ఓటరు వయసు | Sakshi
Sakshi News home page

ఓటరు వయసు

Published Tue, May 14 2024 3:55 AM

ఓటరు

మూడేళ్లు తగ్గిన

అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి

నాగర్‌కర్నూల్‌ క్రైం: సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపు తథ్యమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తుండటంతో బీఆర్‌ఎస్‌ నాయకులు అసత్య ప్రచారాలకు తెర లేపారన్నారు. తాను రూ. 250 కోట్లకు అమ్ముడుపోయినట్లు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో పాటు సోషల్‌ మీడియా ఇన్‌చార్జి అభిలాష్‌రావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలో ఓటేయాలంటే కనీస వయసు 24 ఏళ్లు ఉండేది. ప్రస్తుతం 18 ఏళ్లకే యువతీ యువకులు ఓటువేసే అవకాశం వచ్చింది. 1952 మొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి 1988 వరకు ఓటువేసే వయసు 21 ఏళ్లు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 828కి మార్పులు చేసి, ఓటరు వయసు 18 ఏళ్లకు తగ్గించారు. దీంతో తొలిసారిగా తొమ్మిదో లోక్‌సభ ఎన్నికల్లో 18 ఏళ్ల వయసు ఉన్న యువతీ యువకులు ఓటుహక్కు వినియోగించుకున్నా రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నారు.

ఓటరు వయసు
1/3

ఓటరు వయసు

ఓటరు వయసు
2/3

ఓటరు వయసు

ఓటరు వయసు
3/3

ఓటరు వయసు

Advertisement
 
Advertisement
 
Advertisement