-
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వీకే సక్సేనా తొలగించారు. ఈ మేరకు ఎల్జీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. అమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలు రావటంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎల్జీ నిర్ణయంపై స్పందించిన ఎంపీ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. ‘కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే.. మొత్తం కమిషన్ మూతపడుతుంది. కమిషన్ ప్యానెల్లో ప్రస్తుతం 90 మంది మాత్రమే ఉన్నారు. అందుతో కేవలం 8 మంది మాత్రమే ప్రభుత్వ సిబ్బంది. మిగిలిన వారంతా మూడే నెలలపాటు పని చేసే.. కాంక్రాక్టు ఉద్యోగులు. ఇలా ఎందుకు చేస్తున్నారు. మహిళా కమిషన్ అస్సలు మూత పడనివ్వను. నన్ను జైలులో పెట్టండి కానీ, మహిళలను హింసించకండి’అని ‘ఎక్స్’ వేదికగా ఉన్నారు.LG साहब ने DCW के सारे कॉंट्रैक्ट स्टाफ को हटाने का एक तुग़लकी फ़रमान जारी किया है। आज महिला आयोग में कुल 90 स्टाफ है जिसमें सिर्फ़ 8 लोग सरकार द्वारा दिये गये हैं, बाक़ी सब 3 - 3 महीने के कॉंट्रैक्ट पे हैं। अगर सब कॉंट्रैक्ट स्टाफ हटा दिया जाएगा, तो महिला आयोग पे ताला लग जाएगा।…— Swati Maliwal (@SwatiJaiHind) May 2, 2024ఢిల్లీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం ప్యానెల్లో 40 ఉద్యోగాలు, కొత్తగా కొల్పించిన 223 ఉద్యోగ పోస్టులకు ఎల్జీ అనుమంతి తీసుకోలేదని జారీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులను నియమించే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. స్వాతి మలివాల్ ఆప్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాకముందు 9 ఏళ్లు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్‌గా పనిచేవారు. ప్రస్తుతం ప్యానెల్ చైర్మన్ పదవి ఖాళీ ఉంది. తాజా చర్యలతో మరోసారి ఆప్ ప్రభుత్వానికి, ఎల్జీకి మరోసారి వివాదం ముదరనుందని ప్రచారం జరుగుతోంది. -
లిక్కర్ కేసు: కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగనుంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో ఆమె వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును గురువారం ఉదయం వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక స్థానం. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులపై బెయిల్ కోరుతూ కవిత తరఫున వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ సీబీఐ అరెస్ట్ వ్యవహారంపై ఆమె వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. ఆ తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేసింది ప్రత్యేక కోర్టు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఒకేరోజు వేర్వేరుగా తీర్పులు ఇస్తామని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా స్పష్టం చేశారు. ఇక.. లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ చెప్పుకొచ్చింది. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని అరెస్టు చేశారని అన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలులేవని వాదనలు వినిపించారు.ఈడీ బెయిల్ పిటిషన్‌పై వాడీవేడి వాదనలుఇక.. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట్లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అయితే వాదనల అనంతరం కోర్టు దానిని తిరస్కరించింది. దీంతో ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. మే 6వ తేదీన వెల్లడిస్తామని తెలిపింది. విచారణ సందర్భంగా.. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే కవితను సెక్షన్ 19 కింద చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. రూ. 581 కోట్లు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారని... అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారన్నారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని తెలిపారు. ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కిందని.,. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని చెప్పారు. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారన్ నారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని.. అసాధారణ లాభాలు గడించారని కోర్టుకు విన్నవించారు. బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారన్నాు. ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కలేదని కోర్టుకు తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించడం గమనార్హం. -
రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలు జరుగు తున్న 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది. ఒక గంట పాటు అదనపు సమయం ఇస్తున్నట్టు తెలిపింది. సవరించిన సమయం ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించింది. రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల పరిధిలో పూర్తిగా.. మిగతా 5 లోక్‌సభ సీట్ల పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఈ సమయం పెంపు ఉంటుందని ప్రకటించింది.పోలింగ్ సమయం పెరిగే ఎంపీ స్థానాలివీకరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలుకొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమయం పెంచిన స్థానాలివే.. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలోని ఖానాపూర్ (ఎ స్టీ), ఆదిలాబాద్, బోథ్(ఎస్టీ), నిర్మల్, ముథోల్. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలోని ధర్మపురి (ఎస్సీ), రామగుండం, పెద్దపల్లి. వరంగల్ లోక్‌సభ స్థానంలోని స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట్. మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలోని డోర్నకల్ (ఎస్టీ), మహబూబాబాద్ (ఎస్టీ), నర్సంపేట్. ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా (ఎస్టీ), సత్తుపల్లి (ఎస్సీ). -
150 స్కూళ్లకు బాంబు బెదిరింపు
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలను బాంబులతో పేల్చేస్తామంటూ ఆగంతకులు పంపిన హెచ్చరికలు దేశ రాజధాని ఢిల్లీలోని బుధవారం ఉదయం తీవ్ర కలకలానికి కారణమయ్యాయి. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లోని 150 పైచిలుకు స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ అందడంపై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో తమకు 97 ఫోన్ కాల్స్ వచ్చాయని ఢిల్లీ ఫైర్ సరీ్వస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతా కొన్ని కాల్స్ అందాయన్నారు. తూర్పు ఢిల్లీలోని 24 ప్రైవేట్ స్కూళ్లు, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని 18 స్కూళ్లు, పశి్చమ ఢిల్లీ ప్రాంతంలోని 21, షాదారాలోని 10 పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూళ్ల వద్దకు చేరుకుని, తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం, పాఠశాలల నిర్వాహకులు మైక్‌ల ద్వారా తల్లిదండ్రులు సూచనలు ఇవ్వడం కనిపించింది. సోదాల్లో 20 బృందాలు ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసు బృందాలు సీపీ రవీందర్ యాదవ్ నేతృత్వంలోని బెదిరింపులు అందిన స్కూళ్లలో ప్రొటోకాల్ ప్రకారం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కూడిన 20 బృందాలను రంగంలోకి దించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కని పించకపోవడంతో అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని హోం శాఖ ప్రకటించింది.డార్క్‌నెట్ నుంచి మెయిళ్లు ఎటువంటి ఆధారాలు చిక్కకుండా డార్క్‌నెట్‌ను ఉపయోగించుకుని దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ట్చఠ్చీటజీజీఝఃఝ్చజీ . టu. అనే ఈ మెయిల్ ఐడీ నుంచి వచ్చిన ఈ మెయిళ్లన్నిటిలోనూ..‘మీరు ఎక్కడ కలుసుకున్నా వారిని చంపండి, వారు మిమ్మల్ని తరిమికొట్టిన ప్రదేశాల నుంచి వారినీ తరిమికొట్టండి. స్కూల్లో చాలా పేలుడు పదార్థాలున్నాయి..’అనే విషయమే ఉందని వెల్లడించింది. ఇందులోని సవరిమ్ అనే అరబిక్ పదాన్ని ఉగ్ర సంస్థ ఐఎస్ తరచూ వాడుతుంటుందని ఓ అధికారి తెలిపారు. బెదిరింపుల్లో పవిత్ర ఖురాన్‌ను కూడా ఉటంకించారని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజల్లో భయాందోళనలను సృష్టించడానికి ఉగ్ర సంస్థలు పన్నిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తూ లోతుగా దర్యాప్తు చేపడతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓ వైపు బీజేపీ దూసుకుపోతుంటే.. మరోవైపు పలువురు నేతలు ఆ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు. తాజాగా నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. బుధవారం ఆమె ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయంలో వినోద్ తావ్డే, అనిల్ బలూని సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన అనంతరం రూపాలీ గంగూలీ మీడియాతో మాట్లాడారు. ‘మహాయాగ్య అభివృద్ధి చేసినప్పుడు అందులో నేను కూడా భాగం కావాలని భావించాను. నేను చేసే మంచికి.. మీ దీవెనలు, మద్దతు నాకు కావాలి’ అని రూపాలీ అన్నారు.#WATCH | Actress Rupali Ganguly joins BJP at the party headquarters in Delhi She says, "...When I see this 'Mahayagya' of development, I feel that I should also take part in this...I need your blessings and support so that whatever I do, I do it right and good...'' pic.twitter.com/x7pT7oq0xB— ANI (@ANI) May 1, 2024రూపాలీ గంగూలీ దర్శకుడు అనిల్ గంగూలీ కుమార్తె. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, ఆపై పలు టీవీ సీరియల్స్ ద్వారా ఆమె పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై అత్యధికంగా పారితోషకం అందుకుంటున్న నటి ఈమెనే కావడం గమనార్హం. వ్యక్తిగత జీవితానికి వస్తే.. బెంగాలీ మూలాలున్న కుటుంబమే అయినప్పటికీ రూపాలీ సినీ నేపథ్యం కారణంగా ఆమె తండ్రి ముంబైలో స్థిరపడ్డారు. హోటల్ మేనేజ్మెంట్ చేసి ఆపై నటన వైపు ఆమె మళ్లారు. 2013లో ఆమె అశ్విన్ వీ వర్మ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.ఇక.. ఇటీవల బీజేపీలో చేరిన నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే రామ్నివాస్ రావత్ మంగళవారం బీజేపీలో చేరారు. ప్రియాంకా గాంధీకి సన్నిహితంగా ఉండే తాజిందర్ సింగ్ బిట్టు గత నెలలో బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా అమూల్...
పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్‌లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement