IT Raids: మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. మంత్రి సబిత బంధువుల ఇళ్లలో తనిఖీలు!

Published Mon, Nov 13 2023 7:19 AM

IT Official Raids In Hydearabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ నగరంలోని ఫార్మా కంపెనీలకు చెందిన ఛైర్మన్‌, సీఈవో, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. 

అలాగే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. గచ్చిబౌలిలోని మై హోం బూజాలో ఉంటున్న  ప్రదీప్ అనే వ్యక్తి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement