Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ ఊహించని షాకిచ్చింది. చెపాక్‌ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

    48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. పంజాబ్‌ బౌలర్లలో పంజాబ్ బౌలర్లలో హార్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహ‌ర్ త‌లా రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్‌, ర‌బాడ త‌లా వికెట్ సాధించారు.

    బెయిర్‌ స్టో, రోసౌ విధ్వంసం..
    163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. పంజాబ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో, ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు రుసౌ విధ్వంసం సృష్టించారు. 

    బెయిర్‌ స్టో 46 పరుగులు చేయగా.. రుసౌ 43 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు కెప్టెన్‌ సామ్‌ కుర్రాన్‌(27), శశాంక్‌ సింగ్‌(25) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. సీఎస్‌కే బౌలర్లలో శివమ్‌ దూబే,శార్ధూల్‌ ఠాకూర్‌, గ్లీసన్‌ తలా వికెట్‌ సాధించారు.
     

  • ఐపీఎల్‌-2024లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్ త‌న అద్భుత ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో రుతురాజ్ మెరిశాడు. 

    48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిన‌ రుతురాజ్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు. 

    ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన సీఎస్‌కే కెప్టెన్‌గా గైక్వాడ్ రికార్డుల‌కెక్కాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడి 509 ప‌రుగులు చేసిన గైక్వాడ్.. ఈ అరుదైన ఫీట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు సీఎస్‌కే లెజెండ్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. 

    ఐపీఎల్‌-2013లో 461 ప‌రుగులు చేశాడు. తాజా సీజ‌న్‌తో ధోని ఆల్‌టైమ్ రికార్డును గైక్వాడ్ బ్రేక్ చేశాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కూడా రుతురాజ్(509) కొన‌సాగుతున్నాడు. రెండో స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(500) ప‌రుగుల‌తో ఉన్నాడు.
     

  • ఐపీఎల్‌-2024లో భాగంగా చెపాక్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయింది. సీఎస్‌కే బ్యాట‌ర్లు కాస్త త‌డ‌బ‌డ్డారు. 

    తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 

    ఓ వైపు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టినప్పటికి రుతురాజ్ మాత్రం ఆచితూచి ఆడి తన జట్టుకు మెరుగైన స్కోర్‌ను అందిచాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. రుతురాజ్‌తో పాటు ధోని 14 పరుగులతో రాణించాడు.

    పంజాబ్ బౌలర్లలో హార్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహ‌ర్ త‌లా రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్‌, ర‌బాడ త‌లా వికెట్ సాధించారు.
     

  • ఐపీఎల్‌-2024లో చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే తొలిసారి నిరాశ‌పరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా  చెపాక్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో శివ‌మ్ దూబే గోల్డ‌న్ డ‌క్‌గా వెనుదిరిగాడు. ర‌హానే ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన దూబే.. త‌ను ఎదుర్కొన్న‌ తొలి బంతికే ఔట‌య్యాడు. 

    స్పిన్‌ను అద్బుతంగా ఆడే దూబే..  లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ హార్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔట్ కావ‌డం గ‌మ‌నార్హం. 9వ ఓవ‌ర్ వేసిన హార్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో దూబే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

    కాగా ఐపీఎల్‌లో దూబే గోల్డ‌న్ డ‌క్‌గా వెనుదిరిగ‌డం ఇదే మొద‌టి సారి. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో దూబే అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగానే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 భార‌త జ‌ట్టులో దూబేకు చోటు ద‌క్కింది. 

    అయితే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ప్ర‌క‌టించిన త‌ర్వాత రోజే దూబే డ‌కౌట్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడిన దూబే.. 171.57    స్ట్రైక్ రేటుతో 350 ప‌రుగులు చేశాడు.

  • ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ రిచర్డ్‌ గ్లీసన్‌ అరుదైన ఘనత సాధించాడు. 2014 తర్వాత ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రెండో అత్యంత పెద్ద వయస్కుడిగా గ్లీసన్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ పైగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున డెబ్యూ చేసిన గ్లీసన్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. 

    గ్లీసన్‌ 36 ఏళ్ల 151 రోజుల వయస్సులో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు. ఈ జాబితాలో తొలి స్ధానంలో జింబాబ్వే ఆటగాడు సికిందర్‌ రజా ఉన్నాడు. రజా 36 ఏళ్ల 342 రోజుల వయస్సులో పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఐపీఎల్‌ డెబ్యూ చేశాడు.

    ఇక ఐపీఎల్‌-2024కు దూరమైన డెవాన్‌ కాన్వే స్ధానాన్ని గ్లీసన్‌తో సీఎస్‌కే భర్తీ చేసింది. ఈ ఏడాది సీజన్‌ ఫస్ట్‌హాఫ్‌ ముగిశాక గ్లీసన్‌ సీఎస్‌కే జట్టుతో చేరాడు. ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌కు మతీషా పతిరానా దూరం కావడంతో గ్లీసన్‌కు సీఎస్‌కే తుది జట్టులో ఛాన్స్‌ దక్కింది. 

    ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సీఎస్‌కే 76 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    తుది జట్లు
    పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(కెప్టెన్‌), రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్‌), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

    చెన్నై సూపర్ కింగ్స్: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్‌), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహమాన్
     

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును నేపాల్ క్రికెట్ ఆసోషియేష‌న్ బుధవారం ప్ర‌కటించ‌నుంది. ఈ టోర్నీలో నేపాల్ జ‌ట్టుకు రోహిత్ పాడెల్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. 

    ఎటువంటి అంచనాలకు తావనివ్వకుండా అందరూ ఊహించిన జట్టునే నేపాల్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఇటీవల ఒమన్‌ వేదికగా జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు నేపాల్‌ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కింది. 

    కాగా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు నేపాల్‌ అర్హత సాధించడం ఇది రెండో సారి. అంతకుముందు బంగ్లాదేశ్‌లో జరిగిన 2014 టీ20 ప్రపంచకప్‌లో నేపాల్‌ తొలిసారి ఆడింది. ఇక నేపాల్ వరల్డ్‌కప్‌ జట్టులో సోంపాల్ కమీ,  దీపేంద్ర సింగ్ ఐరీ, కరణ్ కెసి వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.

    కాగా ఇటీవల నేపాల్ జట్టు అద్బుతమైన ప్రదర్శలను కనబరిస్తోంది. నేపాల్ ప్రస్తుతం సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది.

    ఇ​క ఈ మెగా ఈవెంట్‌ కోసం ఇప్పటికే భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఒమన్‌ క్రికెట్‌ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్‌ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 

    నేపాల్‌ వరల్డ్‌కప్‌ జట్టు
    రోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.

  • ఐపీఎల్‌-2024లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి స‌మ‌యం అసన్న‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. 

    పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్ధానంలో ఉన్న పంజాబ్‌కు ఈ మ్యాచ్ చాలా కీల‌కం. పంజాబ్ ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌నిసారిగా గెవాల్సిందే. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. 

    స్టార్ పేస‌ర్లు  మతీషా పతిరానా, తుషార్ దేశ్‌పాండే దూర‌మ‌య్యారు. వారిద్ద‌రి స్ధానంలో శార్ధూల్ ఠాకూర్‌, గ్లీస‌న్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు. మ‌రోవైపు పంజాబ్ కింగ్స్ ఎటువంటి మార్ప‌లు లేకుండా బ‌రిలోకి దిగంది.

    తుది జట్లు
    పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(కెప్టెన్‌), రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్‌), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

    చెన్నై సూపర్ కింగ్స్: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్‌), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహమాన్

  • టీ20 వరల్డ్‌కప్‌-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఒమన్ క్రికెట్‌ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్‌ అకిబ్‌ ఇలియాస్‌ సారథ్యం వహించనున్నాడు.  ఇప్పటివరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జీషన్ మక్సూద్‌పై వేటు వేసిన ఒమన్ క్రికెట్‌.. ఆ బాధ్యతలను ఇలియాస్‌ అప్పగించింది. 

    ఇలియస్‌ గత కొంత కాలంగా ఒమన్‌ క్రికెట్‌ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఏసీసీ ప్రీమియర్ కప్‌లో అదరగొట్టిన ఆటగాళ్లకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టులో బిలాల్ ఖాన్, కలీముల్లా, జీషన్ మక్సూద్ వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు.

    అయితే మరో సీనియర్‌ ఆటగాడు జతీందర్ సింగ్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. జతీందర్ సింగ్‌కు రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో చోటుక్కింది.  ఇ​క ఈ మెగా ఈవెంట్‌ కోసం ఇప్పటికే భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్‌ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 

    తుది జట్లు
    అకిబ్ ఇలియాస్ (కెప్టెన్‌), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే (వికెట్‌ కీపర్‌), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మొహమ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ (వికెట్‌ కీపర్‌), మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్.

    రిజర్వ్‌లు: జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా
     

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు.

    అయితే ఈ జ‌ట్టు ఎంపికపై భిన్న‌భిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌, న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్‌ల‌ను ఎంపిక చేయ‌కపోవ‌డాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు త‌ప్పుబడుతున్నారు. 

    ఈ మెగా ఈవెంట్‌కు కేఎల్ రాహుల్‌ను పూర్తిగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని సెల‌క్ట‌ర్లు.. రింకూను మాత్రం స్టాండ్ బైగా ఎంపిక చేశారు.  ఈ క్ర‌మంలో రింకూకు ప్ర‌ధాన జ‌ట్టులో చోటు ఇవ్వ‌కపోవ‌డాన్ని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా వ్య‌తిరేకించాడు. 

    రింకూ సింగ్ లాంటి ప‌వ‌ర్ హిట్ట‌ర్‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డం సెల‌క్ట‌ర్లు తీసుకున్న చెత్త నిర్ణ‌య‌మ‌ని శ్రీకాంత్ మండిప‌డ్డాడు.'రింకూ సింగ్ ఏం త‌ప్పు చేశాడు. సెల‌క్ట‌ర్ల నిర్ణ‌యం న‌న్ను షాక్‌కు గురిచేసింది.

    ప్ర‌స్తుతం ఇదే విష‌యం గురించి ప్రపంచవ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు. త‌ను ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ త‌ర‌పున ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ స‌త్తాచాటాడు. అత‌డు గ‌తంలో ద‌క్షిణాణ‌ఫ్రికాతో సిరీస్‌లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు.

    అటువంటి అద్భుత ఆట‌గాడిని ఎందుకు వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేయ‌లేదు? అత‌డి బదులు జైశ్వాల్‌ను ప‌క్క‌న పెట్టాల్సింది. నా వ‌ర‌కు అయితే రింకూ సింగ్ క‌చ్చితంగా వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో ఉండాల్సిందే. 

    అస్స‌లు న‌లుగురు స్పిన్న‌ర్ల‌ను ఎంపిక చేయాల్సిన అవ‌స‌రం ఏముంది? కొంతమందిని సంతోషపెట్టడానికి రింకూ సింగ్‌ను బ‌లి ప‌శువు చేశారని' త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో శ్రీకాంత్ పేర్కొన్నాడు.

    భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
    రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్‌ సిరాజ్.
     

  • టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం టీమిండియాను నిన్న (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే మెజార్టీ శాతం​ ఎంపికలు జరిగినప్పటికీ.. రింకూ సింగ్‌ లాంటి టాలెంటెడ్‌ ఆటగాడిపై శీతకన్ను చూపడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సెలెక్టర్లు రింకూను ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ఆటగాడిగా ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారు. 

    రింకూ సింగ్‌కు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కకపోవడంపై చాలామంది మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రింకూ లాంటి మ్యాచ్‌ ఫినిషర్‌ను వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేయనందుకు సెలెక్టర్లను నిందించారు. ఈ క్రమంలో రింకూ సింగ్‌ తండ్రి  ఖన్‌చంద్ర సింగ్‌ స్పందించాడు.

     ఓ స్థానిక న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ ఇలా అన్నాడు. రింకూ వరల్డ్‌కప్‌ జట్టులో ఉంటాడని మాకు పూర్తి నమ్మకం ఉండింది. సంబురాలు చేసుకునేందుకు స్వీట్లు, టపాసులు కూడా తెచ్చుకున్నాం. రింకూ వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికవడమే కాకుండా తుది జట్టులో కూడా ఉంటాడని ఊహించాం. 

    మా దురదృష్టం కొద్ది అలా జరగలేదు. రింకూ గుండె పగిలిపోయినంత పనైపోయింది. రింకూ ఈ విషయంలో తన తల్లికి చాలా సర్దిచెప్పాడు. 15 మందిలో లేనపోయినా జట్టుతో పాటు వెళ్తానని ఆమెతో చెప్పాడు. కాగా, 26 ఏళ్ల రింకూ టీమిండియా తరఫున 15 టీ20ల్లో 176.2 స్ట్రయిక​్‌రేట్‌తో 89 సగటున 356 పరుగులు చేశాడు. ఇం​దులో 2 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

    టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా

    ట్రావెలింగ్‌ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

  • టీ20 వరల్డ్‌కప్‌ 2024 ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం​ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టోర్నీ విజేతపై క్రికెట్‌ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు తమతమ అంచనాలను, అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పలానా జట్టు జగజ్జేతగా నిలుస్తుందని కొందరంటుంటే.. ఈ ఈ జట్లు సెమీస్‌కు చేరతాయని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. 

    ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ కూడా చాలామంది వ్యాఖ్యాతల లాగే వరల్డ్‌కప్‌పై తన అంచనాలను వెల్లడించాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు ఈసారి సెమీఫైనల్స్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఈసారి ఫైనల్‌ ఫోర్‌కు చేరడం కష్టమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. 

    వాన్‌ చెప్పిన జోస్యంపై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. వాన్‌కు టీమిండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని కొట్టిపారేస్తున్నారు. టీమిండియా లాంటి పటిష్టమైన జట్టు ఏ ప్రాతిపదిన సెమీస్‌కు చేరదో విశ్లేషించాలని సూచిస్తున్నారు. 

    వరల్డ్‌కప్‌లో పాల్గొనే టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని.. సెమీస్‌కు కాదు, ఈసారి ఏకంగా టైటిలే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాపై అవాక్కులు చవాక్కులు పేలడం అలవాటుగా మార్చుకున్న వాన్‌కు తగు రీతిలో చురకలంటిస్తున్నారు. 

    వాస్తవానికి ఈసారి వరల్డ్‌కప్‌ సెమీఫైనలిస్ట్‌లకు అంచనా వేయడం చాలా కష్టం. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వరల్డ్‌కప్‌లో టఫ్‌ ఫైట్‌ నెలకొంది. అన్ని జట్లు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా, అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. దీంతో ఏ జట్టు  సెమీఫైనల్‌కు చేరుతుందో చెప్పడం చాలా కష్టం. వాన్‌ లాంటి అనుభజ్ఞులైన వ్యాఖ్యాతలు అశాస్త్రియమైన అంచనాలు వేసి క్రికెట్‌ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు.

    ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ కోసం న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, భారత్‌, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లను ఇదివరకే ప్రకటించారు. జట్ల ప్రకటనకు ఇవాళే ఆఖరి తేదీ (మే 1) కావడంతో మరికొన్ని గంటల్లో అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించవచ్చు. 

    పాకిస్తాన్‌, ఐర్లాండ్‌, కెనడా, యూఎస్‌ఏ, నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌, ఉగాండ, వెస్టిండీస్‌, పపువా న్యూ గినియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌ దేశాలు తమ వరల్డ్‌కప్‌ జట్లు ప్రకటించాల్సి ఉంది. యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ వేదికగా జూన్‌ 1 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.

National

  • కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ తండ్రి, కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ నిరంజన్‌ హిరేమఠతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో నేహా హీరేమఠ మరణం విషయంలో వారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

    ఈ సందర్భంగా నిరంజన్‌ హిరేమఠ మాట్లాడుతూ తనని కలిసేందుకు వచ్చిన అమిత్‌షాకు తన కుమార్తె నేహా హీరేమత్‌ మరణంపై న్యాయం చేయాలని కోరుతూ  మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు.

    ఇలాంటి కేసుల్లో ఉరిశిక్ష ఉండేలా చూడాలని, ఇలాంటి కేసులను 90 నుంచి 120 రోజుల్లో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అమిత్‌ షాకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. నిరంజన్‌ హిరేమఠ విజ్ఞప్తితో నేహా మరణంపై తగిన న్యాయం చేస్తామని అమిత్‌ షా ఇచ్చినట్లు నేహా హిరేమఠ తండ్రి నిరంజన్‌ హిరేమఠ వెల్లడించారు

  • భువనేశ్వర్‌: విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా  వడగళ్ల వాన వల్ల దెబ్బతింది. విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.  ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.

    భువనేశ్వర్‌తోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌ నుంచి  ఢిల్లీ విమానం టేకాఫ్‌ అయిన కేవలం పది నిమిషాల్లో తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానంలో ప్రయాణిస్తున్న  ఉన్న 169 మంది ప్రయాణికులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

    వడగళ్ల వాన వల్ల విస్తారా విమానం దెబ్బతిన్నట్లు బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. వడగళ్ల వల్ల విమానం విండ్‌షీల్డ్‌ పగుళ్లిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. విమానంలోని 169 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.

  • బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హసన్‌ సెక్స్‌ వీడియోల వివాదంపై ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటికిరాగానే ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి రేవణ్ణ తాజాగా సోషల్‌ మీడియాలో ఒక లేఖ పోస్టు చేశారు.

    సెక్స్‌ స్కాండల్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్‌ ముందు వారం రోజుల్లో హాజరవుతానని తెలిపారు. నిజమే గెలుస్తుందన్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగానే మరుసటి రోజు ఏప్రిల్‌ 27న ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే రేవణ్ణ సెక్స్‌ వీడియోలు హసన్‌ ప్రాంతంలో వైరల్‌ అయ్యాయి.

    ప్రజ్వల్‌ లోక్‌సభ ఎన్నికల్లో హసన్‌ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనే హసన్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. 2019 నుంచి 2022 వరకు హసన్‌, బెంగళూరుల్లోని ప్రజ్వల్‌ రేవణ్ణ ఇళ్లలో పలువురు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలున్న పెన్‌డ్రైవ్‌ బయటికి రావడంతో సెక్స్‌ స్కాండల్‌ వెలుగులోకి వచ్చింది. 

  • ముంబై: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి  వద్ద కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్‌ లాకప్‌లో ఉన్న నిందితుడు అనుజ్‌ థాపన్‌.. బుధవారం  ఉదయం 11 గంటలకు లాకప్‌ గదిలో వాష్‌రూమ్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అధికారులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పంజాబ్‌కు చెందిన అనూజ్‌ను ఏప్రిల్‌ 26న పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    కాగా గత నెల 14న సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ ముందు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్‌ అయ్యాయి.

    ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీస్‌ క్రైం బ్రాంచ్‌ అధికారులు.. నిందితులు, విక్కీ గుప్తా, సాగర్ పాల్‌గా గుర్తించారు. వీరితోపాటు నిందితులకు ఆయుధాలు అందించిన అనుజ్ థాపన్, సుభాష్‌ చందర్‌లను కూడా  కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ఒకడైన అనూజ్‌ తపన్‌ బుధవారం బలవనర్మణానికి పాల్పడ్డాడు.

    అయితే అనుజ్‌తోపాటు మరో పదిమంది అదే లాకప్‌లో ఉన్నారని, నలుగురు నుంచి అయిదుగురు పోలీసులు నిత్యం వీరిని గమనిస్తూ ఉంటారని అధికారులు పేర్కొన్నారు. నిందితుడి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోందనిప్పారు

    లాకప్‌లో వ్యక్తి మరణిస్తే హత్య కేసుగా పరిగణిస్తారని, పోలీస్ స్టేషన్‌లోని పోలీసులందరినీ సీఐడీ ప్రశ్నిస్తుందని అని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీసు అధికారి పీకే  జైన్‌ చెప్పారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించే ఏ వస్తువు అందుబాటులో ఉండకుండా పోలీసులు ఎల్లప్పుడూ తనిఖీ చేస్తుంటారని పేర్కొన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు లాకప్‌ వద్ద నిత్యం గస్తీ కాస్తుంటారని చెప్పారు. ఇదిలా ఉండగా నలుగురు నిందితులు జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు  తెలిసింది.

  • బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో సస్పెండైన జేడీఎస్‌ ఎంపీ రేవణ్ణ జర్మనీ నుంచి త్వరలో ఇండియా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 3-4 తేదీల మధ్య రేవణ్ణ బెంగళూరుకు చేరుకోవచ్చని కర్ణాటక పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

    లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నోటీసులు ఇవ్వడంతో ప్రజ్వల్‌ భారత్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రజ్వల్‌ తండ్రి ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణకు కూడా సిట్‌ నోటీసులు ఇచ్చింది. 

    కాగా, ప్రజ్వల్‌ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు గత వారం హసన్‌ ప్రాంతంలో వైరల్‌ అయ్యాయి. మొత్తం 2,976 వీడియోలున్న పెన్‌డ్రైవ్‌ బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

    ఈ వీడియోలన్నీ 2019-2022 మధ్య బెంగళూరు, హసన్‌లలోని రేవణ్ణ నివాసాలలో చిత్రీకరించినవనిప్రాథమికంగా తేలింది. తనపై ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్‌ల కిందపోలీసులు కేసు నమోదు చేశారు.

    లైంగిక వేధింపుల వీడియోలు వెలుగు చూసి వివాదం పెద్దదైన నేపథ్యంలో రేవణ్ణ ఏప్రిల్‌ 27న బెంగళూరు నుంచి జర్మనీ వెళ్లిపోయాడు. కాగా, రేవణ్ణ జేడీఎస్‌ తరపున హసన్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్‌ 26న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 

Movies

  •  అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేశ్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌ ఆడియన్స్‌ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాకు సంబంధించి అల్లరి నరేశ్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మళ్లీ కామెడీ వైపు మళ్లడంపై ఆయన స్పందించారు.  

    నరేశ్ మాట్లాడుతూ..'అన్నీ సమాంతరంగా చేయాలనే అలోచనతోనే ఉన్నా. నాంది, మారేడుమిల్లి, ఉగ్రం, నా సామిరంగా భిన్నమైన సినిమాలు. కామెడీ కథలు బాగా నచ్చితేనే చేయాలని భావించా. ప్రేక్షుకుల అభిరుచి కూడా మారింది. కథలో కామెడీ ఉంటేనే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లి ఇలాంటి కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. పెళ్లిని ఇప్పటివరకూ ఫన్‌తో చూపించారు. పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల వ్యాపారంను వినోదాత్మకంగా చూపిస్తూనే మంచి సందేశం వుంటుంది. నిజజీవితంలో జరిగిన చాలా సంఘటనలని పరిశోధించే ఈ కథని తయారు చేశారు. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులని ఆలోచింపచేసేలా ఉంటుంది' అన్నారు. 
     

    చాలా రోజుల తర్వాత కామెడీ సినిమా చేయడంపై మాట్లాడుతూ..' కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం. మళ్లీ కామెడీ చేయడం చాలా హ్యాపీగా వుంది. కామెడీకి ఆదరణ ఇంకా పెరిగింది. సామజవరగమన, డీజే టిల్లు లాంటి సినిమాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నా దృష్టి నటనపైనే. దర్శకత్వం చేసే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. అందరూ సుడిగాడు- 2 కోసం అడుగుతున్నారు. మనం అన్ని రకాల సినిమాలు చేయాలి.  ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి కథలపై దృష్టి పెడుతున్నా. అలాగే 'పుష్పక విమానం' లాంటి సినిమా చేయాలని ఉంది. వెంకటేశ్‌తో కలిసి పని చేయాలని ఉంది. మేమిద్దరం కామెడీ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ స్క్రీన్‌ షేర్ చేసుకోవాలని ఉంది' అని తెలిపారు. కాగా.. ఆ ఒక్కటీ అడక్కు మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. 

  • టాలీవుడ్ డైరెక్టర్‌ సుకుమార్‌, త‌బితా సుకుమార్ దంప‌తుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్త‌మ‌బాల న‌టిగా దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం వ‌రించింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన గాంధీ తాత చెట్టు చిత్రంలో ఉత్త‌మ‌న‌ట‌న‌కు ఈ అవార్డును అంద‌జేశారు. ఢీల్లిలో జ‌రిగిన అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును ఆమెకు అంద‌జేశారు. ప్ర‌స్తుతం ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ హైద‌రాబాద్‌లో గ్రేడ్-8 అభ్య‌సిస్తున్న సుకృతి వేణి బండ్రెడ్డి   న‌టించిన ఈ చిత్రం గ‌తంలో కూడా  ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శించారు.

    ఈ చిత్రంలో సుకృతి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లతో పాటు ప‌లు అవార్డుల‌ను గెలుచుకుంది. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, ఇండియ‌న్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఉత్త‌మ తొలి సినిమా బాల‌న‌టిగా సుకృతి వేణికి అవార్డులు వ‌రించాయి. 11వ నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఉత్త‌మ చిత్రంగా.. న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జూరీ బెస్ట్ ఫిలింగా.. ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకుంది. జైపూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌తో పాటు 8వ ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవ‌డం విశేషం.

    ఇవి కాకుండా ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ నుండి ఈ చిత్రానికి ఆహ్వానాలు అందుతున్నాయి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ముఖ్య ఉద్దేశంగా తెర‌కెక్కిన ఈ సందేశాత్మ‌క చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్,  సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి.  న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, శేష సింధు రావులు నిర్మాత‌లుగా వ్యవహరించారు. ప‌ద్మావ‌తి మ‌ల్లాది  ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి త‌బితా సుకుమార్ స‌మ‌ర్ప‌కురాలిగా వ్యవహరించారు. 
     

  • టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగువారికి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. లైగర్ తర్వాత ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. ఇప్పటికే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పూరి మ్యూజింగ్స్‌ పేరుతో వాయిస్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌తో వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ..'జీవితంలో చాలామంది ప్రేమలో ఫెయిల్ చూస్తారు. తిండి, నిద్ర ఉండదు. గుండెల్లో తెలియని మంట. దానికితోడు మద్యానికి బానిస అవుతాం. స్నేహితులు ఎంత ఓదార్చినా తీరని బాధ. కన్నీళ్లు ధారలుగా కారుతుంటాయి. అదొ రకమైన నరకం. నా ప్రేమను అమ్మాయి అర్థం చేసుకోలేదని కుంగిపోతాం. నిజానికి అదంతా ప్రేమ కాదు.. ఈగో.. నీకు ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తావు. ఇది నిజం. నీకు దక్కలేదన్న ఉక్రోశమది. పాపం ఆ అబ్బాయి నీ గురించి తాగుబోతు అ‍య్యాడే అని అందరూ తనకు చెప్పాలి. అది నీ అసలు ఉద్దేశం' అని అన్నారు.

    మీ అమ్మ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎప్పుడైనా అమ్మ కోసం కత్తిపెట్టి చేయి కోసుకున్నావా? ఏడ్చావా? లేదు. మన ప్రేమలన్నీ శృంగారం కోసమే. అందమైన అమ్మాయిలనే ఎందుకు ప్రేమిస్తావ్. కాళ్లు, చేతులు లేని వాళ్లను కూడా ప్రేమించొచ్చు కదా? నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే.. ఆమె డెసిషన్‌కు రెస్పెక్ట్‌ ఇచ్చేవాడివి. ప్రేమలో ఉన్నప్పుడు నీకోసం పుట్టిన దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి దొరక్కపోతే చనిపోవాలనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే నిన్నే పెళ్లి చేసుకుంటే రెండేళ్లు కూడా సరిగా కాపురం చేయలేవు. మోజు తీరిపోద్ది. మళ్లీ కొత్త కోరికలు మొదలవుతాయి. వేరే అమ్మాయిలు కావాలి. ఎంజెల్స్‌ అందరినీ మగాళ్లు పెళ్లి తర్వాత డోర్ మ్యాట్స్‌లా తయారు చేస్తారు.  సైన్స్‌ ప్రకారం ఆడ, మగ మధ్య ఎట్రాక్షన్‌ 18 నెలలు మాత్రమే' అని

    లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లందరూ  ప్రామిస్‌ చేయగలరా? వేరే ఏ అమ్మాయిని చూడమని? చేయలేరు. ప్రేమించడం, ఇంట్లో వద్దంటే గొడవ పడడం.. అమ్మాయి కాదంటే దేవదాసులా మారడాలు.. ఇవన్నీ డ్రామాలు. మనం ఈ డ్రామాలనే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తాం. లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిలను ఎక్కడైనా చూశారా?. వాళ్లు ఎప్పుడూ ఏడుస్తూ ఉండరు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. మరీ మీకెందుకు ఇంత ఓవరాక్షన్. వాళ్లను చూసి బుద్ది తెచ్చుకో. లవ్ ఫెయిల్‌ అవడం ఎప్పుడూ మంచిదే. దానివల్ల మీరు మరింత స్ట్రాంగ్‌ అవుతారు. కానీ ప్రేమించమని ఏడుస్తూ.. బతిమిలాడుతూ.. అడుక్కుంటూ బెగ్గర్స్‌లా తయారవుతాం. రోజు ఇంత ఏడుస్తున్నావు కదా.. ఏడాది తర్వాత అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుందని' వివరించారు.

    నిజంగా అమ్మాయి మోసం చేస్తే.. ఆ బాధను మీ కెరీర్ కోసం వాడండి. ప్రేమ కంటే గొప్పది ఒంటరితనం. ఒంటరిగా తినండి, ప్రయాణాలు చేయండి. కొన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటారు. మీ లవ్‌ ఫెయిల్యూర్‌ మీద మీరే జోకులు వేసుకుంటారు. లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న ఎంజెలినా జోలి లాంటి సెలబ్రిటీలే విడాకులు తీసుకున్నారు. వాళ్లతో పోలిస్తే.. నువ్వు ఎంత? నీ ప్రేమ ఎంత? దయచేసి ఆలోచించు. నిన్ను నమ్ముకొని మీ కుటుంబం ఉంది' అని పూరి జగన్నాథ్‌ సలహాలిచ్చారు. 

  • కోలీవుడ్‌లో తెరకెక్కించిన సినిమాలు హిట్‌ అయితే ఇతర భాషల్లోనూ డబ్బింగ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు.  తాజాగా మరో కోలీవుడ్‌ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ టాలీవుడ్  సిద్ధమయ్యారు. త‌మిళ మూవీ యతిసై తెలుగు డ‌బ్బింగ్ వర్ష‌న్ మే 10న థియేట‌ర్ల‌లో సందడి చేయనుంది. ఈ హిస్టారిక‌ల్ గ‌తేడాదిలోనే ఓటీటీలో రిలీజైంది. ఇప్పటికే తమిళంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా యతిసై తెలుగు, హిందీ రిలీజ్ డేట్స్‌ను సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది.

    ఈ సందర్భంగా తెలుగు, హిందీ భాష‌ల‌కు సంబంధించి టీజ‌ర్స్‌ రిలీజ్ చేశారు. యుద్ధ స‌న్నివేశాలు, పాండ్య రాజుల‌ను ఎదురించి అస‌మాన పోరాటం చేసిన ఓ తెగ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గ‌తేడాది ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లై రూ.20 కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ఓటీటీలో రిలీజైన ఏడాది త‌ర్వాత తెలుగులో థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలుగుతో పాటు హిందీలో ఒకే రోజు థియేట‌ర్ల‌లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా.. ఈ సినిమాకు ధ‌ర‌ణి రాసేంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు

    మొదట టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ రిలీజైన త‌ర్వాత కోలీవుడ్ వ‌ర్గాల యాతిసై మూవీని బాహుబ‌లితో పోల్చారు. కానీ ఈ సినిమా బాహుబ‌లికి ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. ఏడు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ 20 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టింది


     

  • ‘ప్రసన్న వదనం’ ఫస్ట్‌ కాపీ నిన్ననే చూశాను. సినిమా  థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు.ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది’ అన్నారు హీరో సుహాస్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రసన్న వదనం’.  స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

    ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. హీరో సుహాస్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి’ అని కోరారు.

     ‘ఇది యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్ రోమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని అన్నారు దర్శకుడు అర్జున్‌. ‘ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా అందరిని అలరిస్తుంది’ అన్నారు హీరోయిన్‌ రాశిసింగ్‌. ‘ ఈ సినిమా పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.అందరూ థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం’ అని నిర్మాతలు ప్రసాద్‌ రెడ్డి, జెస్‌ మణికంఠ అన్నారు.  
     

  • బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. గతంలో గంగూభాయి కతియావాడి మూవీతో సూపర్  హిట్‌ కొట్టిన ఆయన మరోసారి అలాంటి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడం మరో విశేషం.

    ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మే 1వ తేదీ నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్‌ ఇదివరకే వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వర్షన్లతో పాటు 14 భాషల్లో హీరామండి సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‍లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావు హైదరి, సంజీదా షేక్, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 
    పోషించారు.

    కాగా.. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలోని 1940 మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరామండిని తెరెకెక్కించారు. పాకిస్తాన్‌లోని  రెడ్‍లైట్‍ ప్రాంతంలో జరిగే సంఘర్షణ, కుట్రల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. హీరామండి ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటనలను ఈ సిరీస్‌లో చూపించారు. కాగా.. హీరామండి ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‍లోని లాహోర్‌లో ఉంది.


     

  • హీరో నవీన్‌ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఆయనను వరించింది. ఈ ఏడాది  దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. "మంత్ ఆఫ్ మధు" సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది.  భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్  పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.

    ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, నవీన్ చంద్ర టాలెంట్‌కు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి గుర్తింపు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆల్రెడీ ఒక స్టార్ అయిన నవీన్ చంద్ర.. 2011లో "అందాల రాక్షసి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కంటెంట్‌లో బలం ఉన్న కథలనే ఎంచుకుంటూ, తెలుగు సినిమా ఫీల్డ్‌ని ఏలారు. ప్రస్తుతం "గేమ్ ఛేంజర్" వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ఇన్స్పెక్టర్ రుషి" వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌ని కూడా షేక్ చేస్తున్నారు
     

  • ఐకాన్‌ స్టార్‌ అల్లు  అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చేసింది. పుష్ప-2 మూవీ నుంచి 'నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే' అంటూ సాగే ఫస్ట్‌ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌ పుష్ప-2 చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. సుకుమార్‌- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

    గతనెల బన్నీ బర్త్‌ డే సందర్భంగా టీజర్‌ విడుదల చేసిన మేకర్స్‌.. మరో అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పుష్ప-2 ఫస్ట్‌ సింగిల్‌ను ఏకంగా ఆరుభాషల్లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్‌ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం మేకర్స్ పంచుకున్నారు. సరికొత్త లుక్‌లో బన్నీ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్‌గా నిలిచిన సంగతె తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2ను తీసుకొస్తున్నారు. ఈ మూవీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. 
     

  • స్టార్‌ హీరో షారుక్ ఖాన్ గతేడాది జవాన్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకున్నారు. కోలీవుడ్ స్టార్‌ అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీలో నటించారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. షారుక్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.

    ఇదిలా ఉండగా.. షారుక్ గతంలో డాన్, డాన్‌-2 చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో అతను పనికి మేకర్స్ భారీ నష్టం వాటిల్లిందని కింగ్‌ ఖాన్ సహానటుడు  అలీ ఖాన్  వెల్లడించారు. ఇటీవల  ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ ఖాన్‌.. షారుక్‌  కారును ఎలా క్రాష్ చేశాడో గుర్తు చేసుకున్నారు. అతను చేసిన పని వల్ల మేకర్స్‌కు రూ. 2.6 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు.

    అలీ ఖాన్ మాట్లాడుతూ..' బెర్లిన్‌లో ఛేజ్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నాం. షారుక్ ఎడమవైపు.. నేను కుడివైపు ఉన్నా.. ఫర్హాన్ అక్తర్ షాట్‌లో కనిపించకుండా వెనుక సీట్లో దాక్కున్నాడు. ప్రియాంక చోప్రా పాల్గొన్న ఈ కారు ఛేజింగ్ సీక్వెన్స్‌లో క్రాష్ జరిగింది. షారుక్ కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది. బానెట్‌పై లైట్లు, రెండు పెద్ద కెమెరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 2.6 కోట్లు. ఈ ఘటనలో అవన్నీ ధ్వంసమయ్యాయి. అదృష్టం కొద్ది మా అందరికీ ఎలాంటి గాయాలు కాలేదని' అన్నారు. కాగా.. డాన్ -2 మూవీ 2011లో విడుదలైంది. ఇటీవలే రణవీర్ సింగ్, కియారా అద్వానీతో డాన్ -3 తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్‌  ఫర్హాన్ అక్తర్ ప్రకటించారు.

  • ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తోంది. అయితే ఇవాళ మేడే సందర్భంగా మెగాస్టార్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది.

    సరిగ్గా 22 ఏళ్ల క్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసిన వీడియోను పోస్ట్‌ చేశారు. పసి పిల్లలను పనివాళ్లుగా చేయొద్దని ఆ వీడియోను రూపొందించారు. ఇవాళ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో మెగాస్టార్‌ వీడియోను పంచుకున్నారు. ఈ రోజుకీ సంబంధించిన వీడియో కావడంతో షేర్ చేస్తున్నాను అంటూ మెగాస్టార్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. సే నో టూ చైల్డ్ లేబర్‌.. హ్యాపీ మే డే టూ ఆల్‌ అంటూ పోస్ట్ చేశారు.
     

  • ఎన్టీఆర్‌ ఇప్పుడు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్‌కి గ్యాప్‌ ఇచ్చి, ‘వార్‌ 2’సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ అంతా ముంబైలోనే జరుగుతుండడంతో.. ఖాలీ సమయంలో తన స్నేహితులను కలుస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు.

     తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ హీరో అనుపమ్‌  ఖేర్‌ కలిశాడు తారక్‌. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోని అనుపమ్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ.. ‘నా ఫేవరేట్ పర్సన్. యాక్టర్ ఎన్టీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని వర్క్  నాకు చాలా ఇష్టం. అతను జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ రాసుకొచ్చారు. 

    ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘‘వార్‌ 2’లో అనుపమ్‌ నటిస్తున్నారా?’, ప్రశాంత్‌ నీల్‌-ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో అనుపమ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారా ఏంటి? అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

     

Politics

  • కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్‌ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌లో బుధవారం(మే1) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగించారు. తొలి రెండు దశల పోలింగ్‌ ముగిసినపుడు ఒకటి ప్రకటించి తర్వాత ఏకంగా 5.75 శాతం పోలింగ్‌ పెరిగిందని ఎన్నికల కమిషన్‌(ఈసీ) ప్రకటించడమేంటని ప్రశ్నించారు. 

    బెంగాల్‌లో జేపీకి ప్రతికూలంగా ఉన్న చోట్లలోనే పోలింగ్‌ శాతం పెరిగిందని చెప్పారు. పోలింగ్‌ శాతం ఒక్కసారిగా పెరగడంతో ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.

    పశ్చిమబెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్‌లకు ఓటు వేయొద్దని మమత పిలుపునిచ్చారు.  ఆ రెండు పార్టీలు బీజేపీ ఏజెంట్‌లేనన్నారు. టీఎంసీ ఓట్లు చీల్చి బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండపపడ్డారు.   
     

  • హైదరాబాద్‌,సాక్షి : పార్లమెంట్ ఎన్నికల తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.  గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దీపా దాస్ మున్షీ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

     

  • సాక్షి,హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)ను బీఆర్‌ఎస్‌ నేతలు కోరారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డిపై సీఈవోకు బీఆర్‌ఎస్‌ నేతలు బుధవారం(మే1) ఫిర్యాదు చేశారు.  

    ప్రతిపక్షనేత బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా పవర్ కట్ ఘటనను ఉదాహరిస్తూ రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. కాగా, కాం గ్రెస్‌ ఫిర్యాదుతో ఈసీ కేసీఆర్‌పై ఇప్పటికే చర్య తీసుకుంది. 48 గంటల పాటు ప్రచారాన్ని ఆపాలని ఆదేశించింది.

  • హైదారబాద్‌,సాక్షి : ఎలక్షన్ కమిషన్ నోటీసులపై కేసీఆర్‌ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదని అన్నారు. స్థానిక భాషను అధికారులు అర్థం చేసుకోకుండా పై అధికారులకు నివేదికలు ఇచ్చినట్లు అర్థమవుతుందని తెలిపారు.

    ‘కాంగ్రెస్ నేతలు నేను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే ఎంపిక చేసి ఫిర్యాదులో పేర్కొన్నారు. నేను కాంగ్రెస్‌ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించాను. కానీ నా మాటల్ని కాంగ్రెస్‌ నేతలు ట్విస్ట్‌ చేశారు’ అని కేసీఆర్‌ తెలిపారు.

    ఇదెక్కడి అరాచకం?
    కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇదెక్కడి అరాచకం? ఏకంగా కేసీఆర్‌ గొంతుపైనే నిషేధమా? మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? రేవంత్‌ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? బడే భాయ్‌.. చోటే భాయ్‌ కలిసి చేసిన కుట్ర కాదా ఇది! అంటూ ట్వీట్‌ చేశారు.

     

  • కోల్‌కతా: పార్టీ ప్రధాన కార్యదర్శి కునాల్‌ఘోష్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) షాక్‌ ఇచ్చింది. ఆ పదవి నుంచి ఘోష్‌ను తప్పిస్తూ పార్టీ హైకమాండ్‌  బుధవారం(మే1) ఆదేశాలు జారీ చేసింది.

    ఇంతకుముందే ఘోష్‌ను అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించిన పార్టీ హైకమాండ్‌ తాజాగా ఆయనను ప్రధాన కార్యదర్శి పదవిని కూడా తొలగించింది. ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన తపస్‌రాయ్‌పై ఘోష్‌ బుధవారం బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు. 

    తపస్‌రాయ్‌ పార్టీ మారడం సరైందేనని, తమ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్సే సరైన దిశలో వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తృణమూల్‌ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఘోష్‌ పదవి కోల్పోవాల్సి వచ్చింది.  

  • సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో కూటమి నేతలు కొట్లాటకు దిగారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. కోట్ల సూర్యప్రకాశ్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. చంద్రబాబు వచ్చి సర్ది చెప్పి పోయినా సొంత  క్యాడర్‌ సహకరించలేదు.

    తాజాగా ప్యాపిలి మండలం పెద్దపూదెళ్లలో  తెలుగు తమ్ముళ్లు దారుణంగా తన్నుకున్నారు. 'కోట్ల' ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాన్వాయ్ ఎవరెక్కాలనేదానిపై ఘర్షణ మొదలైంది.రాళ్లదాడులు, పిడిగుద్దులతో  రెండు వర్గాలు విరుచుకుపడ్డాయి. సమన్వయం పాటించాలని కోట్ల సూర్యప్రకాశ్ కోరినా తెలుగు తమ్ముళ్లు లెక్కచేయలేదు. ‘కోట్ల’ చెప్పినా ఓ వర్గం మరింత రెచ్చిపోయి రాళ్లు రువ్వి దాడులకు దిగింది.

    ముందే ప్లాన్ చేసి టీడీపీలోని ఓ వర్గం దాడికి పురిగొల్పినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు డోన్ బహిరంగ సభలో పదే పదే సుబ్బారెడ్డి పేరు పలకడంపైనా ఓ వర్గం తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'కోట్ల' కన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంపై కోట్ల వర్గం కూడా అసంతృప్తితో ఉంది.

    టీడీపీకి వలసలుగా వెళ్లిన వారు కూడా ఎందుకొచ్చాం రా బాబూ అనుకునేలా కూటమిలో పరిస్థితి నెలకొంది. తమ్ముళ్ల బాహాబాహీతో తెలుగుదేశం బండారం బయటపడింది.

     

  • హైదరాబాద్‌, సాక్షి : మాజీ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంది. సిరిసిల్లలో గత నెలలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్‌  తమపై, తమ పార్టీపై  అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.

    ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు(బుధవారం) రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది.  నిషేధ సమయంలో ఎలాంటి రోడ్‌షోలు, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఈసీ తన  ఆదేశాల్లో పేర్కొంది.

  • సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒకరి చేతిలోని రిమోట్‌లాగా జగన్ వ్యవహరిస్తారా? ఆ సంగతి మీకు తెలీదా? అంటూ దుయ్యబట్టారు.

    చంద్రబాబు జేబు బొమ్మలులాగా షర్మిల, సునీత మాట్లాడుతున్నారు. వ్యక్తిగతమైన ఎజెండాతో షర్మిల మాట్లాడుతున్నారు. అవినాష్‌రెడ్డికి సీటు ఇస్తే ఇంత విషం చిమ్మాలా?. వైఎస్సార్‌సీపీ ఓటు చీల్చటమే పనిగా షర్మిల పెట్టుకున్నారు. ఆమె టార్గెట్ వెనుక చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోల్ షర్మిల’’ అంటూ వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.

    ‘‘ఎన్నో కోట్లమంది ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు. జగన్‌కి చెల్లెళ్లు అనే హోదా తప్ప షర్మిల, సునీతలకు ఈ రాష్ట్రంలో ఏముంది?. వారు మాట్లాడేవన్నీ ఎల్లో మీడియా హైలెట్ చేస్తోంది. వారం తర్వాత ఎల్లోమీడియా మీ ముఖాలను టీవీలో చూపించదు. ఆ సంగతి గుర్తు పెట్టుకోండి. ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఎల్లోమీడియా అసలు పట్టించుకోదు.షర్మిల, సునీత చూపుతున్న ఉన్మాదం వలన వారికే నష్టం’’ అని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

    వైఎస్సార్‌కుటుంబం ఎటుపోయినా పర్లేదు అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. వివేకా పరువు నడిరోడ్డు మీద పెట్టారు. షర్మిలకి మెదడు పని చేస్తుందా?. కాంగ్రెస్ పార్టీ తప్పు లేదని ఇప్పుడు షర్మిల అనటం వెనుక కారణం ఏంటి?. వైఎస్సార్ పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారనే బాధతో లాయర్ సుధాకర్ రెడ్డి కేసు వేశారు. ఆ కేసులో వైఎస్సార్ పేరు ప్రస్తావన ఉందా?. అవినాష్‌కి సీటు ఇస్తే షర్మిలకు ఎందుకు అంత కోపం?. మీరు చెప్పినట్టు జగన్ వినలేదని చంద్రబాబు జేబులో బొమ్మలుగా మారుతారా?. జగన్ చెల్లెల్లు కాకపోతే అసలు షర్మిల, సునీతలను ఎవరు పట్టించుకుంటారు?’’ అని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: రిజర్వేషన్లు రద్దు చేయడం ఆర్‌ఆర్‌ఎస్‌ మూల సిద్దాంతం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల రద్దుపై చర్చ జరగకుండా తమపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రిజర్వేషన్ల పై బీజేపీ పెద్దలు తమ వైఖరిని ఎందుకు స్పష్టం చేయడం లేదంటూ ప్రశ్నించారు.

    ‘‘2024 ఎన్నికల్లో బీజేపీ రహస్య ఎజెండా అమలు చేస్తుంది. ఎన్నికల్లో నెగ్గడానికి మాపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఢిల్లీ సుల్తానులకు తెలంగాణ భయపడదు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే వారి అజెండా.2000 సంవత్సరం ఫిబ్రవరి లో రాజ్యంగం మార్పు కు బీజేపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కమిషన్ ఏర్పాటు చేసింది’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.
     

  • సాక్షి, ఏలూరు: బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జగన్‌కు ఓటేస్తే.. సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ఆగిపోతాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కావు.. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నవని పేర్కొన్నారు. ఇది కులాల మధ్య యుద్దం కాదు.. క్లాస్‌ వార్‌ అని తెలిపారు. ఈ యుద్ధంలో ఓ వైపు పేదలు ఉంటే మరోవైపు పెత్తందార్లు ఉన్నారని అన్నారు.

    ఏలూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. సీఎం జగన్‌ ప్రచార సభకు ప్రజాభిమానం పోటెత్తింది. జై జగన్‌ నినాదాలతో ఏలూరు మార్పోగిపోయింది. ఈ సందర్భంగా సభకు హాజరైన జనసమూహాన్ని ఉద్ధేశిస్తూ సీఎం మాట్లాడారు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు.. అయిదేళ్ల భవిష్యత్త్‌ను నిర్ణయిస్తాయని చెప్పారు.. మంచి చేసిన జగన్‌ పేదల పక్షాన ఉన్నాడని తెలిపారు. పేదల పక్షాన ఉన్న జగన్‌ను చూసి బాబుకు కోపమొస్తుందని దుయ్యబట్టారు. తాను పేదల గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు కోపం వస్తుందని మండిపడ్డారు.

    సీఎం జగన్‌ ప్రసంగం..

    • మన రాష్ట్రంలో దాదాపు 90 శాతం తెల్ల రేషన్‌కార్డు దారులే.

    • కోటి 44  లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.

    • వీళ్లందరికీ పథకాలు అందాలంటే మీ జగన్‌కు తోడుగా ఉండాలి.

    • కోటి 5 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్నారు.

    • పొదుపు సంఘాల మహిళలు పేదలు కాదా, వారికి పథకాలు అందొద్దా?

     

    పేదలకు పథకాలు అందాలా లేదా?

    • పిల్లల చదవుుల కోసం అమ్మ ఒడి తీసుకొచ్చి ప్రోత్సహించాం.

    • 93 శాతం మంది పిల్లలకు విద్యాదీవెనచ వసతి దీవెన అందుతోంది.

    • ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం.

    • అక్కాచెల్లెమ్మల కోసం అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ.

    • మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ తీసుకొచ్చాం.

    • అక్కాచెల్లెమ్మలకు 50శాతం నామినేటెడ్‌ పదవులిచ్చాం.

    • అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం.

    • పెట్టుబడి సాయంతో రైతన్నకు అండగా నిలబడ్డాం.

    • వాహన మిత్రతో ఆటోడ్రైవర్లకు తోడుగా ఉన్నాం.

    వాలంటీర్‌ వ్యవస్థతో పౌరసేవలు

    • గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు.
    • గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చాం.
    • నాడు, నేడుతో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చాం.
    • సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం.
    • పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం.
    • రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం.
    • 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.
    • 200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం


    2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?
     

    • రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
    • పొదుపు సంఘాల రుణాలురద్దు చేస్తానన్నాడు.. చేశాడా?
    • ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు..చేశాడా?
    • ఇంటికోఉద్యోగం అన్నాడు ఇచ్చాడా?
    • ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
    • అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
    • సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?
    • ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?
    • ఇప్పుడు మళ్లీ కొత్త మోసాలతో వస్తున్నాడు.. నమ్ముతారా?
    • కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తానంటాడు.. నమ్ముతారా?
    • ఇలాంటి మోసగాళ్లు నమ్మొద్దు.. జాగ్రత్తగా ఉండండి
    • వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండి.
    • పేదల భవిష్యత్‌ కోసం ఫ్యాన్‌ గుర్తు ఓటేయండి.
  • అల్లూరి,సాక్షి: వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే విపక్షాల కుట్రగా కనిపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల కూడా ఈ చీఫ్‌ ట్రిక్స్‌లో భాగం అయ్యారు. తాజాగా ఆమె ఆడియో క్లిప్‌ బయటకు రావడంతో  ఆ కుట్ర బయటకు వచ్చింది.

    అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున బుల్లిబాబు పోటీ చేస్తున్నాడు. అయితే ఈయన అభ్యర్థిత్వం కంటే ముందు ఇక్కడ రేసులో ఉంది వంతల సుబ్బారావు. బుల్లిబాబు వైఎస్సార్‌సీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. చేరి చేరగానే బుల్లిబాబునే పాడేరు అభ్యర్థిగా షర్మిల ప్రకటించారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న సుబ్బారావు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

    కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలకే కాకుండా.. ఓటు బ్యాంకు ఏనాడో కనుమరుగైన కాంగ్రెస్‌లోనూ రెబల్స్‌ పోటు ఆసక్తికర చర్చకు దారి తీసింది. దీంతో వంతల సుబ్బారావుతో రాయబారానికి దిగారు.  మీరు సొంత అన్నమాదిరి అని, అర్థం చేసుకోవాలని, తర్వాతిసారి చూద్దాం అంటూ బతిమాలాడారామె. 

    అయితే.. ఏనాడూ జెండా మోయనోడికి టికెట్‌ ఇవ్వడం తనను బాధించిందని, పైగా తనతో మాట కూడా చెప్పకుండా వేల మంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ప్రకటించడం తనను నిరాశ పర్చిందని షర్మిలతో ఆయన అన్నారు.

    కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో పాటు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వంతల సుబ్బారావుకు స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్‌ గురించి మరిచిపోవాలంటూ బెదిరింపు స్వరంతో కోరారామె. చివర్లో.. కాంగ్రెస్‌కు డ్యామేజ్‌ చేయొద్దంటూ షర్మిల కోరగా.. తన భవిష్యత్తు ఆల్రెడీ డ్యామేజ్‌ అయ్యిందని ఆయన బదులిచ్చారు.

  • లక్నో: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వివాదంపై సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో ప్రజలకు గుండె సంబంధిత సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని సైంటిస్టులు తేల్చితే దీనికి బాధ్యులెవరని అఖిలేశ్‌ ప్రశ్నించారు. సామాన్య ప్రజల జీవితాలను కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని మండిపడ్డారు. 

    ఈ విషయమై బుధవారం(మే1) అఖిలేశ్‌ ఇటావాలో మాట్లాడారు. వ్యాక్సిన్‌ల విషయంలో బీజేపీ పెద్ద నేరం చేసిందన్నారు.  ఇది  ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడం కంటే పెద్ద నేరమన్నారు. ‘‘ఏక్‌ మే ఔర్‌ బీజేపీ గయ్‌’’ అని ఎద్దేవా చేశారు.

    మరోవైపు ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా కొవిషీల్డ్‌ వివాదంపై స్పందించారు. ఒకపక్క కొవిషీల్డ్‌తో ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా కేంద్రం ఇంకా వ్యాక్సిన్‌ వేసుకోవాలని చెప్పడమేంటన్నారు. యువత గుండె జబ్బులతో కుప్పకూలడానికి వ్యాక్సిన్‌కు లింక్‌ ఉందన్న ప్రచారం జరుగుతోందని చెప్పారు. 

    కాగా, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్న మాట వాస్తవమేనని వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన యూకే కంపెనీ ఆస్ట్రాజెనెకా ఒప్పుకోవడంతో వివాదం రేగింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో 90 శాతం మంది కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌నే తీసుకోడం గమనార్హం.  

     — ANI (@ANI) May 1, 2024

  • లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌ సుల్తాన్‌ పుర్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి మేనకా గాంధీ నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి క్రితికా జోత్నకు నామినేషన్‌ ప్రతాలు అందించారు. నామినేషన్‌ దాఖలు సమయంలో ఎన్‌డీఏ కూటమి పార్టీలు నిషాద్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ నిషాద్‌, అప్నాదల్‌ నేత, కేబినెట్‌ మంత్రి అశిష్‌ పటేల్‌లు ఆమె వెంట ఉన్నారు.

    నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం మేనకా గాంధీ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల చేసిన అభివృద్ది కంటే వచ్చే ఐదేళ్లలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడి ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మరిన్ని ఇళ్లను అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.

    ప్రతిపక్షాల ఆరోపణలపై
    బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ప్రతిపక్షాల ఆరోపణలపై మేనకా గాంధీ ఖండించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో బీజేపీ నుంచి తన కుమారుడు వరుణ్‌ గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.

    వరుణ్‌ గాంధీకి నో టికెట్‌
    వరుణ్‌ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పిలిభిత్‌ లోక్‌సభ టికెట్‌ను బీజేపీ నిరాకరించింది. జితిన్‌ ప్రసాదకు అప్పగించింది.

    2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్‌పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. 

  • పంజాబ్‌ కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే దల్వీందర్‌ సింగ్‌ గోల్డీ ఆమ్‌ ఆద్మీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

    దల్వీందర్‌ కాంగ్రెస్‌ నుంచి సంగ్రూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం దల్వీందర్‌ సింగ్‌కు సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ స్థానానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్‌పాల్ సింగ్‌ ఖైరా పేరును కాంగ్రెస్ ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో పంజాబ్‌ ఆప్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దల్వీందర్‌ సింగ్‌ పార్టీ చేరికపై భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ.. నా తమ్మడు, కష్టపని చేసే యువకుడు గోల్డీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. గోల్డీ రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ధురీ స్థానం నుంచి భగవంత్‌ మాన్‌పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గోల్డీ పరాజయం పాలయ్యారు. ఆప్‌లో చేరిన అనంతరం పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించాని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు.  
     
    పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌కు రాసిన రాజీనామా లేఖలో గోల్డీ, రాష్ట్ర నాయకత్వం పట్ల విసుగు చెంది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
     

  • మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం కూటమిని ముందుగానే క్లీన్ బౌల్ చేసేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు బీజేపీతో కలిసి అట్టహాసంగా విడుదల చేయాలని అనుకున్న మేనిఫెస్టో విడుదల తుస్సు మంది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆ మానిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడక పోవడమే. ఇది జగన్ కొట్టిన దెబ్బే కదా!

    ఆయన గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో 2014 శాసనసభ ఎన్నికల సమయంలో ఈ మూడు పార్టీలు కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో గురించి, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీల ఫోటోలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు చూపుతూ అందులో ఇచ్చిన  వాగ్దానాల అమలు తీరు గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో ఇది విస్తృతంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ఈ ముగ్గురు మళ్లీ జనం ముందుకు వస్తున్నారని అంటూ అందులో ఉన్న అంశాలను చదివి వినిపించి ప్రజలతో సమాధానాలు ఇప్పిస్తున్నారు. అది ఈ మూడు  పార్టీలకు బాగా డ్యామేజీగా మారింది. వాటిలో ఒక్కదానికి కూడా చంద్రబాబు నాయుడు సమధానం ఇవ్వలేకపోతున్నారు. అంతేకాక తన సభలలోకాని, తన ఎన్నికల ప్రణాళిక విడుదలలో కాని జగన్ ఒక మాట చెబుతున్నారు.

    2019లో తాను ఇచ్చిన మానిఫెస్టోని, అమలు ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు ఇస్తూ, 2024లో తాను చేయబోయే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు.  పాతవాటిని కొనసాగిస్తూ,కొత్తవి పెద్దగా ఇవ్వకుండా  చాలా జాగ్రత్తగా మేనిఫెస్టోని రూపొందించి దానికి అయ్యే వ్యయాన్ని వివరిస్తున్నారు. అలాగే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పేరుతో ప్రచారం చేసిన వాగ్దానాలకు అయ్యే ఖర్చును లెక్కేసి చెబుతున్నారు. వాటి ప్రకారం చూస్తే చంద్రబాబుది పూర్తిగా ఆచరణసాధ్యం కాని మేనిఫెస్టో అని తేలిపోతుంది. ఈ పరిస్థితిలోనే తమ పరువు చంద్రబాబు చేతిలో మరింతగా  పోగొట్టుకోవడం ఇష్టం లేక ప్రధాని మోదీ వంటి బీజేపీ నేతలు తమ పేర్లు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టవద్దని చెప్పారట.  

    బీజేపీ పెద్దలు  ఈ మేనిఫెస్టోకి దూరం అయితే, పవన్ కల్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి చంద్రబాబు ఏమి చెబితే దానికి ఊగొట్టే స్థితిలో ఉన్నారు.  చంద్రబాబు తన పాత మేనిఫెస్టో ఊసుకాని, జగన్ అమలు చేసిన మేనిఫెస్టో సంగతులు కాని చెప్పకుండా ఆకాశమే హద్దుగా కొత్త హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తన సభలలో మళ్లీ ఈ ముగ్గురూ  చంద్రబాబు, పవన్,మోదీ మళ్ళీ జనాన్ని మోసం చేయడానికి వస్తున్నారని,  ఇంటింటికి బెంజ్ కారు ఇస్తామంటున్నారని, కిలో బంగారం ఇస్తామని చెబుతున్నారని నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది బాగా క్యాచీ డైలాగుగా మారడంతో బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది.

    చంద్రబాబు ఇచ్చే తప్పుడు  వాగ్దానాలకు తాము కూడా బాధ్యులవుతున్నామని, ఏ రాష్ట్రంలో లేని  విధంగా ఏపీలో చంద్రబాబు వల్ల అప్రతిష్టపాలు అవుతున్నామని అనుకున్నారేమో  కాని, కనీసం మోదీ , జేపీ నడ్డా, అమిత్ షా ,దగ్గుబాటి పురందేశ్వరి వంటి ఏ ఒక్క నేత ఫోటో మానిఫెస్టో పై వేయలేదు. టీడీపీ,జనసేనల రెండు  పార్టీల మేనిఫెస్టోగానే ప్రకటించవలసి వచ్చింది. కాకపోతే బతిమలాడి బీజేపీ ఇన్ చార్జీ సిద్దార్ద్  నాధ్ సింగ్ ను తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయనేమో మేనిఫెస్టో కాపీ పట్టుకోకుండా తిరస్కరించారు. పురందేశ్వరిని ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ నిలువరించినట్లుగా ఉంది.లేకుంటే ఇంత ముఖ్యమైన  కార్యక్రమానికి రాకుండా ఉంటారా?  దీంతో మొత్తం ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన సందర్భం కాస్తా తుస్సు అంది.  

    ఇదంతా జగన్ ఎఫెక్ట్ అన్న అభిప్రాయం కలుగుతుంది.చంద్రబాబు ఇచ్చిన హామీల విలువ సుమారు 1.65 లక్షల కోట్ల విలువ అని ఒక అంచనా. అదే జగన్ ఇచ్చిన హామీల వ్యయం రూ. 70 వేల కోట్లు. ఇంతకాలం జగన్ బటన్ నొక్కుడుతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు యు టర్న్ తీసుకుని ఇంకా తాము ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అప్పట్లో జగన్ పై అడ్డగోలుగా రాసిన రామోజీ,రాధాకృష్ణలు, ప్రస్తుతం చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై విశ్లేషించడానికే భయపడుతున్నారు. ఇంత మొత్తం డబ్బు ఎక్కడనుంచి వస్తుందని అడిగితే చంద్రబాబు కు ఇబ్బందిగా ఉంటుందని  భావించి వారు దానికి జోలికి పోవడం లేదు.  కానీ పేజీల కొద్ది ఆ వాగ్దానాలను పరిచి తాము టీడీపీ పక్కా ఏజెంట్లమని ప్రజలకు మరోసారి తెలియచేశారు.

    తెలంగాణ, కర్నాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలతో పాటు ఏపీలో జగన్ అమలు చేస్తున్న స్కీముల్ని కాపీ కొట్టి కొంత అదనంగా ఇస్తామని చంద్రబాబు  చెప్పారు.  కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేక సతమతం అవుతున్నాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు చేసినా..  దానివల్ల ఆర్టీసీకి పెద్ద నష్టమే వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఎంత శ్రద్ద చూపుతుందన్నది అనుమానమే. ఈ పరిస్థితిలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కూడా కష్టమే అవుతుంది.

    చంద్రబాబు ఇచ్చిన కొన్ని హామీలను చూద్దాం. వాటికి అయ్యే వ్యయం ఎంతో లెక్కగడదాం.

    ఉదాహరణకు ఏపీలో 19-59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో రెండున్నర  కోట్ల మంది మహిళలు ఉన్నారనుకుంటే.. అందులో కోటి మంది 19 ఏళ్లలోపు వారు, 59 ఏళ్ల పైబడిన వారిని తీసివేస్తే దాదాపు కోటిన్నర మందికి ఈ  స్కీం అమలు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.2,250 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అంటే ఏడాదికి 27వేల కోట్ల రూపాయల ఖర్చు అన్నమాట.

    నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు. వారి సంఖ్య ఎంతో చెప్పలేదు. పోని ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు కనుక,ఆ సంఖ్యనే ఆధారంగా తీసుకుంటే నెలకు రూ.600 కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 7,200 కోట్లు అన్నమాట.

    రైతులకు రైతు భరోసా కింద జగన్ ప్రభుత్వం 13 వేల  రూపాయలు ఇస్తోంది. దానిని 16 వేలు చేశారు. కాని చంద్రబాబు ఏకంగా ఇరవైవేలు ఇస్తామని అంటున్నారు.  ఆ ప్రకారం ఏడాదికి రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. పోనీ ఇందులో సగం కేంద్రం వాటా అనుకున్నా, ఐదువేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఖర్చు పెట్టాలి.

    అమ్మ ఒడి కింద ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున జగన్ ప్రభుత్వం ఇస్తోంది. దానిని 17వేలకు పెంచుతామని జగన్ తెలిపారు. చంద్రబాబు గతంలో తన ప్రభుత్వంలో ఈ స్కీమును  అమలు చేయకపోయినా, ఇప్పుడు ఇంటిలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి 15వేల రూపాయలు ఇస్తానంటున్నారు. ఇద్దరు పిల్లలనే లెక్కవేసుకుంటే పదిహేనువేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది.

    వృద్దాప్య పెన్షన్ లను నెలకు నాలుగువేలు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు ఈ స్కీం అర్హతకు వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తామని టీడీపీ  చెబుతోంది. ప్రస్తుతం ఉన్న 65లక్షల మంది పేదలకు వీరు తోడవుతారు. దీని ప్రకారం నెలకు రూ.2,600 కోట్లు వ్యయం అవుతుంది.అంటే సంవత్సరానికి రూ.31 వేల కోట్లు అన్నమాట.

    ల్యాండ్‌ టైటిలింగ్ చట్టంపై మళ్లీ అబద్దాలు ఆడారు. ఇది కేంద్ర ప్రతిపాదిత చట్టం అని పలువురు చెబుతున్నా వినకుండా చంద్రబాబు ఇదే ప్రచారం చేస్తున్నారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంత పాడుతున్నాయి. గతంలో పురందేశ్వరి  పొత్తు రాకముందు, టీడీపీ ఈ చట్టంపై చేస్తున్నది దుష్ప్రచారం అని స్పష్టంగా చెప్పారు. నిజంగానే  జగన్ ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ చట్టం తెచ్చి ఉంటే,  కేంద్రానికి లేఖ రాసి వివరణ కోరవచ్చు కదా!. ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆస్తులను  లాక్కోవడానికి చట్టాలు చేస్తుందా? ఈ చట్టం ద్వారా ప్రజలకు  మరింత సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం అన్ని రాష్రాల కోసం  దీనిని ప్రతిపాదిస్తే, అంతతటిని జగన్ కు ఆపాదించి, నానా చెత్త ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే మోదీ ఉఏపీలో ఆస్తులను లాక్కోవడానికి ఈ చట్టం తెచ్చారని చంద్రబాబు అనాలి. ఒకప్పుడు తాను గొప్ప సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్న  చంద్రబాబు నిజ స్వరూపం ఇది . కేంద్రాన్ని దీనిపై అడగకపోతేమానే.. సిద్దార్ద్ సింగ్ ,పురందేశ్వరిలలో ఎవరో ఒకరితో ఈ చట్టం గురించి మాట్లాడించి ఉండవచ్చు కదా! ఆయన అదేమీ చేయలేదంటే దాని అర్దం బీజేపీ ఇలాంటి పిచ్చి ఆరోపణలను పట్టించుకోదనే కదా! ఏదో మొక్కుబడికి  సిద్దార్ద్ నాద్ సింగ్ కూటమి మేనిఫెస్టోకి మద్దతు అని చెప్పారు. అది నిజమే అయితే ఎందుకు మోదీ ఫొటో ఈసారి వేయవద్దని ఎందుకు  చెప్పారో వివరణ ఇవ్వాలి కదా!

    చంద్రబాబు చేసిన అన్ని హామీలను అమలు చేస్తే అసాధ్యం కనుకే, మరోసారి నవ్వుల పాలు కాకుండా ఉండడానికి మోదీ తన ఫొటో ప్రచురించడానికి ఇష్టపడలేదని అనుకోవాలి. అందుకే జగన్ తన స్పీచ్ లలో ఢిల్లీ పెద్దలు, బీజేపీ వారు కూడా చంద్రబాబును నమ్మడం లేదని తేల్చేశారు. బీజేపీతో కలిశాం కనుక ప్రత్యేక హోదా,విభజన హామీలు, తెలంగాణ నుంచి రావల్సిన బకాయిలు, ఆస్తుల విభజన సాధిస్తామని ఒక్క మాట చెప్పకుండా ఎన్నికల ప్రణాళికను పూర్తి చేశారు. అంటే వాటి ఊసే టీడీపీ ఎత్తొద్దని బీజేపీ కండిషన్ పెట్టినట్లే కదా! ఏ రకంగా చూసినా, ఇది ప్రజల మేనిఫెస్టో కాదు. కేవలం అధికారం కోసం చంద్రబాబు ఆడే రాజకీయ నాటకపు మోసఫెస్టో తప్ప ఇంకొకటి కాదని ఘంటాపధంగా చెప్పవచ్చు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏపీ మేలు కోరుకునేవారు ఎవరూ అంగీకరించకూడదు కూడా.

    విద్య రంగంలో అమలు లో ఉన్న సిలబస్ ను రివ్యూ చేస్తారట. అంటే దాని అర్ధం ఇప్పుడు ఉన్న ఇంగ్లీష్ మీడియం ను రద్దు చేస్తామని చెప్పడమా?. అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఇస్తున్న ఐబీ సిలబస్ ను ఎత్తివేస్తారా?. విద్యార్ధులకు టాబ్ లు వంటి వాటిని ఇవ్వడం ఆపివేస్తారా? మళ్లీ ప్రైవేటు స్కూళ్లకే పేదలు వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారా? .. 

    .. ముస్లిం రిజర్వేషన్ లను కొనసాగిస్తారా?లేదా? బీజేపీ స్పష్టంగా రిజర్వేషన్ లు రద్దు చేస్తామని చెబుతుంటే.. దానిని చంద్రబాబు గట్టిగా ఖండించలేక పోతున్నారు. NDA కూటమి ఎజెండాలో ఇది ముఖ్యమైనదిగా ఉంది. దానిపై బీజేపీవాళ్లతో ఎందుకు మాట్లాడించడం లేదు.పోనీ తాను బీజేపీని ఎదిరించి రిజర్వేషన్ లను కొనసాగిస్తానని కూడా ప్రణాళికలో హామీ ఇవ్వలేదు.177 రకాల హామీలు ఇవ్వడం ద్వారా అన్ని వర్గాల వారి ఆదరణ చూరగొనాలన్నది చంద్రబాబు ఆలోచన. కాని అన్ని వర్గాల వారు టీడీపీ మేనిఫెస్టోని చూస్తే, పూర్తిగా వ్యతిరేకిస్తారు.  ఇంతకాలం ఈ పాయింట్ మీద జగన్‌ను వ్యతిరేకించేవారు.. ఇప్పుడు జగనే బెటర్ అనే పొజిషన్‌కు చంద్రబాబు తీసుకొచ్చారు.

    ఇలా.. కూటమి మేనిఫెస్టో వాగ్దానాలను గమనిస్తే, ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఇచ్చేశారు. వీటిని అమలు చేయడానికి రెండు,మూడు రాష్ట్రాల బడ్జెట్ లు కూడా సరిపోవు. అంటే ఈ స్కీములను ఎగవేయడం తప్ప మరో దారి ఉండదు. లేదంటే ఈ స్కీము లబ్దిదారులలో జాబితాలో కోత పెట్టి వ్యయం అంచనాను బాగా తగ్గించుకోవాలి.దీనిపై లబ్దిదారులంతా మండిపడతారు. ఏ రకంగా చూసినా చంద్రబాబు మోసం చేసినట్లే అవుతుంది.


    :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

  • విశాఖపట్నం, సాక్షి: భీమిలి నియోజకవర్గంలో జనసేన నాయకులకు ఘోర అవమానం జరిగింది. టీడీపీ ప్రచార రథంపై నుంచి జనసేన నేతలను బలవంతంగా గెంటేశారు. టీడీపీ ప్రచార రథంపై జనసేన జెండాలు లేకుండా చేశారు. టీడీపీ నేతలు చేసిన అవమానాన్ని తలుచుకొని జనసేన నేతలు రగిలిపోతున్నారు.

    ప్రచారానికి పిలిచి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా టీడీపీ నాయకులు తమను అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. జరిగిన అవమానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు జనసేన నేతలు సిద్ధమవుతున్నారు.

  • అనకాపల్లి జిల్లా, సాక్షి: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జగన్‌ ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ.. భూములు తీసుకునే వాడు కాదు. భూములపై సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌.. భూములపై సమగ్ర సర్వే చేయించి.. వారికే హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు.

    అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా?
    అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా?. మీ భూముల మీద మీకు సర్వహక్కులూ కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశ్యం. 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. ఆ తర్వాత సర్వే జరగలేదు. గ్రామ సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదు. ఆ సర్వే లేక భూములన్నీ సబ్‌ డివిజన్‌ జరక్క, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోడానికి కొనుక్కోడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టు తిరుగుతూ, డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.  ఈ పరిస్థితి మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించాం’’ అని సీఎం వివరించారు.

    వాళ్ల భూముల మీద సర్వ హక్కులూ వాళ్లకి ఇవ్వడానికి బౌండరీస్ నాటించి, రికార్డులన్నీ అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ రైతులకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి’’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

    చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే..
    ‘‘పేదలకు, బాబు మోసాలకు మధ్య జరిగే యుద్ధం ఇది. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది, విలువలకు, విశ్వసనీయతకు ఓటేయడానికి మీరంతా సిద్ధమేనా?. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే. ఎన్నికల్లో మీరు వేసే ఓటే పేదల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక పాలన చేయడంతో చంద్రబాబుకు మన మీద పిచ్చి కోపం వస్తోంది. మీ జగన్‌ మంచి చేశాడని చంద్రబాబుకు కోపమొస్తుంది’’ అని సీఎం జగన్‌  ధ్వజమెత్తారు

    ‘‘అవ్వాతాతలకు  ఇంటివద్దే పెన్షన్‌ ఇవ్వడం విప్లవం అవునా?కాదా?. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం విప్లవాత్మక మార్పు. ఉన్నత చదువుల కోసం విద్యాదీవెన, వసతి  దీవెన.. పిల్లలను బడులకు పంపే తల్లులకు అమ్మఒడి పథకం.. అక్కా చెల్లెమ్మల కోసం ఆసరా, చేయూత, సున్నావడ్డీ.. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌.. మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

    ‘‘రైతన్నకు తోడుగా పెట్టుబడి సాయం విప్లవాత్మక మార్పు. పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ విప్లవాత్మక మార్పు. సకాలంలోనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ విలేజ్‌ క్లినిక్‌ విప్లవాత్మక మార్పు. ఫ్యామిలీ డాక్టర్‌ విప్లవాత్మక మార్పు. పేషెంట్‌ విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం విప్లవాత్మక సాయం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు. వాలంటీర్‌ వ్యవస్థతో పౌర సేవలందిస్తున్నాం’’ అని  సీఎం చెప్పారు

    ‘‘రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేయడం ఓ విప్లవం. అబద్ధాలు, మోసాలకు చంద్రబాబు రెక్కలు కడుతున్నాడు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. పేదల పక్షాన మీ బిడ్డ జగన్‌ నిలబడ్డాడు. చంద్రబాబు పక్షాన దత్తపుత్రుడు, ఎల్లో మీడియా, కుట్రలు..  చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో పెన్షన్‌ను అడ్డుకున్నాడు. 14 ఏళ్లలో బాబు ఏనాడూ అవ్వాతాతలను పట్టించుకోలేదు’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

    మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్‌..వంచనతో బాబు.. మంచితో జగన్‌ ఎన్నికలకు వెళ్తున్నాం. జగన్‌కు ఓటేస్తే.. సంక్షేమ పథకాలు కొనసాగింపు..బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపే.బాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబు వంచన చేస్తే.. మీ జగన్‌ మంచి చేశాడు’’ అని సీఎం పేర్కొన్నారు.
     

     

     

     

     

     

     

  • సాక్షి, జగిత్యాల: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశాన్ని అదానీ, అంబానీ, కార్పొరేట్‌ శక్తులకు అమ్ముతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్‌ రెడ్డి. మోదీ హయాంలో దళితులు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. బీసీ జనగణన చేసి, వారికి న్యాయం చేస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. అందుకే 400 సీట్లు కావాలని బీజేపీ అడుగుతోందని దుయ్యబట్టారు.

    కోరుట్లలో కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. బీజేపీని ప్రశ్నిస్తే మోదీ, అమిత్‌ షా తనపై కేసు పెట్టారన్నారు. ఢిల్లీ పోలీసులను ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కేసులకు రేవంత్‌ రెడ్డి భయపడడని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటే రిజర్వేషన్లను రుద్దు చేయడమేనా అని ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వరు, నిధులు ఇవ్వని  వారు నేడు ఓట్లు ఎలా అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘కార్మికుల త్యాగాలు, పొరాటాల వలనే తెలంగాణ ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికలు ప్రత్యేక పరిస్థితులలో జరుగుతున్నాయి. రాజ్యాంగంలో రిజర్వేషన్‌లు ఎత్తేసే కుట్ర జరుగుతుంది. 400 సీట్లు గెలిచి అదానీ, అంబానీలకు దోచిపెట్టాలని చూస్తున్నారు. కుల గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. నేను బిజెపి ని ప్రశ్నిస్తే ఢిల్లీలో కేసు పెట్టారు.
    చదవండి: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

    పదేళ్లు కేసీఆర్‌ ‌భయపెట్టాలని చూశాడు.కేసులు పెట్టినోళ్ళను అధికారంలో లేకుండా చేశాం. ఒక‌ ప్రధానిగా  నరేంద్ర మోదీ కనబడితే నమస్కరిస్తా. గుజరాత్ వాడిగా తెలంగాణకు వస్తున్నాడు. తెలంగాణకు వచ్చిన వాటిని రద్దు చేసిన వ్యక్తి మోదీ. కాంగ్రెస్ ‌ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్ రద్దు చేయడమేనా? మెట్రో రైలుకి అనుమతులు ఇవ్వాలని అడిగితే స్పందనలేదు. నీటి‌ కేటాయింపులు‌‌ అడిగితే స్పందించలేదు. తెలంగాణ ఏర్పాటును‌ అగౌరపరిచిన వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయన తన స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నాడు.

    దలితులు,గిరిజనులు‌ ఇంకా చితికి పోవాలా. గుజరాత్ నుంిచి వచ్చి తెలంగాణలో పెత్తనం ఏంటి? గుజరాత్ అహాంకారానికి, తెలంగాణ అత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం.మనకి విభేదాలు ఉన్న ఊరుకానొడు వస్తే తరిమికొట్టాలి. రేవంత్ రెడ్డి‌ని జైలులో వెయడానికేనా ప్రధాన మంత్రి ఉద్దేశమా. తెలంగాణ పౌరుషం మాలో‌ ఉంది...భయపడేది లేదు. నిజాం,రజాకార్లకు పట్టిన గతే బిజేపికి పట్టింది.

    పదవులకే వన్నె తెచ్చిన‌ వ్యక్తి ‌జీవన్ రెడ్డి. పదవులను ‌అడ్డం‌ పెట్టుకొని‌ జీవన్ రెడ్డి ఎప్పుడూ అక్రమంగా‌ సంపాదించలేదు. నిజామాబాదు ప్రాంతం వారికి‌ అండగా నిలబడడానికే జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటి చేస్తున్నారు. కొడంగల్ ఓటమి‌ నాకు‌ లాభం తెస్తే, జీవన్ రెడ్డి‌కి జగిత్యాల ఓటమి లాభం చేకూర్చుంది’ అని రేవంత్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం రద్దుకు బీజేపీ చేస్తున్న కుట్రను సాయంత్రం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని తెలిపారు.

  • కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తర్‌ ప్రదేశ్‌ రాయబరేలీ, అమోథీ లోక్‌సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠతకు కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటి (సీఈసీ) తెరదించింది.

    24 గంటల్లోగా ఆ రెండో స్థానాల అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లి కార్జున్‌ ఖర్గే,     
    పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్‌ స్పష్టం చేశారు.

    అయితే నామినేషన్ల తుది గడువు మే 3 వరకు ఉండగా..మే 20న ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆయా లోక్‌సభ స్థానాల అభ్యర్ధులు ఖరారు చేయకపోవడంపై కాంగ్రెస్‌ అధిష్టానంపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్‌ పెద్దలు స్పష్టత ఇచ్చారు  

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని బుధవారం ప్రకటించింది. ఎండలు దంచికొడుతున్న కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచాలని ఆయా రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం..కు పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు ఏడు గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

    కాగా, తెలంగాణకు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు ఒకే దఫా ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఈ ఫేజ్‌లోనే ఎన్నికలు జరుగుతాయి.

    తెలంగాణలో లోక్‌సభ బరిలో మొత్తం 525 మంది ఉన్నారు. ై సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు. 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

  • సాక్షి, హైదరాబాద్‌:దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై  పలువురు అధికారులు హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై విజయసేన్ రెడ్డి బెంచ్‌ స్టే ఇచ్చింది.

    10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్‌కౌంట‌ర్‌ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని గతంలో క‌మిష‌న్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని క‌మిష‌న్‌ తెలిపింది. ఈ నివేదికపై అప్పటి షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్‌తో పాటు తహసీల్దార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

    ఎన్‌కౌంటర్‌ తర్వాత జరగాల్సిన ప్రొసిజర్స్‌లో లోపాలు ఉన్నాయన్న కమిషన్‌..‘దిశ’ నిందితులను ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని  రిపోర్టు ఇచ్చింది. ఎన్‌కౌంటర్‌ వాడిన పిస్తోళ్ల వివరాలు కూడా సరిగ్గా లేవని నివేదికలో పేర్కొన్న కమిషన్‌.. అప్పటి ఎన్‌కౌంటర్‌ను పూర్తిగా తప్పుబట్టింది. కమిషన్‌ రిపోర్ట్‌పై ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది

Family

  • ఈ ఏడాది సమ్మర్‌ మొదలవ్వక మునుపే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఏదో ఒక పని మీద బయటకు వెళ్లకుండా పని అవ్వదు. అలాంటి తరుణంలో ఓ ఆటో డ్రైవర్‌ ఎండ నుంచి రక్షణ కోసం చేసిన ఆలోచన నెటిజన్లు ఫిదా అయ్యారు. వాట్‌ ఐడియా బాస్‌ అంటూ అతడిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

    ఏం చేశాడంటే..?
    మనసుంటే మార్గం ఉంటుందన్న రూటులో సరికొత్తగా ఆలోచించాడు ఈ ఆటో డ్రైవర్‌. ఈ ఎండలకు ఏసీ కారు లాంటివి తప్ప సాధారణ బస్సు, ఆటోల్లో ప్రయాణించడం మహా కష్టం. ముఖ్యంగా ఆటోలో ఎడపెడా వేడి గాల్పు కొట్టేస్తుంది. అందుకని ఈ డ్రైవర్‌ ఆటో​ చుట్టూతా చక్కగా కవర్‌ అయ్యేలా మటితో నింపిన గోను ఏర్పాటు చేసి గడ్డి నాట్లు వచ్చేలా చేశాడు.

    దీంతో ఆటోలో కూర్చొన్న వాళ్లకు మండే ఎండలో చల్లటి వెన్నెల్లో ఉన్న పీల్‌ కలుగుతుంది. ఆటోలో సహజసిద్ధమైన ఏసీ కదూ ఇది..!
    నిజంగా ఈ డ్రైవర్‌ ఆలోచనకు హ్యాట్సాప్‌ అని చెప్పకుండా ఉండలేం కదూ..!. మొత్తం పల్లె పచ్చదనాన్ని ఆటోతో పట్నంలోకి తీసుకొచ్చాడేమో..! అన్నంత అందంగా ఉంది కదూ ఆ డ్రైవర్‌ ఐడియా..!

     

  • మానవుని దైనందిన జీవితంలో అతి ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. ప్రస్తుత బిజీ లైఫ్‌లో సంపాదన పరుగులో మనిషికి మానసిక ప్రశాంతత  దారుణంగా కరువయ్యిందనే చెప్పాలి. అందుకోసం తాను ఏం చేయాలన్నది కూడా స్ప్రుహ లేనంత గందరగోళంలో ఉన్నాడు. దీంతో సమస్యలన్నీ ఒక పెనుభూతంలా కనిపించి ఎదుర్కొనే స్థైర్యం లేక నిసత్తువుగా మారిపోతున్నాడు. విద్యార్థుల నుంచి పెద్ద పారిశ్రామిక వేత్తల వరకు అందర్ని వేధిస్తున్న సమస్యే ఈ మానసిక అనారోగ్యం.

    దీన్ని మెరుగుపరుచుకుని మనల్ని మనం సంసిద్ధం చేసుకునేలా కౌన్సిలింగ్‌ ఇచ్చే చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలానే రామానయుడు ఫిల్మ్‌ స్కూల్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు గ్లోబల్ వెల్ఫేర్ ఫౌండేషన్, ముదిత ట్రైబ్ ఫౌండేషన్‌ల సహకారంతో రామా నాయుడు ఫిల్మ్ స్కూల్‌  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే నో కాస్ట్‌ ఫౌండేషన్‌ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పర్సన్-టు-పర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టియన్ కౌన్సెలింగ్ అనే సంస్థ నిర్వహిస్తుంది. దీని ద్వారా ఆయా వ్యక్తులు సహ కౌన్సిలర్‌లుగా మారి తమ కమ్యూనిటీలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే స్థాయికి చేరేలా ఈ కోర్సుని రూపొందించారు.

    మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలింగ్‌ నో కాస్ట్‌ ఫౌండేషన్‌ కోర్సు రామానాయుడు ఫిలిం స్కూల్‌లో ఇవాళ మే 1 నుంచి ప్రారంభమై మే 6, 2024 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజుల ఫౌండేషన్‌ కోర్సు కోసం సుమారు 56 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కరోనా మహమ్మారి తర్వాత మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలర్‌ల డిమాండ్‌ ఎక్కువయ్యిందని గ్లోబల్‌ వెల్ఫేర్ ఫౌండేషకి చెందిన శ్రీనివాసన్‌ లింగేశ్వరన్‌ అన్నారు. ఆ డిమాండ్‌ని తీర్చే ఉద్దేశ్యంతోనే ఈ కోర్సుని రూపొందిచడం జరిగిందని చెప్పారు. 

    ఇది  కేవలం కౌన్సిలర్‌ల కొరత సమస్యను పరిష్కరించడమే కాకుండా మానిసిక ఆరోగ్యాన్ని గురించి అవగాహన కల్పించేలా ప్రాధాన్యత ఇచ్చేలా చేసి సంపూర్ణ సంక్షేమ  నిబద్ధతకు పెద్ద పీట వేస్తుంది. ఈ మేరకు ముదిత వ్యవస్థాపకురాలు మిహీకా దగ్గుబాటి మాట్లాడుతూ..ఎటువంటి ఖర్చు లేకుండా వారివారీ కమ్యూనిటీలలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా శక్తిమంతంగా చేయడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 

    ఇలాంటి కోర్సులు నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయని రామానాయుడు పిల్మ్‌ స్కూల్‌ చైర్మన్‌ డి సురేష్‌ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యాసకులకు ఇద్దరూ ప్రఖ్యాత మనస్తత్వవేత్తలు కౌన్సిలింగ్‌ ద్వారా మాసిక ఆరోగ్యంపై లోతైన అవగాహానను, ఆచరణాత్మక పద్ధతుల గురించి కూలంకషంగా తెలియజేస్తారు. ఈ కోర్సులో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కీలక అంశాలన్నింటిని నిపుణులు కవర్‌ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయా వ్యక్తులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే గాక ఇతరులను ప్రభావితం చేసేలా కౌన్సిలర్‌లుగా మారి సంతోషకరమైన సమాజానికి బాటలు వేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఈ  కోర్సులో జాయిన్‌ అయ్యి ఉజ్వల భవిష్యత్తు దిశగా  ఇవాళ నుంచే తొలి అడుగులు వేద్దాం. 

    (చదవండి:  ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!)

     


     

  • రాత్రి భోజనాల తరువాత మా చదువు మొదలయ్యేది. అప్పుడప్పుడూ ఆదివారాలు మధ్యాహ్నాలు కూడా. మధ్యాహ్నాలు పర్లేదు వెలుతురయ్య ఎల్లడై ఉన్న సమయం అది. రాత్రి సమయపు లెక్కలు వేరు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో అనవసరమైనది, అవసరానికి మించినదీ ఏది ఉండేది కాదు. రాత్రి చదువుకు వెలుతురు కావాలి అంటే దానికి బల్బు కావాలి, కరెంటు లాగడానికి వైర్ కావాలి, బల్బ్‌కు హోల్డర్ కావాలి, వైరుకు ప్లగ్గు కావాలి, ఒక స్విచ్చు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి. ఉన్న నలుగురైదుగురం తలా ఇంత అని వేసుకుని అవన్నీ కొనుక్కుని తెచ్చుకుని బిగించుకుని చదువుకు సిద్దం అయ్యేవాళ్ళం. పుల్లయ్యగాడు వాడి వాటాకు డబ్బులు కాక ఇంటినుండి కరెంటు గుంజి తెచ్చేవాడు. బల్బు వెలిగేది

    ఆ విధంగా కాంచిపురముననొకడు కాంచనగుప్తుడను వైశ్యుడి దగ్గరి నుండి, వాటర్‌లూ యుద్దాలు, చిరపుంజిలో వర్షపాతము, గర్జించే నలభైలు, తళ్ళికోట చరిత్ర, గణిత సూత్రాలు, బీజీయ సమాసాలు, ఐ లే ఇన్ సారో డీప్ డిస్ట్రెస్స్డ్, మై గ్రీఫ్ ఏ ప్రౌడ్ మ్యాన్ హర్డ్, హిజ్ లుక్స్ వర్ కోల్డ్, హి గేవ్ మీ గోల్డ్… అనే శబ్ద పాండిత్యాన్ని బట్టీప్రవాహంలా ఒకళ్ళమీదికి ఒకళ్ళము ప్రవహింపజేసుకునేవాళ్ళము.

    ఉదయం ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీదకి చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు. మాకు అప్పటికి అంతగా తెలియని పరకాయ ప్రవేశవిద్య ఒకటి వారు సాధన చేస్తూ ఉండేవారు. దానివలన చదువు భంగం అయ్యేది. విశ్వామిత్రుడికీ దూర్వాసుడికీ కూడా ఎదురవ్వని అనుభవాలు మావి

    అన్వర్‌, సాక్షి

  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ర‌ష్యాకు చెందిన మహిళాప్రయాణీకురాలికి  చేదు అనుభ‌వం ఎదురైంది. రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారాకు బోర్డింగ్ పాస్‌పై ఒక పాస్‌పోర్ట్‌ అధికారి ఫోన్ నంబర్‌ను రాసి ఇవ్వ‌డంతో పాటు మళ్లీ ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు  కాల్  చేయాలని  పేర్కొన్నాడన్న  ఆరోపణలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దినారా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

    ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన బోర్డింగ్ పాస్‌పై అతని ఫోన్ నంబర్‌ను రాసి, నెక్ట్స్‌ టైం వచ్చినపుడు  సంప్రదించాలని పేర్కొన్నట్టు  దినారా వీడియోలో ఆరోపించింది. దీనికి సంబంధించిన బోర్డింగ్‌ పాస్‌ను కూడా  చూపించింది. ‘‘అరే యార్, ఈ ప్రవర్తన ఏమిటి?"  అంటూ  ప్రశ్నించింది. అంతేకాదు దీనిపై ఇది సరి అయినదేనా అంటూ పోల్‌  కూడా నిర్వహించింది.

    అయితే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. అటు అధికారులనుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. 

    అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా గతవారం ఇండియన్‌ భర్త కావాలంటూ ఇటీవల ఆమె చేసిన రీల్‌ను కొంతమంది గుర్తుచేసుకున్నారు. బహుశా అందుకే  సదరు ఆ అధికారి   అలా చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, దినారా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని QR కోడ్‌తో పాటు, "లుకింగ్ ఫర్ ఏ ఇండియన్ హస్బెండ్" అనే పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసింది.  గోడపై పోస్టర్‌ అతికిస్తున్న ఈ చిన్న క్లిప్‌కు మూడు మిలియన్లకు పైగా వ్యూస్‌  రావడం గమనార్హం. 

     

    భారతదేశంలో పర్యటిస్తూ  తన అనుభవాలతో వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేయడంద్వారా పాపులర్‌ అయింది దినారా.  ప్రస్తుతం  స్వదేశానికి వెళ్లి పోయింది.  మాస్కో నుండి  ఇన్‌స్టా స్టోరీలను పోస్ట్‌ చేస్తోంది. 
     

  • ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు గురించి విని ఉంటారు. అలాగే అత్యంత వ్యాపార దిగ్గజాలుగా పేరుగాంచిన వారి గురించి కూడా విని ఉంటారు. కానీ ఇదేంటి అ‍త్యంత ధనిక ఖైదీ. ఖైదీల్లో ధనికులు ఉంటారా..! అని విస్తుపోకండి. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి తెలిస్తే తప్పక ఔనని అంటారు. అతడెవరంటే..

    క్రిప్టోకరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావోకి యూఎస్‌ కోర్టు గత మంగళవారమే నాలుగు నెలల శిక్ష విధించింది. దీంతో జావో  ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఖైదీగా నిలిచినట్లు యూఎస్‌ టెలిగ్రాఫ్‌ పేర్కొంది. ఆయన గతేడాది యూఎస్‌ మనీలాండరింగ్‌కి సంబంధించిన నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘింట్లు అంగీకరించడంతో సీటెల్‌​ కోర్టు జావోకు ఈ శిక్షను విధించింది. నిజానికి జావోకు ఈ నేరంలో మూడేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయవాదులు నుంచి ఒత్తిడిచ్చినా..జడ్డి అతడి అతని దాతృత్వ రికార్డు, ప్రవర్తనను పరిణలోకి తీసుకుని నాలుగు నెలల జైలు శిక్షను మాత్రమే విధించారు. 

    నాలుగు నెలల జైలు శిక్షఅనుభవిస్తున్న జావో తన బినాన్స్‌ సంస్థ ద్వారా దాదాపు మూడు వేల కోట్ల సంపదను కలిగి ఉన్నాడు. దీంతో అతడు అత్యంత సంపన్న ఖైదీలలో ఒకరిగా నిలిచాడు. 47 ఏళ్ల జావో యూఎస్‌ అధికారిక ఒప్పందంలో భాగంగా గతేడాది బినాన్స్‌ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. అయినప్పటికీ బినాన్స్‌లో ఆయన 90% వాటాను కలిగి ఉండటం విశేషం. పైగా మనీలాండరింగ్‌ ఆరోపణల పరిష్కారంలో భాగంగా ఫిబ్రవరిలో రూ. 35 వేల కోట్లు చెల్లించడానికి బినాన్స్‌  సంస్థ అంగీకరించింది.

    కాగా,2017లో ఈ బినాన్స్‌ సంస్థ ఏర్పాటయ్యింది. ఇది చాంగ్‌పెంగ్‌ జావోను ఒక్కసారిగా బిలియనీర్‌గా మార్చేసింది. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్ఛేంజీలను నడుపుతూ.. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. ఎప్పుడైతే క్రిప్టో మార్కెట్‌ కుప్పకూలిపోయిందో అప్పటి నుంచి చట్టబద్దతను ఉల్లంఘించి..నష్టాల బాట పట్టింది. చెప్పాలంటే కుప్పకూలిని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ ఎఫ్‌టీఎక్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సామ్‌ బ్యాంక్‌మ్యాన్‌ ఫ్రైడ్‌ చేసి  బిలయన్‌ డాలర్ల మోసానికి గానూ 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన వారాల తర్వాత జావో నేరం వెలుగులోకి వచ్చింది. జావో అధిక రిస్క్‌తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్‌ ఫండ్‌లలో బిలియన్‌ డాలర్లను స్వాహ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. 

    (మిస్‌ యూనివర్స్‌​ అందాల పోటీల్లో 60 ఏళ్ల మహిళ..!)
     

     


     

Business

  • ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్‌ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ టాప్‌ టెన్‌ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్‌ బెర్గ్‌ తెలిపింది.  

    ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్‌లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు.    

    గూగుల్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా
    గూగుల్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్‌ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్​ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.

    సీఈఓ అనే సింహాసనం మీద
    అందుకు ప్రతిఫలంగా సుందర్‌ పిచాయ్‌కు గూగుల్‌ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లైన ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌ డాక్‌లలో గూగుల్‌ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్‌ పిచాయ్‌కు గూగుల్‌ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్‌ పిచాయ్‌ ఆదాయం భారీగా పెరిగింది.  

    త్వరలో  బిలీయనీర్
    పలు నివేదికల ప్రకారం.. గూగుల్‌తో పాటు గూగుల్‌ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్‌‌ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్‌ ఏఐ టూల్స్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.

  • భారతదేశ జీఎస్టీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వసూళ్లు నమోదయ్యాయి. ఏప్రిల్‌ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు రూ.2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా 2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏడాది ప్రాతిపదికన ఈ వసూళ్లలో 12.4 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

    2024 మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నెలవారీగా 13.4 శాతం వృద్ధిచెంది ఏప్రిల్‌లో అత్యధికంగా జీఎస్టీ రూ.2.10 లక్షలకోట్లకు చేరింది. రిఫండ్‌లను లెక్కించిన తర్వాత ఏప్రిల్ 2024లో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.92 లక్షల కోట్లుగా ఉంటుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.1% వృద్ధి నమోదైంది.

    2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున రూ.1.8 లక్షల కోట్లకు చేరుతుందని సీబీడీటీ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2022-23లో నెలవారీగా సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లుగా నమోదైంది. 2023-24లో సగటును రూ.1.68 లక్షల కోట్లకు చేరింది. 2017 జులైలో జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌నెలలో అత్యధిక వసూళ్లు రికార్డవుతున్నాయి.

  • త్వరలో అక్షయ తృతీయ రాబోతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు ఆనందం కలిగించే వార్త ఇది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ధరలు ఈరోజు (మే 1) ఏకంగా రూ.1260 మేర తగ్గాయి.

    రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నంలతో పాటు  వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ. 71,510 లకు తగ్గింది.

    ఇతర నగరాల్లో..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 తగ్గి రూ.71,660 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 వద్దకు దిగొచ్చింది.

    చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1150 తగ్గి రూ.71,510 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1260 తగ్గి రూ.72,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 లకు తగ్గింది.