదరగొట్టి ప్రమాదకరంగా మారిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలే(79)ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు. ఫలితంగా మూడో వికెట్‌నూ తనఖాతాలోనే వేసుకున్నాడు. వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్‌ స్టో క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 143-3(38)

రెండో వికెట్‌ డౌన్‌..
100 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఓలీ పోప్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. లంచ్‌ విరామానికి ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో జాక్‌ క్రాలే(61) పరుగులతో ఉన్నాడు.

తొలి వికెట్‌ డౌన్‌..
64 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన బెన్‌ డకెట్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ఓలీ పోప్‌ వచ్చాడు.

14.2: హాఫ్‌ సెంచరీ మార్కు అందుకున్న ఇంగ్లండ్‌.. స్కోరు: 51/0. డకెట్‌ 21, క్రాలే 29 పరుగులతో ఆడుతున్నారు.
12 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ స్కోరు: 43/0

నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్‌..
ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలే(11), డక్కెట్‌(8) నిలకడగా ఆడుతున్నారు.  7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌: 20/0

4 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 9/0
4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో డక్కెట్‌, జాక్‌ క్రాలే(7) ఉన్నారు.

ధర్మశాల వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌  ఎంచుకుంది.  ఈ మ్యాచ్‌తో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రజిత్‌ పాటిదార్‌ స్ధానంలో పడిక్కల్‌కు చోటు దక్కింది. అదే విధంగా జస్ప్రీత్‌ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆకాష్‌ దీప్‌ ప్లేస్‌లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు.

ఇంగ్లండ్‌ సైతం ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్‌ రాబిన్సన్‌ స్ధానంలో మార్క్‌ వుడ్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కింది. ఇక భారత స్పిన్‌ లెజండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో సైతం తన వందో టెస్టులో బరిలోకి దిగాడు.

తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

Advertisement
Advertisement