-
అమరజీవికి అవమానం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి జగన్నాథం ఇటీవల యాదవులను నోటికొచ్చినట్లు తిట్టారు. వారిని కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ఫోన్ సంభాషణలో బెదిరించారు.ఇప్పుడు గొండు శంకర్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాతీపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా మాట్లాడారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్‌కు ఆ పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామని, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడికి ప్రపోజల్ పెట్టామని బహిరంగ ప్రకటన చేశారు. తండ్రీకొడుకులిద్దరు చేసిన కామెంట్స్ ఇప్పుడు హా ట్ టాపిక్ అయ్యాయి.ఇప్పటివరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు నగర అభివృద్ధికి పాటు పడ్డారు. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే జిల్లా కేంద్రం అభివృద్ధిలో కీలక భూ మిక వహించారు. రిమ్స్ ఆస్పత్రి, ప్రధాన వంతెనలు, రోడ్లు, కలెక్టరేట్, స్టేడియం, పార్కులు, మా ర్కెట్, శాలిహుండం, అరసవల్లి దేవాలయం అభివృద్ధి, శ్రీకూర్మం దేవాలయం అభివృద్ధి, కళింగపట్నం బీచ్ అభివృద్ధి, డంపింగ్ యార్డ్, తాగునీరు సరఫరా... ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో శ్రీకాకుళం నగరంతో పాటు నియోజకవర్గ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.జిల్లాలోనైతే వంశధార ప్రాజెక్టు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్, మడ్డువలస రి జర్వాయర్, అంబేడ్కర్ యూనివర్సిటీ, మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పపత్రి, ఉద్దానం మంచినీ టి ప్రాజెక్టు తదితర అభివృద్ధి పనుల్లో భాగస్వా మ్యం అయ్యారు. ఆయనే కాదు గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవి, అంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేసి, చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఎన్నడూ ఇలా ప్రముఖుల పేర్లు తీసేస్తామని వివాదాస్పదంగా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న గొండు శంకర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఒక కులాన్ని దూషించగా, గొండు శంకర్ ఏకంగా వైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేలా, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా వ్యాఖ్య లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలో కీలక వ్యక్తుల పేరుతో కొత్తగా ఏవైనా ఏర్పాటు చేసి వాటికి పేరు పెట్టడమో, లేదంటే వారిని గౌరవించేందుకు, స్మరించేందుకు విగ్రహాలు ఏర్పాటు చేయడమో చేయాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అలాంటి గౌరవం ఎంతో మంది ప్రముఖులకు లభించింది. బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. అంధవరపు వరం మరణించాక ఆయన విగ్రహాన్ని ప్రధాన జంక్షన్లో ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరికొంత ప్రముఖుల విగ్రహాలను నగరంలో ఆవిష్కరించారు. అంతేగానీ అప్పటికే ఉన్న వాటికి ప్రముఖుల పేర్లు తీసేయడం చేయలేదు. గొండు శంకర్ సమాజానికి ఏం సంకేతాలు ఇద్దామనుకుంటున్నారో గానీ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న శ్రీకాకుళం మున్సిపల్ మార్కెట్‌కు ఆయన పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామనడం వివాదాస్పదమైంది. ఆయన పేరు ను ఏదైనా కొత్తగా ఏర్పాటు చేసిన దానికి పెడతామ ని చెప్పాలే తప్ప రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల పేరును తీసేస్తామనడం, దానికో సం ఎంపీ రామ్మోహన్నాయుడికి ప్రతిపాదన పెట్టా మనడం వైశ్య వర్గాన్నే ఆశ్చర్యపరిచింది. వైశ్యుల ముద్దు బిడ్డగానే కాదు రాష్ట్రమంతా గొప్పగా భావించే పొట్టి శ్రీరాములు పేరు తీయాలన్న ఆలోచన రావడమే దారుణమని, ఇలాంటి వికృత చర్యలతో ఏం చేద్దామనుకుంటున్నారని వైశ్య వర్గాలే కాదు ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ
శ్రీకాకుళం, సాక్షి: జనం అంతా జగన్ వెంటే.. మేమంతా సిద్ధం యాత్రతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీలో చేరారు. వీళ్లలో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు YSRCP కండువా కప్పుకున్నారు.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్సీపీలో చేరారు.సీఎం జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. -
జగన్ మార్కుతో సమాజం ‘సిద్ధం’: సీఎం వైఎస్ జగన్
సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొదటి రోజు నుంచే ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో గ్రామస్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం! విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం! గ్రామస్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులతో గవర్నమెంట్ ఆస్పత్రి సిద్ధం! పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ సేవలందిస్తున్న వలంటీర్ల వ్యవస్థ సిద్ధం! ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు, తమ్ముళ్లు దాదాపు 600 రకాల సేవలందిస్తూ మన గ్రామాల్లో సచివాలయాల్లో సిద్ధం! 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధం! పట్టణాల్లో సైతం ఇంటింటికీ పౌరసేవలు సిద్ధం! దేశ చరిత్రలో తొలిసారిగా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.70 లక్షల కోట్లు ఇంటింటికీ డోర్ డెలివరీ చేసిన వ్యవస్థ సిద్ధం! ఒకటో తేదీనే ఇంటికే వచ్చి రూ.3,000 పెన్షన్ ఇచ్చే వలంటీర్ల వ్యవస్థ సిద్ధం! ఇదీ మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. – సీఎం జగన్ సాక్షి, శ్రీకాకుళం: ‘‘ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు సిక్కోలు సింహాలు ఇవాళ ఇక్కడకు కదలివచ్చాయి. ఈ విప్లవ గడ్డపై ఆ పెత్తందార్ల ముఠాపై ఎగురవేస్తున్న తిరుగుబాటు బావుటా కనిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా జన సముద్రమే. వైఎస్సార్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడవునా జన సునామీని చూస్తుంటే 25 ఎంపీలకు 25 ఎంపీలు, 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా?’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. 22 రోజుల పాటు సాగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అక్కవరం వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ..బలమైన పునాదులతో..ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేయమంటే పథకాలన్నింటికీ ముగింపే. మళ్లీ మోసపోవటమే. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ, పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప ఛెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? కుటుంబంతో చర్చించండిసినిమాకు వెళ్లినప్పుడు హీరో ఎందుకు నచ్చుతాడు? విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి ఆలోచించండి. గుణగణాలు, మంచితనం వల్ల మా హీరో అని అనుకుంటాం. మోసాలు, అబద్ధాలు, కుట్రలు పన్నే క్యారెక్టర్‌ను విలన్ అంటాం. నిజ జీవితంలో, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరంతా ఇంటికి వెళ్లాక కాసేపు కుటుంబ సభ్యులతో కూర్చుని నింపాదిగా మాట్లాడండి. చిన్నపిల్లల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అవ్వాతాతలు, ఆడపడుచుల అంతరంగాన్ని గమనించండి. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందనే నమ్మకం కలుగుతుందో వారితోనే అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నా. మీ గుండె చప్పుడే ‘‘సిద్ధం’’పొత్తుల జిత్తులు, జత కట్టిన జండాలకు బదులిస్తూ జగన్ వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే.. సిద్ధం! సామాన్యులు, పేదల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురం వరకు సాగిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్రయాత్రకు సంకేతం. ఇది మూడు నాలుగు నెలల క్రితం మొదలు పెట్టింది కాదు. ఓ 25 సభలతో వచ్చింది కాదు. మనందరి ప్రభుత్వం 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధమే ఈ సిద్ధం. ఆ చైతన్యం పేరే..ఇక్కడ నిర్వహిస్తున్న సభ పేరు మాత్రమే కాకుండా మరో ఐదేళ్లు ఈ మార్పులన్నీ కొనసాగాలని ఇంటింటికీ వెళ్లి వారు మరో వంద మందికి వివరించాల్సిన అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం! మీకు మంచి జరిగి ఉంటే.. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని ప్రజలను కోరే ధైర్యమే సిద్ధం! ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుటలో పారేసే చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి 99 శాతం వాగ్దానాలను నెరవేర్చి ఇంటింటికీ మళ్లీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాలపై చేసిన చైతన్యం పేరే సిద్ధం!పేదలు, అక్కచెల్లెమ్మలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సాధికారత దిశగా చెయ్యి పట్టుకుని నడిపించే ఘటమే ఈ సిద్ధం! ఇంతగా సిద్ధమైన సమాజంతో, మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబు మరో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తోంది. పరోక్షంగా కూడా పొత్తులు వెతుక్కోవాల్సి వస్తోంది. కుట్రలకు దిగజారాల్సి వస్తోంది. నాలుగు మంచి పనులు చేశానని చెప్పలేని చంద్రబాబు రోజూ నన్ను తిట్టడం, తిట్టించడం, వారి ఛానళ్లు, పత్రికల్లో అదో ఘనకార్యమన్నట్లుగా చూపిస్తున్నారు. ఇది గొప్ప రాజకీయం అవుతుందా? మన అభ్యర్థులను ఆశీర్వదించండిఎంపీ అభ్యర్థి తిలక్, టెక్కలి నుంచి శ్రీను, ఆమదాలవలస నుంచి తమ్మినేని సీతారామ్, పలాస నుంచి డాక్టర్ అప్పలనాయుడు, పాతపట్నం నుంచి శాంతమ్మ, ఇచ్చాపురం నుంచి విజయమ్మ, నర్సీపట్నం నుంచి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావును ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నా. ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా?మన ప్రభుత్వం వల్ల పేదల కుటుంబాల్లో, వారి చదువుల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో, సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మగౌరవంలో ఎంత మార్పు తీసుకురాగలిగామో టీడీపీ, చంద్రబాబు, ఆయనకు దరువు వేసే ఎల్లో మీడియా ఏనాడైనా కనీసం ఆత్మవిమర్శ చేసుకోవడం చూశారా? ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడం అంటే అర్థమేమిటి? ప్రభుత్వం అనేది ఎవరి కోసం? అందమైన వాగ్ధానాలతో అధికారం లాక్కుని ఐదేళ్లు వంచించటానికి, లూటీ చేసి దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, దాచుకోవడం కోసమే వారికి అధికారం కావాలని అడుగుతున్నారు. బాబు రోల్డ్ గోల్డ్ దుకాణం..మీ బిడ్డ కరోనా కష్టంలో కూడా సాకులు వెతుక్కోలేదు. ఏ ఒక్క పథకాన్నీ, బటన్లు నొక్కటాన్ని ఆపలేదు. పేదవారి కష్టం తన కష్టం కంటే ఎక్కువని భావించాడు. మీ జగన్ స్వచ్ఛమైన మనసుతో, మంచి చేశాననే ఆత్మవిశ్వాసం, ఆత్మ సంతృప్తితో మీ ముందు సవినయంగా తలెత్తుకుని నిలబడ్డాడు. 2014 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలనూ మేనిఫెస్టోలో మీ బిడ్డ చెప్పలేదు. రాష్ట్ర ప్రజలు, నమ్ముకున్న వారిని ఎన్నటికీ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడు.దాన్ని బంగారం అని నమ్మించే యత్నం చేయడు. చంద్రబాబు నిర్వహించే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ ఒక్క మంచి పని చేయని చంద్రబాబుతో మీ బిడ్డ పోటీ పడడు. మీ జగన్ మార్కు ఇవాళ ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తుంది. ప్రతి అక్కచెల్లెమ్మ చిరునవ్వులో, అవ్వాతాతల ఆనందంలో, పిల్లల ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. జగన్‌కు పేదలపై ఉన్నంత ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికీ లేదు, ఉండదు. ఇది నిజం. ఇది మాత్రమే నిజం. ఇదీ చదవండి: యువనేత జైత్రయాత్ర!నావల్ల కానిది బాబు జేజమ్మ కూడా చేయలేదు..జగన్ చేయలేని ఏ స్కీమ్‌నూ చంద్రబాబు కాదు కదా.. ఆయన జేజమ్మ కూడా చేయలేదు! మోసాలు, అబద్ధాలతో ఏ స్థాయికైనా దిగజారి పొత్తులు పెట్టుకునే ఆయనతో మీ బిడ్డ పోటీ పడలేడు. నిజాలు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం నాకుంది. బాబు మాదిరిగా నేను మోసపూరిత వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలన్న రాజనీతిని మీ బిడ్డ పాటించడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చని నిరూపించటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా? మోసాలా.. విశ్వసనీయతా? మీకు ఎలాంటి నాయకుడు కావాలని అందరినీ అడుగుతున్నా. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా? మేనిఫెస్టోలో చెప్పేవన్నీ ఎగ్గొట్టే నాయకుడు అబద్ధాలు, వెన్నుపోట్లు నైజంగా కలిగిన నాయకుడు కావాలా? లేక నోటి నుంచి ఒక మాట వస్తే, మేనిఫెస్టోలో చేరిస్తే తు.చ. తప్పకుండా పాటించే జగన్ లాంటి నాయకుడు కావాలా? సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా? లేక చేసిన మంచిని చూపిస్తూ సింహంలా సింగిల్‌గా వచ్చే నాయకుడు కావాలా? మోసాలు చేసే చంద్రబాబు కావాలా? విశ్వసనీయతతో నిలబడే జగన్ కావాలా? తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి గర్వంగా ఇంటింటికీ చెప్పుకోగలిగిన మీ బిడ్డ కావాలా? చెప్పిన మాటలు గాలికి వదిలేసే బాబు కావాలా? వ్యత్యాసాన్ని తుడిచి వేస్తూ..పిల్లలెవరకూ తమ కులం, మతం, ఆర్థిక పరిస్థితుల వల్ల మంచి చదువులు చదువుకోలేకపోయామని బాధపడేందుకు వీల్లేని సమ సమాజాన్ని మీ బిడ్డ నిర్మిస్తున్నాడు. ధనికులు, పేదలకు వేర్వేరు చదువులు అనే వ్యత్యాసాన్ని మీ బిడ్డ తుడిచి వేస్తున్నాడు. ఒక రైతు, ఒక కూలీ, చిరువ్యాపారి, పేద కుటుంబం, నిరుపేద సామాజిక వర్గం.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని, ఆ మంచిని కొనసాగిస్తుందనే నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలనను 58 నెలలుగా అందిస్తున్నాడు. వ్యవస్థలు బాగుండాలంటే..మోసాలు, అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సెల్ఫోన్లలో టార్చిలైట్లను వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదలకు పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలనతో ముందుకు పోవాలన్నా, మన వ్యవస్థలన్నీ బాగుండాలన్నా ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లోనూ గొప్ప మెజార్టీతో గెలిపించాలి. బలమైన పునాదులతో..ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేయమంటే పథకాలన్నింటికీ ముగింపే. మళ్లీ మోసపోవటమే. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ, పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప ఛెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? కుటుంబంతో చర్చించండిసినిమాకు వెళ్లినప్పుడు హీరో ఎందుకు నచ్చుతాడు? విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి ఆలోచించండి. గుణగణాలు, మంచితనం వల్ల మా హీరో అని అనుకుంటాం. మోసాలు, అబద్ధాలు, కుట్రలు పన్నే క్యారెక్టర్‌ను విలన్ అంటాం. నిజ జీవితంలో, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరంతా ఇంటికి వెళ్లాక కాసేపు కుటుంబ సభ్యులతో కూర్చుని నింపాదిగా మాట్లాడండి. చిన్నపిల్లల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అవ్వాతాతలు, ఆడపడుచుల అంతరంగాన్ని గమనించండి. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందనే నమ్మకం కలుగుతుందో వారితోనే అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నా. 2014లో చంద్రబాబు ముఖ్యమైన మోసాలివీ..► రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా?► ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఒక్కరికైనా ఇచ్చాడా?► అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా?► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా?► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ► సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ► ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. కట్టాడా? టెక్కలిలో లేదా శ్రీకాకుళంలో ఏమైనా కనిపిస్తోందా? ► ముఖ్యమైన హామీలంటూ ఒక్కటైనా నెరవేర్చాడా? ► పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే అదీ లేదు.► ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. -
టెక్కలి సభలో సీఎం జగన్ పొలిటికల్ పంచ్‌లు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ‘‘మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే. కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలంటూ టెక్కలి బహిరంగ సభ వేదికగా ప్రతిపక్షాల కుట్రలను సీఎం జగన్ తిప్పికొట్టారు. అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దోచుకోవడం, పంచుకోవడం వారి అలవాటు. మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ధనికులకు, పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచివేశాం. డబుల్ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్..బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?చంద్రబాబు మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేను.చంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వనుఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదు.పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలువిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాసుపత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం600లకు పైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కా చెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తుందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోందిమాట మీద నిలబడే మీ జగన్ కావాలా?. మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా?సింగ్‌పూర్‌ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుందిఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట నమ్ముతారా?.ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు వస్తున్నాడు -
అచ్చోసిన క్రిమినల్
దశాబ్దాల రాజకీయ వారసత్వాన్ని ఆయన అక్రమాలకు అనువుగా మార్చుకున్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినకాడికి దోచుకున్నారు. అధికారులను బెదిరించి...రికార్డులు తారుమారు చేసి... అనుచరులతో కలసి భూదందా నడిపారు. సహజసిద్ధంగా లభ్యమయ్యే గ్రానైట్‌ను అక్రమంగా తవ్వేసి అధికారుల కళ్లుగప్పి ఎగుమతి చేసుకున్నారు. తమ మాట విననివారినీ.. ఎదురు తిరిగిన వారిని మట్టుబెట్టడం.. లేకుంటే వారిని సామాజిక బహిష్కరణ చేసి బెదిరించడం అలవాటుగా చేసుకున్నారు. ఓ ప్రతిపక్షం రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఈయన ఓ విడత అమాత్యపదవి వెలగబెట్టి ఏకంగాపెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని ఓ తెలుగుదేశం నాయకుడి అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయంగా ఆయనకున్న పరపతిని భూదందాలకు, అక్రమంగా గ్రానైట్ తరలింపునకు వాడుకుంటున్నారు. అడ్డుకునే అధికారులపై విరుచుకుపడుతున్నారు. ఆయన సోదరుడు కోటబో మ్మాళి మండలం నిమ్మాడ సమీపంలో పెద్దబమ్మిడి గ్రామంలో 3.15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి గోడౌన్ నిర్మించారు. సాగునీటి కాలువ మూసేసి గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ నిర్మించారు. సాగునీటి కాలువను సైతం మూసేశారు.ఆ కాలువపై ఆధారపడిన 40 ఎకరాలకు సాగునీరు నిలిచిపోయింది. ఆక్రమించుకున్న భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు కూడా మాయం చేశారు. అధికారంలో ఉండగా కబ్జా చేసిన భూములను తమకు తెలిసిన వ్యక్తుల పేరు మీదకు మార్చేసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారు. అధికారుల స్టాంపు, డిజిటిల్ సిగ్నేచర్‌ను తమ గుప్పెట్లో పెట్టుకుని అక్రమాలను కొనసాగించారు.దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దౌర్జన్యానికి పాల్పడేవారు. తన అనుచరులను బినామీలుగా మార్చుకుని వారి పేరున అనేక పట్టాలు సృష్టించుకున్నారు.టీడీపీ హయాంలో కోటబొమ్మాళి మండల కేంద్రంలో పెద్ద చెరువు అభివృద్ధి పేరుతో సుమారు 12 ఎకరాలను కబ్జా చేశారు. గరీబుల గెడ్డ పరీవాహక భాగంలో సుమారు 7 ఎకరాలు తన అనుచరుడి పేరున కబ్జాచేశారు. ఇవి కొన్ని ఆక్రమణలు మాత్రమే. ఇవిగాకుండా తన అనుచరులు చేసిన భూదందాలకు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రానైట్ అక్రమాలతో ప్రభుత్వ ఆదాయానికి గండిఆ నాయకుడి కుటుంబ సభ్యులు గ్రానైట్‌ను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. దీనిపై మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి పక్కా ఆధారాలతో కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 379, 420, 477–ఎ, 406, 120బి, 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ నాయకుడి కుమారుడి పేరున 2018 ఏప్రిల్ 23వ తేదీ నుంచి 2038 ఏప్రిల్ 22వ తేదీ వరకు దాదాపు 20 ఏళ్ల మినరల్ డీలర్ లైసెన్సు తీసుకున్నారు.రఫ్ గ్రానైట్ బ్లాక్‌ల కటింగ్, పాలిషింగ్ తదితర కార్యక్రమాలను వీరి ఇండస్ట్రీ చేపడుతుంది. క్వారీల నుంచి గ్రానైట్ బ్లాక్‌లను అధికారికంగా అనుమతి తీసుకుని తమ ఇండస్ట్రీకి రవాణా చేసుకోవాల్సి ఉంది. కానీ వీరి ఇండస్ట్రీలో అందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయని అధికారుల తనిఖీల్లో తేలింది. 172.87క్యూబిక్ మీటర్ల బరువైన 23 బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టుగా తేల్చారు. దీనివిలువ అపరాధ రుసుంతో కలిపి రూ.6 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం. ఇప్పటివరకూ వీరి ద్వారా రూ.11,43,29,120 మేర అక్రమాలు జరిగాయి. మరో రూ.3,18,72,960 మేర జీఎస్టీ చెల్లించకుండా ఎగ్గొట్టారు. అ«ధికారం లేకపోయినా అధికారులు కళ్లుగప్పి అక్రమ రవాణాకు పాల్పడ్డారంటే ఈ నాయకుడి ఫ్యామిలీ ఎంత బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన నేర చరిత్ర చాంతాడంతఆయన మాట కాదన్నవారు ఎవరైనా అదృశ్యమైపోతారు. కారణం మాత్రం ఇప్పటికీ చిదంబర రహస్యం. తొలుత బెదిరింపులు.. ఆ తర్వాత దౌర్జన్యాలు.. అప్పటికీ లొంగకపోతే సామాజిక, గ్రామ బహిష్కరణలు..ఇంకా వినకపోతే దాడులు చేయడం ఇక్కడ పరిపాటి. ఈఎస్ఐ స్కామ్‌లోనూ కీలకంగా మారి... టీడీపీ అధికారంలో ఉండగా మంత్రి హోదాలో ఈయన చేసిన ఈఎస్ఐ స్కామ్ జిల్లాకే మాయని మచ్చగా మారింది. అడ్డొచి్చన అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150 కోట్లకు పైగా జరిగిన స్కామ్‌లో సూత్రధారిగా నిలిచారు. మందు బిల్లులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో సొమ్ము నొక్కేశారు.బినామీలను తెరపైకి తెచ్చి నామినేటెడ్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల విలువైన మందులు, పరికరాలను యథేచ్ఛగా కొనుగోలు చేసి నచి్చనట్టుగా బిల్లులు చేసేసుకున్నారు. ఈ బండారం కాస్తా విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు, పనులు నామినేషన్‌పై అప్పగించాలని మంత్రి హోదాలో ఆ నాయకుడు ఇచి్చన సిఫారసు లేఖతో మొత్తం గుట్టు రట్టు అయింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. వీటన్నింటిపైనా పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. నమోదైన కేసుల వివరాలు► అవినీతి నిరోధక శాఖ క్రైమ్ నంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అధికారులు కేసు నమోదు చేశారు. ► 2008 ఆగస్టు 11న కోటబో మ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద మూడో విడత పింఛన్ల పంపిణీని అడ్డుకున్నందుకు ఎఫ్ఐఆర్ నంబర్ 150/2008 ప్రకారం 354, 323, 506(1) అండ్ (2) రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం మహిళను అవమానపరిచేలా ప్రవర్తించి, గాయపర్చి, బెదిరించినందుకు తదితర కారణాలతో కేసులు నమోదయయ్యాయి. ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి ప్రచారానికి వెళ్లిన ఆయన్ను అడ్డుకున్న మహిళపై దారుణంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై నౌపడ పోలీస్‌స్టేషన్‌లో మహిళలు ఫిర్యాదు చేయగా, 341, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత వారిని బెదిరించి రాజీ యత్నాలు చేశారు. ► 2021 ఫిబ్రవరిలో నిమ్మాడలో కింజరాపు అప్పన్న అనే వ్యక్తి సర్పంచి స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఆ నాయకుడి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 44/2021 ప్రకారం 147, 148, 307, 324, 506, 341, 384, 188 రెడ్ విత్ 149 ఐపీసీ, సెక్షన్ 123 ఆఫ్ దీ పీపుల్ రిప్రజెంట్ చట్టం, సెక్షన్ 212 ఆఫ్ ద ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1995 కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఆ సమయంలో 14 రోజులు రిమాండ్‌లో ఉన్నారు. ఇవిగాకుండా మరెన్నో కేసులు ఆయనపై నమోదై ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్‌దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
Advertisement